తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు.
కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పిందని సీఎం పినరయి గుర్తుచేశారు. ఆదే మాటపై తమ ప్రభుత్వం కట్డుబడి ఉంటుందని తెలిపారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు.
చదవండి: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment