campaigners list
-
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. శశిథరూర్‌కు ఘోర అవమానం!
గుజరాత్ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న వేళ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ మరోసారి బహిర్గతమైంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం వైఖరిని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో శశిథరూర్ పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది. తాజాగా.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తయారుచేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీనియర్ నేత శశిథరూర్‌కు స్థానం కల్పించలేదు. దీంతో, శశిథరూర్‌కు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురైంది. అయితే, గుజరాత్లో ప్రచారం చేసేందుకు శశిథరూర్‌ను కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఆహ్వానించింది. కాగా, క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో ప్రచారం నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అయితే, లిస్ట్‌లో పలు రాష్ట్రాల లీడర్లకు స్థానం కల్పించి శశిథరూర్‌కు చోటు కల్పించకపోవటంతో కాంగ్రెస్‌లో ముసలం మరోసారి బహిర్గతమైందని పలువురు పొలికటల్ లీడర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును తయారు చేసింది. లిస్టులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, సచిన్ పైలట్, కన్హయ్య కుమార్, అశోక్ చవాన్, తదితరులకు చోటు కల్పించింది. Congress releases a list of star campaigners for #GujaratElections. Party chief Malliakrjun Kharge, UPA chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi, general secy Priyanka Gandhi Vadra, CMs Ashok Gehlot-Bhupesh Baghel, Sachin Pilot, Jignesh Mevani, Kanhaiya Kumar to campaign. pic.twitter.com/wXr3NAGdcS — ANI (@ANI) November 15, 2022 -
టీఆర్ఎస్కు 15 మంది స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సహా 15 మంది ముఖ్యనేతలు ముందుండి నడిపించనున్నారు. ఈ మేరకు 15 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించింది. ఈ జాబితాలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు, ఎంపీలు జె.సంతోష్‌కుమార్, బి.వినోద్‌కుమార్, పార్టీ నేతలు బండ ప్రకాశ్, ఎస్.వేణుగోపాలాచారి, ఆర్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.రవీందర్రావు, జి.రాంబాబు యాదవ్ పేర్లు ఉన్నాయి. సీపీఎం సైతం 15 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి అందజేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు జి.నాగరాజు, చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, డీజీ నరసింహారావు, పి.సుదర్శన్, చుక్కా రాములు, ఎం.సాయిబాబ, జాన్ వెస్లీ, పాలడుగు భాస్కర్, నున్న నాగేశ్వర్రావు, ముల్కపల్లి రాములు, బుగ్గవీటి సరళ, అన్నవరపు కనకయ్య, ఎం.సుధాకర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించనున్నారు. -
బాబాయికి అబ్బాయ్ మళ్లీ ఝలక్
సమాజ్‌వాద్ పార్టీనంతా తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్న సీఎం అఖిలేష్ యాదవ్ ఇటు బాబాయికి భలే ఝలకిలిస్తున్నారు. తండ్రి ములాయం సింగ్‌కు, తనకు తీవ్ర స్థాయిలో చిచ్చులు రేపిన శివ్‌పాల్ యాదవ్ కున్న అధికారాలన్నింటిన్నీ కత్తిరిస్తూ పోతున్నారు. టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చిన అఖిలేష్‌యాదవ్, బాబాయిని కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితం చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ తరుఫున తొలి దశ పోల్స్‌కు ప్రచారం నిర్వర్తించాల్సిన జాబితాను సమాజ్ వాద్ పార్టీ విడుదల చేసింది. ఆ జాబితాలో శివ్‌పాల్ యాదవ్‌ను చేర్చలేదు. ప్రత్యర్థి బాబాయికి టిక్కెట్ ఇవ్వడంతో అఖిలేష్, శివ్‌పాల్ మధ్య నెలకొన్న సంక్షోభం సమసిపోయినట్లేనని కార్యకర్తలు భావించారు. కానీ అంతకముందు పార్టీలో పొరపచ్చలు రేపిన బాబాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానీయకూడదని, ఆయన్ను ప్రచారానికి వాడుకోకూడదని అఖిలేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేతాజీ కోరికమేరకు శివ్‌పాల్‌కు జస్వంత్ నగర్ నియోజకవర్గ టిక్కెట్‌ను అఖిలేష్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తండ్రి మాట మేరకు మళ్లీ తదుపరి ప్రచార జాబితాల్లో శివ్‌పాల్ పేరును చేర్చినా ఆశ్చర్యం పోవాల్సినవసరం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు ఏడు దశల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రచార పోరుకు పార్టీలన్నీ సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. ఎస్పీ-కాంగ్రెస్‌లకు పోటీగా ఎన్నికల ప్రచారానికి కమలనాథులు సిద్ధమయ్యారు. బీఎస్పీ కూడా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.