పూలను సాధారణంగా పూజ కోసం, ఇంటి డెకరేషన్ కోసం వాడుతుంటాం. మగువలలు తలలో అలంకరించుకోవడానికి తప్పనసరిగి వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. అంతవరకే మనకు తెలుసు. కానీ పూలను వంట్లో ఉపయోగించొచ్చా అనే విషయం గురించి విన్నారా?. ఔను వాటిని వంటల్లో హ్యాపీగా ఉపయోగించి వండేయొచ్చంటున్నారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ఎలాగో తెలుసా..!
వంటల్లో వినియోగించే తినదగిన పువ్వులు సరైన విధంగా ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిల్లో పురుగులు, పాడైనవి లేకుండా మంచిగా ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా రసాయనాలు చల్లనివి తినడానికి వినియోగించడం ముఖ్యం. లేదంటే మనం చేసిన రెసిపీ రుచిలో తేడాలు వచ్చి టేస్ట్ బాగుండదని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వండే ముందే తినదగిన పువ్వులను మంచిగా ఎంపిక చేసుకుని ఉంచుకోవడం బెటర్ అని చెబుతున్నారు. ఇక వాటితో ఎలాంటి రెసీపీలు చేసుకోవచ్చంటే..
- ఎరుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు.. ఇలా విభిన్న రంగుల్లో దొరికే కార్నేషన్ పూలను ఇంటి అలంకరణ, వేడుకల్లో వేదిక అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని కేక్ డెకరేషన్ కోసమూ వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటి పూరేకల్లో ఉండే తియ్యదనం కేక్ రుచిని మరింతగా పెంచుతుందంటున్నారు. అయితే ఈ పూరేకల కింది భాగం కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించి పైభాగాన్ని కేక్ డెకరేషన్ కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
- ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే మందార పూరేకలు నోటికి పుల్లటి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో, గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారట! గులాబీ పూరేకల్ని తినేవారు చాలామందే ఉంటారు. అయితే వీటిని ఐస్‌క్రీమ్, ఇతర డిజర్ట్స్‌పై గార్నిష్ చేయడానికి ఉపయోగించచ్చు. కాస్త పెద్దగా ఉన్న గులాబీ రేకలైతే సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. అంతేకాదు.. జెల్లీస్, షుగర్ సిరప్స్ తయారీలోనూ వీటిని వాడచ్చట!.ఆయుర్వేద పరంగా మందార రేకులతో చేసిన టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుతుక్రమ సమస్యతో బాధపడే వాళ్లు ఎర్రటి మందారాన్ని చెరుకురసంతో కలిపి తీసుకుంటే ఇర్‌రెగ్యులర్ పిరియడ్ సమస్య నుంచి ఉపశమంన పొందగలరని చెబుతున్నారు.
- ఇంట్లో గార్డెన్‌లో పెంచుకునే చిట్టి చామంతుల (చామొమైల్ పువ్వులు)తో స్ట్రాంగ్‌గా ఓ టీ పెట్టుకొని తాగితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కూమా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు! డైట్, ఫిట్‌నెస్ పాటించేవారు ఈ టీని ఆశ్రయించడం మంచిదని చెబుతున్నారు
- ఆకట్టుకునే రంగులో ఉండే లావెండర్ పూలను కేక్స్, కుకీస్ తయారీలోనూ వాడచ్చంటున్నారు నిపుణులు. అలాగే బయట మార్కెట్లో ఈ పూలను తేనె, సిరప్స్, వెనిగర్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారట! ఫలితంగా వాటికి అదనపు రుచి, వాసనను జోడించచ్చు.
- పుల్లటి రుచిలో ఉండే బంతి పూరేకల్ని సలాడ్స్ డ్రస్సింగ్ కోసం, కూరల్లో గార్నిష్ కోసం వాడుకోవచ్చట!. అంతేగాదు కేక్ డెకరేషన్‌లో కూడా అందంగా కనిపించేలా అలంకరించొచ్చు.
ఉపయోగించేటప్పుడు గుర్తించుకోవాల్సివి..
- ఈ పూలను ఆహారంలో భాగం చేసుకునే క్రమంలో వాటి రుచిలో తేడా రాకుండా జాగత్త పడేల వినయోగించాలని చెబుతున్నారు చెఫ్‌లు.
- వాడిపోయినవి కాకుండా.. తాజా పూలు, పూరేకలు తీసుకున్నప్పుడే వాటి రుచి ఇనుమడిస్తుంది. అలాగే రసాయన ఎరువులు వాడకుండా పెంచినవే ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వాడే ముందు వాటిని దుమ్ముధూళి లేకుండా చక్కగా శుభ్రం చేయాలి.
- కొన్ని పూరేకల కింది భాగం వగరుగానూ, చేదుగానూ ఉంటాయి. కాబట్టి ఆ భాగాన్ని తొలగించి కూరల్లో, ఇతర వంటకాల్లో వాడితే వాటి రుచి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.
- వంటకాల్లో, గార్నిష్ కోసం వివిధ రకాల పూలను ఒకేసారి వాడచ్చు. ఫలితంగా వాటి రుచి పెరుగుతుంది. అలాగే చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
- అయితే కొన్ని రకాల పూలు కొంతమందికి పడకపోవచ్చు. కాబట్టి వీటిని తీసుకున్నప్పుడు అలర్జీ వంటి సమస్యలేవైనా ఎదురైతే.. వాటికి దూరంగా ఉండడమే మంచిది. అవసరమైతే నిపుణుల సలహాలూ తీసుకుని ఉపయోగించడం మంచింది.
Comments
Please login to add a commentAdd a comment