శోభాయమానం
శోభాయమానం
Published Sat, Jul 23 2016 11:59 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్యపరిమళ పుష్పార్చన అత్యంత శోభాయమానంగా శనివారం రాత్రి నిర్వహించారు. వివిధ రకాలైన గులాబీలు, చామంతులు, లిల్లిపూలు, కదంబాలు, వందలాది రకాల పుష్పాలతో పుప్పార్చనను ఘనంగా నిర్వహించారు. కడియం లంక గ్రామ రైతులు తమ పూలతోటలో పూసిన సుమారు లక్షల పుష్పాలను ఈ పూజ కోసం వినియోగించారు. ఒకవైపు చతుర్వేద పఠనం, మరోవైపు బుట్టలతో పుష్పాలను ముతైదువులు అందిస్తుండగా ఉత్సమూర్తులకు విశేష పుష్పార్చన పూజలను నిర్వహించారు. ఈ పుష్పార్చనను తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైనదిగా భావించారు. కాగా పుష్ప కైంకర్యంలో భాగంగా ఆలయప్రాంగణం, ధ్వజస్తంభం, ఆలయ ద్వారాలను పుష్పాలతో అలంకరించారు.
– శ్రీశైలం
Advertisement
Advertisement