తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం కేరళ సీఎం పినరయ్ విజయన్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే కేరళలో రికార్డు స్థాయిలో శనివారం 29,682 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్వాప్తంగా కేరళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. కరోనా క్వారంటైన్, ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment