వైరల్‌ : భూమ్మీద నూకలుండటం అంటే ఇదే..! | Netherland Cyclist Narrowly Escape Oncoming Train By A Split Second | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 5:20 PM | Last Updated on Fri, Nov 30 2018 5:29 PM

Netherland Cyclist Narrowly Escape Oncoming Train By A Split Second - Sakshi

అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పళ్లు ఊడిపోతాయని సినిమాలో ఓ స్టార్‌ హీరో డైలాగ్‌.. మరి అదృష్టం బాగుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. వెంట్రుకవాసిలో మృత్యువుని తప్పించుకున్న ఓ సైక్లిస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైల్వే లైన్‌ల వద్ద భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతుంది ఈ సంఘటన. నెదర్లాండ్‌లో జరిగింది ఈ సంఘటన. రైల్వే క్రాసింగ్‌ వద్ద ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో తెలుపుతూ ఓ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది.

వీడియోలో ఉన్న దాని ప్రకారం ఓ సైకిలిస్టు రైల్వే ట్రాక్‌ దాటే ప్రయత్నంలో ఓ వైపు నుంచి రైలు వస్తుందని అక్కడే ఆగాడు. అది వెళ్లిపోయాక ట్రాక్‌ దాటుతున్నాడు. అదే సమయంలో మరో ట్రాక్‌ పైనుంచి దూసుకొస్తున్న రైలును ఆ సైక్టిస్ట్‌ చూసుకోలేదు. దీంతో సైకిల్‌ తొక్కుకుంటూ ముందుకెళ్లాడు. రైలు చాలా సమీపంలోకి వచ్చేంతవరకూ సదరు సైక్లిస్ట్‌ దాన్ని గమనించలేదు. చూసిన వెంటనే అప్రమత్తం కావడంతో కేవలం అర సెకన్‌ వ్యవధిలో మృత్యువుని తప్పించుకోగలిగాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది చూశారు.  వీడియో చూసిన వారంతా సదరు వ్యక్తి అదృష్టాన్ని తెగ పొగుడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement