
ధనలక్ష్మి (ఫైల్)
గంపలగూడెం(తిరువూరు): మండలంలోని తునికిపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇక్కడ సమీపంలోని తెలంగాణా రాష్ట్రం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం... గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి చెందిన బుర్రి ధనలక్ష్మి(19)మధిరలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. మద్యానికి బానిసైన తండ్రి నర్సింహారావు గురువారం రాత్రి మద్యం తాగి కుమార్తెతో ఘర్షణకు దిగాడు.
ఉదయాన్నే పరీక్షరాసేందుకు మధిరకు బయలుదేరి వెళ్లింది. మనస్తాపంతో ఉన్న ఆమె మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష అయినప్పటికీ ముందుగానే మధిరకు చేరుకుని ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళుతున్న పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment