టీఆర్‌ఎస్‌కు 15 మంది స్టార్‌ క్యాంపెయినర్లు | TRS has 15 star campaigners | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు 15 మంది స్టార్‌ క్యాంపెయినర్లు

Published Sun, Nov 18 2018 1:51 AM | Last Updated on Sun, Nov 18 2018 1:51 AM

TRS has 15 star campaigners - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచార రథాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సహా 15 మంది ముఖ్యనేతలు ముందుండి నడిపించనున్నారు. ఈ మేరకు 15 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించింది. ఈ జాబితాలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ జనరల్‌ సెక్రటరీ కె.కేశవరావు, ఎంపీలు జె.సంతోష్‌కుమార్, బి.వినోద్‌కుమార్, పార్టీ నేతలు బండ ప్రకాశ్, ఎస్‌.వేణుగోపాలాచారి, ఆర్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.రవీందర్‌రావు, జి.రాంబాబు యాదవ్‌ పేర్లు ఉన్నాయి.

సీపీఎం సైతం 15 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి అందజేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు జి.నాగరాజు, చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, డీజీ నరసింహారావు, పి.సుదర్శన్, చుక్కా రాములు, ఎం.సాయిబాబ, జాన్‌ వెస్లీ, పాలడుగు భాస్కర్, నున్న నాగేశ్వర్‌రావు, ముల్కపల్లి రాములు, బుగ్గవీటి సరళ, అన్నవరపు కనకయ్య, ఎం.సుధాకర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement