పోలీసుల అదుపులో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని శివసేన తప్పుబట్టింది. ముఖ్యఘట్టాలను విస్మరించి ఇటువంటి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమని విమర్శించింది.
1965 యుద్ధం 50వ వార్షికోత్సవం, విదర్భ, మరాత్ వాడ ప్రాంత ప్రజల సమస్యలను విస్మరించి ఇంద్రాణి ముఖర్జియాకు సంబంధించిన వార్తలను కవర్ చేయడాన్ని దుయ్యబట్టింది. సైనికుల త్యాగాలను పట్టించుకోకుండా ఇంద్రాణికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియా వార్తలుగా మలుస్తోందని 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో చురకలు పెట్టింది.
జైలులో ఇంద్రాణి ఏం తింటుంది, ఏం తాగుతుంది, ఆమె నిద్రపోతుందా, లేదా విషయాలు రిపోర్ట్ చేస్తోందని విమర్శించింది. కరువు పరిస్థితులు, సరిహద్దు వంటి కీలక సమస్యలను మీడియా పట్టించుకోవడం లేదని శివసేన ధ్వజమెత్తింది.