తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఆరోగ్యం, రుణ సహాయం, సంక్షేమ పథకాల అమలు, ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ, భోజన సౌకర్యం, పన్ను తగ్గింపులు, బకాయిల చెల్లింపులకు ఈ నిధిని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రూ. 10కే కిలో బియ్యం(దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలు కాకుండా) పంపిణీ.. అదే విధంగా రెండు నెలల పెన్షన్ ముందుగానే ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా గురువారం కేరళలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.(తెలంగాణ సరిహద్దుల్లో 18 చెక్ పోస్టులు : కేసీఆర్)
కాగా భారత్‌లో తొలిసారిగి కేరళలో తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే నాలుగు కరోనా మరణాలు(కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్) నమోదయ్యాయి. ఇక ఈ మహమ్మారి విస్తరిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలు, పెళ్లి మండపాలు, సినిమా హాళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అదే విధంగా గుంపులు గుంపులుగా ఒక్కచోట చేరకూడదని.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సూచిస్తున్నాయి. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా తమను తాము రక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. (కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు)
20,000 Cr special package for the State to overcome #COVID19. It takes an inclusive view and ensures that no one is left behind. The plan covers health package, loan assistance, welfare pensions, MNREGS, free food grains, subsidized meals, tax relief & arrear clearance.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) March 19, 2020
Comments
Please login to add a commentAdd a comment