రుచులూరే.. సాగ్‌వాల చికెన్‌, గార్లిక్‌ మ్యాష్డ్‌ పొటాటోస్‌ తయారీ ఇలా.. | How To Make Saag Wala Chicken And Garlic Smashed Potatoes Recipes | Sakshi
Sakshi News home page

రుచులూరే.. సాగ్‌వాల చికెన్‌, గార్లిక్‌ మ్యాష్డ్‌ పొటాటోస్‌ తయారీ ఇలా..

Published Sat, Nov 6 2021 10:29 AM | Last Updated on Sat, Nov 6 2021 11:58 AM

How To Make Saag Wala Chicken And Garlic Smashed Potatoes Recipes - Sakshi

ఎప్పుడూ ఒకేలాంటి వంటకాలకు బదులు కాస్త వెరైటీగా ఇవి ట్రై చేయండి.

సాగ్‌వాల చికెన్‌

కావల్సిన పధార్థాలు
బోన్‌ లెస్‌ చికెన్‌  – కేజీ 

నానబెట్టడానికి:
పెరుగు – నాలుగు టేబుల్‌ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూను
పసుపు – అరటేబుల్‌ స్పూను,
ఉప్పు – టేబుల్‌ స్పూను.

సగా చికెన్‌  సాస్‌: 
నెయ్యి – టేబుల్‌ స్పూను
ఉల్లిపాయలు – రెండు
జీలకర్ర – టేబుల్‌ స్పూను
దాల్చిన చెక్క పొడి – టేబుల్‌ స్పూను
బిర్యానీ ఆకులు – మూడు
ధనియాల పొడి – టేబుల్‌ స్పూను
ఎండు మిర్చి – మూడు
కసూరీ మేథీ – టేబుల్‌ స్పూను
పాలకూర తరుగు – పావు కేజీ

తయారీ విధానం
►చికెన్‌  ముక్కలను శుభ్రంగా కడిగి నానబెట్టడానికి తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. 
►స్టవ్‌మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్‌ వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 
►తరువాత ఎండు మిర్చి, ధనియాలపొడి, గరంమసాలా, దాల్చిన చెక్కపొడి, బిర్యానీ ఆకులు వేసి టేబుల్‌ స్పూను నీళ్లు పోసి వేగనివ్వాలి. 
►ఇవన్నీ వేగిన తరువాత నానబెట్టిన చికెన్‌  వేసి కలుపుకోవాలి. తరువాత మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. 
►ఇప్పుడు పాలకూర తరుగును మిక్సీజార్‌లో వేసి పెస్టులా చేసుకోవాలి. 
►చికెన్‌  ముక్కలు ఉడికిన తరువాత పాలకూర పేస్టువేసి సన్నని మంట మీద ఉడికించాలి. 
►ఆయిల్‌ పైకి తేలేంతవరకు ఉడికించి, రుచికిసరిపడా ఉప్పు వేసుకుని దించేస్తే సాగ్‌వాల చికెన్‌  రెడీ.

చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!!

గార్లిక్‌ మ్యాష్డ్‌ పొటాటోస్‌



కావల్సిన పధార్థాలు
వెల్లుల్లి పాయలు – రెండు
ఆయిల్‌ – టేబుల్‌ స్పూను
బంగాళ దుంపలు – కేజీంబావు
బటర్‌ – కప్పు, పాలు – కప్పు
బిర్యానీ ఆకులు – మూడు
ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా

తయారీ విధానం
►ముందుగా వెల్లుల్లి పాయల తొడిమను కట్‌ చేసి కొద్దిగా నూనె చల్లి, సిల్వర్‌ ఫాయిల్‌లో చుట్టిపెట్టి అవెన్‌ లో పది నిమిషాలపాటు వేగనివ్వాలి.
►ఇప్పుడు బంగాళ దుంపల తొక్కతీసి రెండు అంగుళాల సైజు ముక్కలుగా కట్‌ చేయాలి. 
►ముక్కలన్నింటిని ఒక పెద్దగిన్నెలో వేసి చల్లటి నీళ్లుపోయాలి. దీనిలో బిర్యానీ ఆకులు వేసి దుంపలను ఉడికించాలి. 
►దుంపలు ఉడికాక నీళ్లను వంపేసి మరోసారి గిన్నెను స్టవ్‌ మీద పెట్టి దుంప ముక్కలు పొడిగా మారేంత వరకు వేగనివ్వాలి. 
►ఇప్పుడు ఈ బంగాళ దుంప ముక్కలు, వేయించిన వెల్లుల్లిలను కలిపి మెత్తగా రుబ్బాలి.
►స్టవ్‌ మీద పాన్‌  వేడెక్కాక బటర్‌ వేసి రుబ్బుకున్న దుంపల మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు వేయించాలి. 
►తరువాత పాలు పోయాలి. పాలన్నీ ఇగిరాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేస్తే రోస్టెడ్‌ గార్లిక్‌ మ్యాష్డ్‌ పొటాటోస్‌ రెడీ. చపాతీలు, బ్రెడ్‌లోకి ఇది చాలా బావుంటుంది.

చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్‌ అరెస్ట్‌.. ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement