తిరువనంతపురం: ఎన్నికల సందర్భంగా విస్తృతంగా తిరగడంతో ముఖ్యమంత్రి కరోనా వ్యాక్సిన్ పొందారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటేసి ఇంట్లో ఉన్న ముఖ్యమంత్రికి నేడు కరోనా సోకింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం పట్టణం మొదలుకుని పల్లెలు తిరిగారు. విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మార్చి 3వ తేదీన వ్యాక్సిన్ పొందిన ఆయనకు కరోనా సోకడం ఆందోళన కలిగించే విషయం.
ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో ఆయనకు తాజాగా కరోనా పాజిటివ్ తేలింది. ఎలాంటి లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. ఇంట్లోనే స్వీయ నిర్బంధం అయ్యానని ట్వీట్ చేశారు. చికిత్స కోసం కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతానని సీఎం విజయన్ తెలిపారు. అయితే ఆయనకు ఎన్నికల ప్రచారంలో కరోనా వ్యాపించి ఉంటుందని చర్చ నడుస్తోంది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో ఏప్రిల్ 3వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. మళ్లీ ఈసారి పినరయి ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తిస్తోంది. నిన్న ఒక్కరోజే 4,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
చదవండి: కోలుకున్న క్రికెట్ దేవుడు: ఆస్పత్రి నుంచి ఇంటికి
I have been confirmed Covid +ve. Will get treated at the Government Medical College, Kozhikkode. Request those who have been in contact with me recently to go into self observation.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) April 8, 2021
Comments
Please login to add a commentAdd a comment