సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. హిందూపురం-బెంగుళూరు వెళ్లే రైలు మార్గంలో పట్టాలపై మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరు గోళాపురంకు చెందిన ఆదినారాయణగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ముకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపి రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ముగ్గురి మృతదేహాలు రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో పడి ఉన్నాయి. ఇదే రైలు మార్గంలో హిందూపురం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో మరో వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..
Published Tue, Oct 15 2019 12:21 PM | Last Updated on Wed, Oct 16 2019 8:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment