Edible Flowers
-
పూలను పూజల్లోనే కాదు వంటల్లో కూడా వాడేయొచ్చట..!
పూలను సాధారణంగా పూజ కోసం, ఇంటి డెకరేషన్ కోసం వాడుతుంటాం. మగువలలు తలలో అలంకరించుకోవడానికి తప్పనసరిగి వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. అంతవరకే మనకు తెలుసు. కానీ పూలను వంట్లో ఉపయోగించొచ్చా అనే విషయం గురించి విన్నారా?. ఔను వాటిని వంటల్లో హ్యాపీగా ఉపయోగించి వండేయొచ్చంటున్నారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ఎలాగో తెలుసా..! వంటల్లో వినియోగించే తినదగిన పువ్వులు సరైన విధంగా ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిల్లో పురుగులు, పాడైనవి లేకుండా మంచిగా ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా రసాయనాలు చల్లనివి తినడానికి వినియోగించడం ముఖ్యం. లేదంటే మనం చేసిన రెసిపీ రుచిలో తేడాలు వచ్చి టేస్ట్ బాగుండదని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వండే ముందే తినదగిన పువ్వులను మంచిగా ఎంపిక చేసుకుని ఉంచుకోవడం బెటర్ అని చెబుతున్నారు. ఇక వాటితో ఎలాంటి రెసీపీలు చేసుకోవచ్చంటే.. ఎరుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు.. ఇలా విభిన్న రంగుల్లో దొరికే కార్నేషన్ పూలను ఇంటి అలంకరణ, వేడుకల్లో వేదిక అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని కేక్ డెకరేషన్ కోసమూ వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటి పూరేకల్లో ఉండే తియ్యదనం కేక్ రుచిని మరింతగా పెంచుతుందంటున్నారు. అయితే ఈ పూరేకల కింది భాగం కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించి పైభాగాన్ని కేక్ డెకరేషన్ కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే మందార పూరేకలు నోటికి పుల్లటి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో, గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారట! గులాబీ పూరేకల్ని తినేవారు చాలామందే ఉంటారు. అయితే వీటిని ఐస్‌క్రీమ్, ఇతర డిజర్ట్స్పై గార్నిష్ చేయడానికి ఉపయోగించచ్చు. కాస్త పెద్దగా ఉన్న గులాబీ రేకలైతే సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. అంతేకాదు.. జెల్లీస్, షుగర్ సిరప్స్ తయారీలోనూ వీటిని వాడచ్చట!.ఆయుర్వేద పరంగా మందార రేకులతో చేసిన టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుతుక్రమ సమస్యతో బాధపడే వాళ్లు ఎర్రటి మందారాన్ని చెరుకురసంతో కలిపి తీసుకుంటే ఇర్రెగ్యులర్ పిరియడ్ సమస్య నుంచి ఉపశమంన పొందగలరని చెబుతున్నారు. ఇంట్లో గార్డెన్లో పెంచుకునే చిట్టి చామంతుల (చామొమైల్ పువ్వులు)తో స్ట్రాంగ్‌గా ఓ టీ పెట్టుకొని తాగితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కూమా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు! డైట్, ఫిట్నెస్ పాటించేవారు ఈ టీని ఆశ్రయించడం మంచిదని చెబుతున్నారు ఆకట్టుకునే రంగులో ఉండే లావెండర్ పూలను కేక్స్, కుకీస్ తయారీలోనూ వాడచ్చంటున్నారు నిపుణులు. అలాగే బయట మార్కెట్లో ఈ పూలను తేనె, సిరప్స్, వెనిగర్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారట! ఫలితంగా వాటికి అదనపు రుచి, వాసనను జోడించచ్చు. పుల్లటి రుచిలో ఉండే బంతి పూరేకల్ని సలాడ్స్ డ్రస్సింగ్ కోసం, కూరల్లో గార్నిష్ కోసం వాడుకోవచ్చట!. అంతేగాదు కేక్ డెకరేషన్లో కూడా అందంగా కనిపించేలా అలంకరించొచ్చు. ఉపయోగించేటప్పుడు గుర్తించుకోవాల్సివి.. ఈ పూలను ఆహారంలో భాగం చేసుకునే క్రమంలో వాటి రుచిలో తేడా రాకుండా జాగత్త పడేల వినయోగించాలని చెబుతున్నారు చెఫ్‌లు. వాడిపోయినవి కాకుండా.. తాజా పూలు, పూరేకలు తీసుకున్నప్పుడే వాటి రుచి ఇనుమడిస్తుంది. అలాగే రసాయన ఎరువులు వాడకుండా పెంచినవే ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వాడే ముందు వాటిని దుమ్ముధూళి లేకుండా చక్కగా శుభ్రం చేయాలి. కొన్ని పూరేకల కింది భాగం వగరుగానూ, చేదుగానూ ఉంటాయి. కాబట్టి ఆ భాగాన్ని తొలగించి కూరల్లో, ఇతర వంటకాల్లో వాడితే వాటి రుచి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. వంటకాల్లో, గార్నిష్ కోసం వివిధ రకాల పూలను ఒకేసారి వాడచ్చు. ఫలితంగా వాటి రుచి పెరుగుతుంది. అలాగే చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల పూలు కొంతమందికి పడకపోవచ్చు. కాబట్టి వీటిని తీసుకున్నప్పుడు అలర్జీ వంటి సమస్యలేవైనా ఎదురైతే.. వాటికి దూరంగా ఉండడమే మంచిది. అవసరమైతే నిపుణుల సలహాలూ తీసుకుని ఉపయోగించడం మంచింది. (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
ఈ పూలను తినొచ్చు...
పువ్వులు అనగానే నెత్తిలో ధరించేవని గుర్తొస్తుంది. భూ ప్రపంచంలో వేల రకాల పువ్వులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అందుబాటులో ఉండక వాటి ఉనికి మనకు తెలియదు. సువాసనలు వెదజల్లుతూ..ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తున్న వాటిలో మనకు తెలియని పువ్వులు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల పువ్వులను కూర వండుకొని కూడా తినవచ్చు. అలాంటి వాటిలో కొన్ని పూల గురించి ఈ రోజు తెలుసుకుందాం... ఏలియం (ఉల్లి) పుష్పాలు.. ఏలియం కుటుంబంలో ప్రతి పువ్వు తినదగినదే. ఇవి సువాసన వెదజల్లుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి, వంటి పదార్ధాల్లో ఉండే సల్ఫర్ వంటి సమ్మేళనాలు ఏలియం పువ్వుల్లో విరివిగా లభిస్తాయి. క్యాన్సర్ నిరోధకత, రక్తపోటు తగ్గించే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వీటితో తగ్గిపోతాయి. వయెలెట్స్.. ప్రపంచంలోనే ఈ పువ్వులకు చాలా ప్రత్యేకత ఉంది. చూడడానికి అందంగా ఉండి, మంచి సువాసనలు వెదజల్లుతాయి. వీటిని ఎడారుల్లో తిరిగే వారు పానీయాలుగా ఉపయోగిస్తుంటారు. వాతావరణంలోని గాలి అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీన్ని వేల సంవత్సరాల కిందటి నుంచే ఔషదాల తయారీకి ఉపయోగిస్తున్నారు. తల నొప్పిగా ఉన్న సమయంలో వీటిని పొడిగా చేసి టీ లో కలుపుకొని తాగితే వెంటనే తగ్గిపోతుంది. తలనొప్పి, గవద బిళ్లలు, దగ్గు, తామర వంటి వాటికి ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు. లావెందర్.... లావెందర్ కూర వండేందుకే ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంచెం తీపి, కొంచెం కారంగా ఉండడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని కూర వండకుండా కూడా తింటారు. క్రిమి నిరోధకత, క్రిమినాశక శక్తి ఉండడంతో వీటిని ఔషధాలు తయారీలో వినియోగిస్తున్నారు. ఆతురత, భయం, నిస్పృహ వంటి వాటికి చికిత్సలా ఉపయోగపడుతాయి. దీన్ని మాత్రం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తినకూడదు. దండేలియన్స్... ఈ పువ్వులు అన్ని చోట్ల విరివిగా లభ్యమవుతాయి. అన్ని కాలాల్లో ఇవి పూయవు. తేనే టీగలు ఈ పువ్వులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. వీటిని వండకుండా కూడా తినవచ్చు. వీటిలో ప్రతి భాగం తినదగినదే. వీటి వేర్లను దండేలియన్ టీ, కాఫీల్లో ఉపయోగిస్తారు. వీటి ఆకులు చేదుగా ఉంటాయి. కాని ఉడికించి తిన్నప్పుడు మాత్రం తియ్యగా ఉంటాయి. ఈ పువ్వులలోనూ రోగ నిరోధకత శక్తి ఎక్కువగాఉండడంతో ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మింట్ పువ్వులు.. మింట్ అనగానే మనకు చాక్లెట్ గుర్తొస్తుంది. దీని సువాసన ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే దీని పేరును చాక్లెట్స్, టీ, పలు వంటకాలకు పెట్టుకున్నారు. దీన్ని కూడా ఔషదాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. జ్వరం, తలనొప్పి వంటి వాటికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. మింట్ టీ కూడా ఒక శక్తివంతమైన రక్తస్రావ నివారిణి. మొటిమలు తొలగించడంలో కూడా ఇది ఉపయోగపడుతోంది. మింట్ పువ్వులను కూర వండకుండా తినవచ్చు. ఎక్కువగా చాక్లెట్ సమ్మేళనంలో మింట్ పువ్వులనుఉపయోగిస్తారు.