![three dead bodys found at nadikudi railway track - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/24/wgl.jpg.webp?itok=jPZxv-sE)
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కలకలం రేగింది. నడికుడి జంక్షన్‌లోని రైల్వేట్రాక్ పై బుధవారం మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ట్రాక్‌పై మూడు కిలోమీటర్ల పరిధిలో మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు.
నడికూడి రైల్వేస్టేషన్, కేశానుపల్లి, గోగులపాడు సమీపంలో ఈ మూడు గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసులు నడికుడి జంక్షన్‌లో ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్లో నుంచి జారి పడ్డారా? లేక హతమార్చి పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment