గుజరాత్ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న వేళ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ మరోసారి బహిర్గతమైంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం వైఖరిని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో శశిథరూర్ పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది.
తాజాగా.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తయారుచేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీనియర్ నేత శశిథరూర్‌కు స్థానం కల్పించలేదు. దీంతో, శశిథరూర్‌కు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురైంది. అయితే, గుజరాత్‌లో ప్రచారం చేసేందుకు శశిథరూర్‌ను కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఆహ్వానించింది. కాగా, క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో ప్రచారం నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అయితే, లిస్ట్‌లో పలు రాష్ట్రాల లీడర్లకు స్థానం కల్పించి శశిథరూర్‌కు చోటు కల్పించకపోవటంతో కాంగ్రెస్‌లో ముసలం మరోసారి బహిర్గతమైందని పలువురు పొలికటల్ లీడర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును తయారు చేసింది. లిస్టులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, సచిన్ పైలట్, కన్హయ్య కుమార్, అశోక్ చవాన్, తదితరులకు చోటు కల్పించింది.
Congress releases a list of star campaigners for #GujaratElections.
Party chief Malliakrjun Kharge, UPA chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi, general secy Priyanka Gandhi Vadra, CMs Ashok Gehlot-Bhupesh Baghel, Sachin Pilot, Jignesh Mevani, Kanhaiya Kumar to campaign. pic.twitter.com/wXr3NAGdcS— ANI (@ANI) November 15, 2022
Comments
Please login to add a commentAdd a comment