CoronaVirus: Kerala CM Pinarayi Vijayan Praises Allu Arjun Over Donation to Fight Against Covid-19 | అల్లు అర్జున్‌ పై కేరళ సీఎం ప్రశంసల వర్షం - Sakshi
Sakshi News home page

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

Published Fri, Apr 10 2020 3:38 PM | Last Updated on Fri, Apr 10 2020 4:38 PM

Pinarayi Vijayan Praises Allu Arjun - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. కేరళలో కరోనా నివారణ చర్యలకు సాయం అందించిన బన్నీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేరళకు అల్లు అర్జున్‌ రూ. 25 లక్షల సాయం అందించారని తెలిపిన ఆయన.. కేరళ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో సమానంగా కేరళకు కూడా సాయం అందించాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పగా ఉందని కొనియాడారు.

దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన తర్వాత కరోనా నివారణ చర్యల కోసం బన్నీ తనవంతుగా కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 50 లక్షల చొప్పను, కేరళకు రూ. 25 లక్షలు అందజేశారు. కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు బన్నీ కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కేరళలో ప్రతిష్టాత్మక ‘నెహ్రూ ట్రోపీ బోట్ రేస్’కు బన్నీని సీఎం విజయన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించి, సత్కరించిన సంగతి తెలిసిందే. 

చదవండి : కరోనా.. మూడు రాష్ట్రాలకు బన్నీ విరాళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement