ఫొటో చూడగానే సీన్ అర్థమైపోతోంది కదూ! రైలు ఢీకొట్టడంతో అమెజాన్ డెలివరీ వ్యాన్ రెండు ముక్కలైంది. మరి ఇందులో ఉన్నవారి పరిస్థితేంటి? బతికి బట్టకట్టే అవకాశం కొంచెం కూడా లేదనే అనిపిస్తోంది కదా?. కానీ, ఈ వ్యాన్ డ్రైవర్ అలెగ్జాండర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద తీవ్రతకు వ్యాన్ రెండు ముక్కలైనా.. అతడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
చదవండి: కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ: చెవులు పిండేస్తూ.. ఫ్లూటు ఊదేస్తూ..
‘‘రెడ్‌లైట్ లేకపోవడంతో మామూలుగా వెళ్లిపోయాను. ట్రాక్‌పైకి వెళ్లేసరికి ఒక్కసారిగా రైలు శబ్దం. వెంటనే తేరుకుని వేగం పెంచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వ్యాన్ రెండు ముక్కలైంది. నేను మాత్రం బతికే ఉన్నాను. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే’’అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు. అన్నట్టు.. ఆ రోజునే అతడు 33వ ఏట అడుగుపెట్టాడు.
చదవండి: ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..!
Comments
Please login to add a commentAdd a comment