న్యూఢిల్లీ: తాజాగా అమల్లోకి వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని, ఈ హామీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఢిల్లీలో ఆయన సమర్థించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఏఏ చట్టం రాజ్యాంగం పరంగానే కాకుండా నైతికంగా కూడా పెద్ద తప్పు. పౌరసత్వం చట్టంలో మతాల ప్రస్తావన తీసుకురావడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. చట్టం పరిధిలో నుంచి ఒక మతాన్ని తప్పించకుండా ఉండి ఉంటే మేం సీఏఏను ఆహ్వానించి ఉండే వాళ్లం’ అని శశి థరూర్ పేర్కొన్నారు. కాగా, సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు సోమవారం (మార్చ్11) కేంద్ర ప్రభుత్వం రూల్స్ నోటిఫై చేసింది.
ఇదీ చదవండి.. సీఏఏపై దళపతి విజయ్ ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment