ముంబై: మహరాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రతిపక్షాలకు చెందిన నేతల బ్యాగుల్ని మాత్రమే తనిఖీ చేస్తారని, అధికార పార్టీ నేతల బ్యాగులను పరిశీలించరంటూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. అందుకు కౌంటర్‌గా బుధవారం ఎన్నికల అధికారులు మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బ్యాగులను చెక్ చేశారు.
నవంబర్ 20న మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సీఏం ఏక్‌నాథ్ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్‌కు తన హెలికాప్టర్‌తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే వ్యక్తిగత స్కూట్‌కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్‌కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్‌కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
హెలికాప్టర్‌లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును ఎన్నికల అధికారులు చెక్ చేశారు. హెలికాప్టర్‌లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.
(Source: Shiv Sena) pic.twitter.com/44CnWiTYzG— ANI (@ANI) November 13, 2024
ప్రతిపక్షాల నేతలకేనా ఈ నిబంధనలు
కాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం యవత్మాల్‌కు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగ్‌ని తనిఖీ చేశారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు,బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాదు, యావత్మాల్‌లో తన బ్యాగులను తనిఖీ చేసిన తర్వాత ఠాక్రే ఎన్నికల అధికారులను వారి పేరు, వారి పోస్టింగ్ గురించి అడిగారు. సదరు అధికారులు సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీల బ్యాగ్‌లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు.
అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల నిబంధనల మేరకు దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే ఠాక్రే బ్యాగును పరిశీలించామన్నారు.
#WATCH | #MaharashtraElections2024: Uddhav Thackeray’s Bags Checked By EC Officials Again; Video Surfaces#ShivSenaUBT #UddhavThackeray #Latur #Maharashtra pic.twitter.com/FxMVWufcxY
— Free Press Journal (@fpjindia) November 12, 2024
Comments
Please login to add a commentAdd a comment