ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్‌లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.
ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్‌లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment