శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం  | Shashi Tharoor To Get Frances Highest Civilian Award | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం 

Published Fri, Aug 12 2022 7:19 AM | Last Updated on Fri, Aug 12 2022 7:19 AM

Shashi Tharoor To Get Frances Highest Civilian Award - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం కెవలియర్‌ డీ లా లీజియన్‌ డీహొనర్‌ అందుకోనున్నారు. థరూర్‌ రచనలు, ప్రసంగాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి తమ ప్రభుత్వం ఎంపిక చేసిందని ఫ్రాన్స్‌ రాయబారి ఎమ్మానుయేల్‌ లెనాయిన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన థరూర్‌కు లేఖ రాశారు.

కెవలియర్‌ డీ లా లీజియన్‌ డీ హొనర్‌ పురస్కారాన్ని నెపోలియన్‌ బొనాపార్టే 1802లో నెలకొల్పారు. పౌర, సైనికరంగాల్లో విశిష్ట సేవలందించే వారికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. శశిథరూర్‌ 2009 నుంచి కేరళలోని తిరువనంతపురం పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. గతంలో ఐక్యరాజ్య సమితి అండర్‌ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. గతంలో ఐరాస సెక్రటరీ జనరల్‌ పదవికి పోటీ చేశారు. 

చదవండి: (మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement