తిరువనంతపురం: కేంద్రం అమలు చేయాలని చూస్తున్న పౌరసత్వసవరణ చట్టంను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రంలో భారీ ఎత్తున మానవహారం నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. సీఏఏ అనేది మత సంఘర్షణలకు దారి తీసే దుశ్చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలు ఇందులో భాగంగా తమ వ్యతిరేకతను కేంద్రానికి తెలియజేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. భారతదేశం లౌకికవాదానికి ప్రతీక. అలాంటి, లౌకికతత్వానికి భంగం కలిగిస్తామంటే ఎలా ఊరుకుంటామని కేరళ సీఎం కేంద్రంపై మండిపడ్డారు. కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీని అమలుకానివ్వమని ఆయన అన్నారు. కాగా, ఇప్పటికే కేరళ అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. (అక్కడ తొలిసారిగా త్రివర్ణ పతాక రెపరెపలు)
Comments
Please login to add a commentAdd a comment