
డ్రోన్ దృశ్యం
లండన్ : పందెం సరదా ఓ బాలిక ప్రాణం మీదకు తెచ్చింది. చావు తప్పినా.. చేసిన తప్పుకు పోలీసు కేసులు ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌షేర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కేంబ్రిడ్జ్‌షేర్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక కొద్దిరోజుల క్రితం తన మిత్రులతో ప్లేయింగ్ చికెన్ పందెం కాసింది. ఈ పందెం ప్రకారం ఆమె రైల్వే ట్రాక్ మీద.. ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలబడాలి. రైలు చాలా దగ్గరకు వచ్చేంతవరకు ఎవరైతే పక్కకు తప్పుకోకుండా నిలబడతారో వారు విజయం సాధించినట్లు. బాలిక కూడా అలానే నిలబడింది. ఇది గమనించిన ఓ మహిళ బాలికను రక్షించటానికి ప్రయత్నించింది.
అయితే, సదరు మహిళను కొట్టి అక్కడినుంచి పంపేసింది. తను రైలుకు అడ్డంగా నిలబడిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా డ్రోన్ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ లోపే బాలిక రైలునుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బాలికను అరెస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘణ, దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment