మధుమేహాన్ని అదుపులో ఉంచే పండ్లు, ఆయుర్వేద మూలికలు, ఆకులు గురించి విన్నాం. కానీ పూలతో మధుమేహ్నాని నిర్వహించొచ్చు అనే దాని గురించి విన్నారా..?. ఈ పువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలే చేస్తాయట. ఇదేంటి పువ్వులా అనుకోకండి ఎందుకంటే వీటిని పనీర్ పువ్వు లేదా పనీర్ దోడి అని పిలుస్తారు. మధుమేహానికి సంబధించిన గాయాలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందట. డయాబెటిస్ రోగిల పాలిట దీన్ని వరం అని పిలుస్తారు. ఇంతకీ ఏంటి పనీర్ పువ్వులు..? ఎక్కడ లభిస్తాయి తదితరాలు చూద్దామా..!
పనీర్ పువ్వును పనీర్ దోడి అని కూడా అంటారు. ఎందుకిలా అంటారంటే..ఈ మొక్క పండ్లు పాలు గడ్డకట్టే లక్షణాల కారణంగా దీన్ని పనీర్‌దోడి అంటారు. ఇది మేజిక్ హీలర్‌గా పనిచస్తుంది. ఇది ఎక్కువగా తూర్పు మధ్యధరా ప్రాంతంలో కనిపిస్తుంద. భారతదేశంలో ఎక్కువగా హర్యాన, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం Withania coagulans. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. సంస్కృతంలో ఈ పువ్వు పేరు ఋష్యగంధ. దీనికి పనీర్ బెడ్, ఇండియన్ రెన్నెట్, ఇండియన్ చీజ్ మేకర్ వంటి అనేక ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క గుబురుగా ఉండి, ఇది చిన్న పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పూలను ఔషధంగా ఉపయోగిస్తారు.
మధుమేహాన్ని నయం చేస్తుంది..
పనీర్ పువ్వు ఓ మూలికలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా కణాలను నయం చేస్తుంది. ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ తయారు చేయడానికి పనిచేస్తుంది. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పనీర్ పువ్వు బీటా కణాలను నయం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. టైప్2 మధుమేహాన్ని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఎలా తీసుకోవాలి
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు 7 నుండి 8 పనీర్ పువ్వులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా 6 నుంచి 7 రోజులు నిరంతరంగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కావాలంటే పనీర్ పూల పొడిని కూడా వాడుకోవచ్చు. నీరు త్రాగిన ఒక గంట తర్వాత మాత్రమే ఆహారం తినండి. రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంది అనిపించినప్పుడు దీన్ని వినియోగించడం ఆపేయొచ్చు.
ఇతర వ్యాధులకు కూడా..
పనీర్ ఫ్లవర్ మధుమేహంతో పాటు అల్జీమర్స్, ఎర్లీ ఫెటీగ్, బ్లడ్ శుద్ధి, ఆస్తమా, నిద్రలేమి, ఊబకాయం, చర్మ సమస్యలు, జలుబు వంటి సమస్యలను కూడా నయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు.. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, వాపు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేగాకుండా కంటి వాపు, పైల్స్, ఉబ్బసం, పంటి సమస్యలు నుంచి బయటపడటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
దుష్ప్రభావాలు..
దీని వినియోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వాటిల్లినిట్లు నిర్థారణ కాలేదు. కానీ ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాకపోతే దీన్ని బాలింతలు, గర్భిణి స్త్రీలు, చిన్నారు, వృద్ధులు దీన్ని తీసుకోకపోవటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, నిపుణుల సలహల సూచనల మేరకు పాటించటం ఉత్తమం.
(చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment