న్యూఢిల్లీ: కేరళలో ఇటీవల కొలువుదీరిన తాజా కేబినెట్‌లో 60 శాతం మంది మంత్రులపై నేరారోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు మరో 20 మంది మంత్రులుగా ప్రమాణం చేయడం తెల్సిందే. కేబినెట్‌లో మొత్తం 21 మంది ఉన్నారు. వీరిలో 60 శాతం మందిపై.. అంటే 12 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
వారి ఎన్నికల అఫిడవిట్లలోని వివరాల ఆధారంగా కేరళ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) ఈ విషయాన్ని నిగ్గుతేల్చాయి. కేరళ కేబినెట్‌లో ఐదుగురు మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం మంత్రుల్లో 65 శాతం మంది.. అంటే 13 మంది కోటీశ్వరులే. మంత్రుల సగటు ఆస్తి రూ.2.55 కోట్లు.
(చదవండి: ‘టూల్‌కిట్’ కేసులో ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసు)
Comments
Please login to add a commentAdd a comment