రైల్వే ట్రాక్‌పై కొండ చరియలు
విశాఖపట్నం: కొత్తవలస–కిరండూల్(కేకే) లైన్ మనబార్–జరాటి స్టేషన్ పరిధిలో రైల్వేట్రాక్‌పై ఆదివారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
గమ్యం కుదించిన రైళ్లు
►రూర్కెలా–జగదల్‌పూర్(18107) ఎక్స్‌ప్రెస్ ఆదివారం కోరాపుట్ వరకే నడిచింది. జగదల్‌పూర్–రూర్కెలా (18108) ఎక్స్‌ప్రెస్ సోమవారం కోరాపుట్ నుంచి బయలుదేరుతుంది.
►భువనేశ్వర్–జగదల్‌పూర్ (18447) హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం కోరాపుట్ వరకే నడిచింది. జగదల్‌పూర్–భువనేశ్వర్(18448) సోమవారం కోరాపుట్ నుంచి బయలుదేరుతుంది.
► ఆదివారం రాత్రి బయలుదేరిన విశాఖపట్నం–కిరండూల్(18514) నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ వరకే నడిచింది. కిరండూల్–విశాఖపట్నం(18513)ఎక్స్‌ప్రెస్ సోమవారం కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది.
► సోమవారం ఉదయం బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్ (08551) పాసింజర్ స్పెషల్ అరకు వరకే నడుస్తుంది. కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ సోమవారం అరకు నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది.
►హౌరా–జగదల్‌పూర్(18005) సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాయగడ వరకే నడిచింది. జగదల్‌పూర్–హౌరా(18006) ఎక్స్‌ప్రెస్ సోమవారం రాయగడ నుంచి హౌరా బయలుదేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment