ఢిల్లీ: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీపై విమర్శలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందని ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యం అయింది. కానీ, అది భారత్‌లో కాదు. మరో దేశంలో సాధ్యం అయిందని ‘ఎక్స్’ వేదికగా సెటైర్లు వేశారు.
Finally “ab ki baar 400 paar” happened — but in another country! pic.twitter.com/17CpIp9QRl
— Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2024
‘మొత్తానికి బీజేపీ చేసిన ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదం సాధ్యం అయింది. కానీ, అది మరో దేశంలో!’ అని శశీ థరూర్ సెటైర్ వేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. తాము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదాన్ని హోరెత్తించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీయే కూటమి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సాయంతో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక.. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది.
ఇక.. బ్రిటన్‌లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లు గెలవగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment