Insulin
-
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
జైల్లో కుదుటగానే కేజ్రీవాల్ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్-2 డయాబేటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్‌కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించిం.ది మెడిసిన్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.కాగా ఆయన షుగర్ లెవల్స్ 320కు పెరగడంతో గతవారం తీహార్ జైల్లో తొలి ఇన్సులిన్ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్ అయిన కేజ్రీవాల్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. -
ఈ పువ్వులతో మధుమేహానికి చెక్ ! ఎలాగంటే..?
మధుమేహాన్ని అదుపులో ఉంచే పండ్లు, ఆయుర్వేద మూలికలు, ఆకులు గురించి విన్నాం. కానీ పూలతో మధుమేహ్నాని నిర్వహించొచ్చు అనే దాని గురించి విన్నారా..?. ఈ పువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలే చేస్తాయట. ఇదేంటి పువ్వులా అనుకోకండి ఎందుకంటే వీటిని పనీర్ పువ్వు లేదా పనీర్ దోడి అని పిలుస్తారు. మధుమేహానికి సంబధించిన గాయాలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందట. డయాబెటిస్ రోగిల పాలిట దీన్ని వరం అని పిలుస్తారు. ఇంతకీ ఏంటి పనీర్ పువ్వులు..? ఎక్కడ లభిస్తాయి తదితరాలు చూద్దామా..! పనీర్ పువ్వును పనీర్ దోడి అని కూడా అంటారు. ఎందుకిలా అంటారంటే..ఈ మొక్క పండ్లు పాలు గడ్డకట్టే లక్షణాల కారణంగా దీన్ని పనీర్దోడి అంటారు. ఇది మేజిక్ హీలర్గా పనిచస్తుంది. ఇది ఎక్కువగా తూర్పు మధ్యధరా ప్రాంతంలో కనిపిస్తుంద. భారతదేశంలో ఎక్కువగా హర్యాన, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం Withania coagulans. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. సంస్కృతంలో ఈ పువ్వు పేరు ఋష్యగంధ. దీనికి పనీర్ బెడ్, ఇండియన్ రెన్నెట్, ఇండియన్ చీజ్ మేకర్ వంటి అనేక ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క గుబురుగా ఉండి, ఇది చిన్న పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పూలను ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహాన్ని నయం చేస్తుంది.. పనీర్ పువ్వు ఓ మూలికలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా కణాలను నయం చేస్తుంది. ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ తయారు చేయడానికి పనిచేస్తుంది. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పనీర్ పువ్వు బీటా కణాలను నయం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. టైప్2 మధుమేహాన్ని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలా తీసుకోవాలి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు 7 నుండి 8 పనీర్ పువ్వులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా 6 నుంచి 7 రోజులు నిరంతరంగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కావాలంటే పనీర్ పూల పొడిని కూడా వాడుకోవచ్చు. నీరు త్రాగిన ఒక గంట తర్వాత మాత్రమే ఆహారం తినండి. రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంది అనిపించినప్పుడు దీన్ని వినియోగించడం ఆపేయొచ్చు. ఇతర వ్యాధులకు కూడా.. పనీర్ ఫ్లవర్ మధుమేహంతో పాటు అల్జీమర్స్, ఎర్లీ ఫెటీగ్, బ్లడ్ శుద్ధి, ఆస్తమా, నిద్రలేమి, ఊబకాయం, చర్మ సమస్యలు, జలుబు వంటి సమస్యలను కూడా నయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు.. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, వాపు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేగాకుండా కంటి వాపు, పైల్స్, ఉబ్బసం, పంటి సమస్యలు నుంచి బయటపడటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దుష్ప్రభావాలు.. దీని వినియోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వాటిల్లినిట్లు నిర్థారణ కాలేదు. కానీ ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాకపోతే దీన్ని బాలింతలు, గర్భిణి స్త్రీలు, చిన్నారు, వృద్ధులు దీన్ని తీసుకోకపోవటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, నిపుణుల సలహల సూచనల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!) -
ఇక రోజూ ఇన్సులిన్ అవసరం లేదు!
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్-2 డయాబెటిస్ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది. ఇక టైప్-1 డయాబెటిస్ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్' ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్' అనే సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు. డెగ్లుడెక్ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. -
ఫాస్టింగ్ కాస్తంత ఎక్కువగా... పోస్ట్ లంచ్ తక్కువగా ఉంటోందా?
డయాబెటిస్‌ను నిర్ధారణ చేసేందుకు సాధారణంగా పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్) ఒకసారి రక్తపరీక్ష, తిన్న తర్వాత దాదాపు రెండు గంటలకు మళ్లీ మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్‌లో 100 పోస్ట్ లంచ్‌లో 140 ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్‌లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్‌లైన్’ అనే స్థితిలో ఉన్నారనీ... అంటే రక్తంలో చక్కెర అదుపు సరిగా లేని కారణంగా భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు హెచ్చరిస్తారు. ఫాస్టింగ్ విలువలు ఎక్కువగా... పోస్ట్ లంచ్ మరీ తక్కువగా ఉంటే...? కొందరిలో ఫాస్టింగ్ విలువలు 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. ఇలా ఫాస్టింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్లంచ్లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్‌లైన్‌గానే పరిగణించాలి. పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. ఎందుకిలా జరుగుతుందంటే... రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్‌కు తెలియదు. అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు బాగా పడిపోతాయి. ఇలాంటి పరిణామం జరిగినప్పుడే పోస్ట్ లంచ్ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. ముందస్తు సూచనగా పరిగణించాల్సిందే... డయాబెటిస్ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... దీన్ని కూడా డయాబెటిస్‌కు ముందు దశగా అంటే ‘బార్డర్‌లైన్’గా పరిగణించవచ్చు. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, అన్ని రకాల పోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్‌లైన్ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్‌ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ బాగానే ఉపయోగపడతాయి. -
World Diabetes Day: డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలివే...
నేడు వరల్డ్ డయాబెటిస్ డే.. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 40 ఏళ్లలో షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగిందంటే అదెంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో వరసగా కేరళ – 7.5% (మన జాతీయ సగటు కూడా 7.5%), తమిళనాడు –6.6%, ఆంధ్రప్రదేశ్ – 6.6%, తెలంగాణ – 4.8%, కర్ణాటక – 4.6% డయాబెటిస్ బాధితులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా పెరగనుందనే నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ‘ప్రపంచ డయాబెటిస్ డే’ సందర్భంగా డయాబెటిస్ కట్టడి గురించి మరోమారు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది థీమ్... ‘‘డయాబెటిక్ బాధితుల ఆరోగ్య రక్షణ బాటలో... ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? (యాక్సెస్ టు డయాబెటిస్ కేర్... ఇఫ్ నాట్ నౌ, వెన్?)’’. ఈ దృక్కోణంతో డయాబెటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. మధుమేహం (డయాబెటిస్)లో ఎన్నో రకాలు. మనకు ప్రధానంగా చెప్పుకునేవి మూడే. టైప్–1, టైప్–2, గర్భవతుల్లో వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్. ఇవిగాక... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా), మెచ్యురిటీ ఆన్సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ), నియోనేటల్ డయాబెటిస్, వోల్ఫ్రామ్ సిండ్రోమ్, ఆల్స్ట్రామ్ సిండ్రోమ్, టైప్–3 డయాబెటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ డయాబెటిస్ అంటూ అనేక రకాలు ఉన్నాయి. అన్నిట్లోనూ ప్రధానంగా బాధించేది టైప్–2 డయాబెటిస్ కాబట్టి దాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలివే... ►తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం ►మూత్ర విసర్జన సమయంలో మూత్రం ఎప్పటిలా పూర్తిగా పారదర్శకంగా కాకుండా మబ్బుగా (క్లౌడీ)గా ఉండటంతో పాటు, ఒక రకమైన పండ్ల వాసనలాంటిది రావడం. ►కంటి చూపు మందగించడం/మసకచూపు. ►ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం. ►నీరసం ∙ఎక్కువగా ఆకలి వేయడం, విపరీతమైన దాహం, నోరూ, గొంతూ ఎండిపోతున్నట్లుగా అనిపించడం. ►చేతులూ– కాళ్లలో స్పర్శ తెలియకపోవడం. ►చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి డయాబెటిస్ వచ్చే ముందర కనిపిస్తాయి. అలాగే మహిళల్లో... ∙చర్మం పొడిబారడం, దురదలు తరచూ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు. ఇవేగాక... కొందరిలో చర్మ వ్యాధులు, కాస్తంత వినికిడి లోపం, డిప్రెషన్, మానసిక అశాంతి, తరచూ మూడ్స్ మారిపోతూ ఉండటం, దంత సమస్యలు, నుదురు, మెడ, చంకలు, గజ్జలు లాంటి ప్రాంతాల్లో చర్మం రంగు మారి దళసరికావడం. వయసు 35 – 40కి పైబడినవారిలో పై లక్షణాలు కనిపిస్తుంటే వాటిని డయాబెటిస్ హెచ్చరికలుగా భావించి, డాక్టర్‌ను సంప్రదించాలి. అసలు డయాబెటిస్ అంటే... నిజానికి రక్తంలో చక్కెర మోతాదులు పెరగడమే ‘డయాబెటిస్’ అని చాలామంది అనుకుంటారు. నిజానికి అదో చిహ్నం మాత్రమే. డయాబెటిస్ రావడానికి ముందు దేహంలో చాలా మార్పులు జరుగుతాయి. వాటన్నింటినీ కలుపుకుని డయాబెటిస్ అనవచ్చు. మనకు అర్థమయ్యే తేలిక భాషలో డయాబెటిస్ గురించి చెప్పుకుందాం. ►మనం చేసే పనులకు శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేదే గ్లూకోజ్. ►మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారుతుంది. అప్పుడది ఇన్పులిన్ సహాయంతో గ్లైకోజెన్‌గా మారి కాలేయంలో, కండరాలలో నిల్వ ఉంటుంది. మనకు మళ్లీ శక్తి అవసరమైనప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ స్రవించి, ఆ గ్లూకోజ్/చక్కెరను బయటకు తెస్తుంది. ►అలా రాగానే... దాన్ని కండరాల్లోని కణాలకు అందేలా చేయడంతో పాటు, పని పూర్తయ్యాక రక్తంలో మిగిలిపోయిన చక్కెరను మళ్లీ కాలేయంలో నిల్వ ఉంచేలా చేసేందుకు ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ అవసరమవుతుంది. ►ఈ ఇన్సులిన్‌ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. ►డయాబెటిస్ అంటే అందరూ రక్తంలో చక్కెర మిగిలిపోవడం అనో లేదా ఇన్సులిన్ ఉత్పత్తికాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిపోక రక్తంలో చక్కెర వృథా అయిపోవడం, అది మరింతగా పెరిగినప్పుడు మూత్రంలో వెళ్లడం అనుకుంటారు. కానీ నిజానికి ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ... శక్తి వనరు అయిన గ్లూకోజ్‌ను కండరాలకు సరిగా అందించలేదు. దీన్నే ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ అంటారు. నిజానికి రక్తంలో మిగిలిపోయిన చక్కెరతో మొదట్లో పెద్దగా హాని జరగదు. కాకపోతే రక్తం సహజంగా చిక్కగా ఉంటుంది. దానికి తోడు దానిలో కలిసే చక్కెరతో అది మరింత చిక్కబడి, ఉండలు (క్లాట్స్) ఏర్పడటం, ఆ చిక్కబారిన రక్తాన్ని పంప్ చేయడం కోసం మరింత ఎక్కువ ఒత్తిడి అవసరమై హైబీపీ రావడం వంటి పరిణామాలు జరుగుతాయి. దానివల్ల దేహానికి హాని చేకూరుతుంది. ఈ క్రమంలో డయాబెటిస్ దేహంలోని అన్ని అవయవాలపై తన దుష్ప్రభావం చూపుతుంది. ఇవీ డయాబెటిస్ దుష్ప్రభావంతో జరిగే వాటిల్లో కొన్ని మాత్రమే. అందుబాటులోకి రానున్న కొత్త చికిత్సలు ►ఇప్పటివరకూ డయాబెటిస్ బాధితులకు మెట్ఫార్మిన్, సల్ఫోనైల్ యూరియా, ఆల్ఫా అకార్బో ఇన్హిబిటర్స్, డీపీపీ4–గ్లిపిన్స్, జీఎల్పీ–1 అనలాగ్‌లతో పాటు ఇన్సులిన్ వంటివీ...వాటినీ వ్యాధి తీవ్రతను బట్టి వాటిని రెండు, మూడు, నాలుగు మాత్రల మోతాదుల్లో ఇస్తుంటారు. ఇటీవల తెలియవచ్చిన కొన్ని అత్యాధునికమైన అంశాల ఆధారంగా రోగి నుంచి రోగికి చికిత్సలు మార్చుతూ వేర్వేరు రకాల వైద్యాలు అందిస్తున్నారు. కారణాలను బట్టి వ్యక్తిగతమైన చికిత్స బాధితుల్లో డయాబెటిస్‌కు కారణమైన అంశం... అది ఒత్తిడి కావచ్చు లేదా అధికమోతాదుల్లో తినడం, వ్యాయామం లేకపోవడం లేదా మరో అంశం కావచ్చు. వాటి ఆధారంగా కొన్ని ‘ఇన్ఫ్లమేటరీ టెండెన్సీస్’ రావడాన్ని గమనించి, డాక్టర్లు... ఆ ‘ఇన్ఫ్లమేటరీ గుణాలు’ తగ్గేలా మందులు ఇవ్వనున్నారు. ►ఎన్‌క్యాప్సులేటెడ్ బీటా సెల్ రీప్లేస్మెంట్ థెరపీ: ఇది టైప్–1 డయాబెటిస్‌కు అందుబాటులోకి రానున్న చికిత్స. ప్యాంక్రియాస్‌లో రెండు రకాల కణాలుంటాయి. మొదటివి ఆల్ఫా సెల్స్. ఇవి గ్లూకగాన్ను ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. రెండో రకం కణాలు బీటా సెల్స్. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేవి. ఈ చికిత్సలో ఇతర రోగుల నుంచి బీటా సెల్స్‌ను సేకరించి, వాటిని రోగి ప్యాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు. అవి క్రమంగా క్రియాశీలమవుతాయి. అవి... పేషెంట్ రక్తంలో ఎంత మోతాదులో చక్కెర విడుదల అవుతుందో గమనించి, దాన్ని నియంత్రించడానికి సరిగ్గా ఎంత కావాలో అంతే ఇన్సులిన్ విడుదల అయ్యేలా చేస్తాయి. దాదాపుగా ఇదే రకమైన చికిత్సనే మరో పద్ధతిలో టైప్–2 డయాబెటిస్ రోగులకూ అందుబాటులోకి త్వరలో రానుంది. ఈ ప్రక్రియలో.. చురుగ్గా ఉన్న బీటా సెల్స్‌ను బయటకు తీసి, వాటిని కృత్రిమ కణవిభజన ప్రక్రియ ద్వారా పెరిగేలా చేసి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. ►నానో పార్టిక్యూలేట్ ఆధారిత చికిత్స : ఇది మరీ మరీ సరికొత్తది. ఇందులో మందు మోతాదు చాలా తక్కువ పాళ్లలో కణాల్లోకి ప్రవేశించడమే గాక, అదక్కడ చాలాకాలం ఉండి, కణం తాను వినియోగించుకోవాల్సిన చక్కెరను సమర్థంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇలాంటి సరికొత్త చికిత్సలు బాధితుల పాలిట ఆశారేఖగా కనిపిస్తున్నాయి. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ -
ఫ్రిడ్జ్ అవసరం లేని ఇన్సులిన్!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఫ్రిడ్జ్‌లలోనే నిల్వ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పవచ్చు. గది ఉష్ణోగ్రతలోనే కాదు.. మరింత ఎక్కువ వేడిని కూడా తట్టుకొని పనిచేయగల సరికొత్త ఇన్సులిన్‌ను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) సంయుక్తంగా అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఇప్పటివరకూ ఇంజెక్షన్ల రూపంలో తీసుకొనే ఇన్సులిన్‌ను కచ్చితంగా రిఫ్రిజరేటర్లలోనే నిల్వ చేయాల్సి వచ్చేది. లేదంటే కొన్ని గంటల వ్యవధిలోనే అందులో ఫిబ్రిలేషన్స్ (చిన్నచిన్న గడ్డలు కట్టడం) జరిగిపోయి అది వాడకానికి పనికిరాకుండా పోతుంది. అలాగని ఎక్కువ కాలం కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచినా అది పాడైపోతుంది. ఈ కారణంగానే ఇన్సులిన్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా.. సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచినా చెడిపోని ఇన్సులిన్‌ను తయారు చేయగలిగితే ఎన్నో లాభాలుంటాయి. దీనిపై దృష్టిపెట్టిన ఐఐసీటీ, ఐఐసీబీ శాస్త్రవేత్తలు... ఓ పెప్టైడ్ ద్వారా ఇన్సులిన్‌కు ఉన్న లోపాలను పరిష్కరించవచ్చునని గుర్తించారు. నాలుగు అమినోయాసిడ్లతో కూడిన ఈ పెప్టైడ్‌కు వారు ‘ఇన్సులక్’ అని పేరు పెట్టారు. ఈ పెప్టైడ్ ఇన్సులిన్ గడ్డకట్టకుండా ఉండగలదని, వేడి కారణంగా జరిగే నష్టాన్నీ అడ్డుకోగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. అలాగే ఇన్సులక్ చేర్చడం వల్ల ఇన్సులిన్ పనితీరులో ఏ మార్పులూ కనిపించలేదు. ఇన్సులక్తో కూడిన ఇన్సులిన్‌ను సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నెలలకొద్దీ నిల్వ చేయవచ్చని అంతర్జాతీయ జర్నల్ ‘ఐసైన్స్’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు -
Hair loss causes: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర..
కేవలం ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తుల ద్వారా మాత్రమే అందమైన జుట్టు సొంతమౌతుందని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే ఆహార అలవాట్ల వల్ల జుట్టు రాలడం, బట్టతల.. వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని మీకు తెలుసా! శిరోజాలకు హానితలపెట్టే ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. చక్కెర మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్ బట్టతలకు కూడా కారణమవుతుందట. అవును.. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. చక్కెరలో, పిండిపదార్థాల్లో, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లలలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా హానికలిగిస్తాయి. జీఐ (గ్లైసీమిక్ ఇండెక్స్) అధికంగా ఉండే ఆహారం జీఐ అధికంగా ఉండే ఆహారం కూడా ఇన్సులిన్ పెంచే గుణం కలిగి ఉంటుంది. శుద్ధిచేసిన (రిఫైండ్) పిండి, బ్రెడ్, చక్కెరలలో జీఐ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతౌల్యానికి దారితీసేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడానికి కారణమయ్యే ఆండ్రొజెన్స్, ఇన్సులిన్ పెంపుకు కారణమౌతాయి. ఆల్కహాల్ కెరటీన్ అనే హార్మోన్ నుంచి గోళ్లు, వెంట్రుకలు తయారవుతాయి. ఐతే ఆల్కహాల్ కెరటీన్పై దుష్ప్రభావాన్ని చూపి వెంట్రుకలు బలహీనపడేలా చేస్తుంది. ఆల్కహాల్ అధికమోతాదులో తీసుకుంటే పోషకాల అసమతుల్యతకు కారణమౌతుంది. ఒక్కోసారి కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయి శాశ్వతంగా జుట్టు రాకుండా నిరోధిస్తుంది. డైట్ సోడా డైట్ సోడాలో ఎస్పర్టెమ్ అనే ఆర్టిఫీషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని పరిశోధకులు గుర్తించారు. మీరు ఇప్పటికే జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే డైట్ సోడాను పూర్తిగా మానెయ్యడం మంచిది. జంక్ ఫుడ్ మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు జంక్ ఫుడ్‌లో అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు, ఉబకాయానికి, జుట్టు రాలడానికి కారణమౌతాయి. నూనె పదార్ధాలు తీసుకుంటే వెంట్రుకల కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. గుడ్లులోని తెల్లసొన జుట్టు ఆరోగ్యానికి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. ఐతే గుడ్లులోని తెల్లసొనను పచ్చిగా తింటే బయోటిన్ డెఫీషియన్సీకి గురయ్యేలా చేస్తుంది. కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ ఇది. ఇది లోపిస్తే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చేప మన శరీరంలో పాదరసం స్థాయిలు పెరిగితే హఠాత్తుగా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. వాతావరణ మార్పులు, అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారనంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. ఈ ఆహారల అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీ జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా? ఈ ఫ్రూట్ తిన్నారంటే.. -
పాజిటివ్‌గా నిర్ధారణ అయితే డయాబెటిక్ రోగులు మందులు కొనసాగించొచ్చా?
కోవిడ్ పాజిటివ్ అయిన డయాబెటిక్ పేషెంట్ షుగర్‌కు సంబంధించిన మందులు కొనసాగించాలి. కరోనా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇచ్చే స్టెరాయిడ్స్‌తో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. వాటిని ఇన్సులిన్‌తో కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కోవిడ్ తగ్గాక కూడా స్టెరాయిడ్స్ ఇతర కరోనా మందులు కంటిన్యూ చేయాలి. స్టెరాయిడ్స్ వినియోగంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి కాబట్టి రోజుకు మూడుసార్లు (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు ముందు) తప్పనిసరిగా ఈ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. తినక ముందు 110, తిన్న తర్వాత 160 ఉండేలా చూసుకోవాలి. దానికి తగ్గట్టు ఇన్సులిన్ తీసుకోవాలి. తీపి పదార్థాలు పూర్తిగా తగ్గించేయాలి, కొంతమంది ఇష్టమొచ్చిన పండ్లు తినేస్తుంటారు. డయాబెటిక్ రోగులు యాపిల్, పైనాపిల్, బొప్పాయి, జామపండ్లు వంటి చక్కెర శాతం తక్కువగా ఉండే పండ్లు తీసుకోవచ్చు. అవికూడా పరిమితంగానే. అనవసర పండ్ల రసాలు మానేయాలి. టీ, కాఫీలు తగ్గించేయాలి. కోవిడ్ అంటేనే ఒత్తిడితో కూడుకున్నది. ఇది షుగర్ లెవల్స్ పెంచుతుంది. అందువల్ల సులభమైన వ్యాయామాలు, వాకింగ్, యోగా వంటివి చేయాలి. - డా. ఎ.నవీన్ రెడ్డి జనరల్‌మెడిసిన్, క్రిటికల్ కేర్, డయాబెటాలజీ నిపుణులు కరోనా సంబంధిత ప్రశ్నలు కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా? పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా, మందులతో తగ్గిపోతుందా? పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరమా? -
గుడ్డు సొనతో ఇన్సులిన్
మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్‌ను కోడిగుడ్డు సొన నుంచి తయారు చేయడంలో విజయం సాధించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. తరచూ ఇన్పులిన్ ఎక్కించుకునే వారు డయాబెటిక్ పంపులు వాడతారన్నది మనకు తెలిసిన విషయమే. అయితే వీటితో ఓ చిక్కు ఉంది. రెండు మూడు రోజుల్లో ఇన్సులిన్ కాస్తా గడ్డలు కట్టిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్లనే వీటిని తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెల్బోర్న్లోని ఫ్లోరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ అండ్ మెంటల్ హెల్త్ శాస్త్రవేత్తలు కత్రిమ ఇన్సులిన్ తయారీకి పూనుకున్నారు. జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేసిన ఒక టెక్నిక్‌ను మరింత మెరుగుపరచడం ద్వారా ఇందులో విజయం సాధించారు కూడా. గుడ్డుసొనలో ఇన్సులిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఉంటాయని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త అక్తర్ హుస్సేన్ తెలిపారు. గ్లైకోఇన్సులిన్ అని పిలుస్తున్న ఈ కొత్త రకం మందు అధిక ఉష్ణోగ్రతల్లో, గాఢతల్లోనూ గడ్డకట్టదని రక్తంలోనూ సహజ ఇన్సులిన్ కంటే ఎక్కువ స్థిరంగా పనిచేస్తుందని హుస్సేన్ వివరించారు. ఇన్సులిన్ పంపుల్లో ఉపయోగించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అన్నారు. సాధారణ ఇన్సులిన్ రెండు రోజులు మాత్రమే పనిచేస్తే.. గ్లైకోఇన్సులిన్ ఆరురోజుల పాటు పనిచేస్తుందని తెలిపారు.ఈ మందు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వంద కోట్ల రూపాయల వథా ఖర్చును అరికట్టవచ్చునని వివరించారు. -
పచ్చి ఉల్లిపాయను తిని చూడండి..
ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడంతో షుగర్ లెవెల్స్ పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్నపాటి చిట్కాతో చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. యాభై గ్రామాలు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొంచెం తినవచ్చు. షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. దానికి బదులుగా యాభై గ్రామల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం. ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్ లెవల్ కంట్రోల్ అవుతుంది. -
ఇన్సులిన్ ధరలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఇన్సులిన్ ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం నెలవారీ ఇన్సులిన్ కోర్సుకు దాదాపు రూ.3వేల వరకు ఖర్చు అవుతుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ వ్యయం దాదాపు సగానికి తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటివరకు మూడు నాలుగు కంపెనీలు మాత్రమే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి గుత్తాధిపత్యం కారణంగా ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్ ప్రీక్వాలిఫికేషన్ ప్రోగ్రామ్ కింద బుధవారం కీలక నిర్ణయ తీసుకుంది. దీంతో ఇన్సులిన్‌ను ఇకపై ఏ సంస్థ అయినా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఫలితంగా సంస్థల మధ్య పోటీ పెరిగి ఇన్సులిన్ కోర్సు నెలవారీ ఖర్చు రూ.600 నుంచి రూ.1500 వరకు తగ్గే అవకాశం ఉంటుందని నిమ్స్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ గంగాధర్ తెలిపారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ల కొరత
గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి వ్యాపార సంస్థలతో ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఆ సంస్థలు నాణ్యతలేని మందులు సరఫరా చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇన్సులిన్ విషయంలోనూ ఇదే జరిగింది. శ్రేయా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేసిన ఇన్సులిన్‌లో నాణ్యత కొరవడింది. ఇదే విషయం ల్యాబ్ పరీక్షల్లోనూ తేలడంతో వాటిని వాడకుండా మూలనపడేశారు. ఈ కారణంగా వేలాది మంది మధుమేహ (షుగర్) రోగులు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, కర్నూలు: జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా మందులు సరఫరా అవుతున్నాయి. ఆసుపత్రుల్లో అవసరాలను బట్టి మందుల ఇండెంట్‌ను ఏపీఎంఎస్ఐడీసీ స్టోర్‌కు పంపుతారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఆయా ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా మందులు, సర్జికల్స్ సరఫరా అవుతాయి. వీటిని కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఆయా ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. కాగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీగా కమీషన్లు తీసుకుని.. అవసరం లేకపోయినా అధిక శాతం మందులు కొనుగోలు చేసి పంపించారు. 2014లో ఒకేసారి మూడింతల మందులు, సర్జికల్స్ అధికంగా కొనుగోలు చేశారు. అలా అధికంగా వచ్చిన మందులు, సర్జికల్స్ మూడేళ్ల వరకు ఉండి, ఆ తర్వాత కాలం తీరిపోయాయి. జిల్లాలో రూ.4కోట్లకు పైగా విలువైన మందులు కాలం తీరి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇన్సులిన్ కొరత పాపం గత పాలకులదే ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇన్సులిన్ నిండుకుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రమే ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి ఇన్సులిన్‌ను బయట కొనుగోలు చేసి రోగులకు ఇస్తున్నారు. అది కూడా పరిమితంగా ఇస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు భారీగా కమీషన్లు దండుకుని నాణ్యతలేని మందులు, సర్జికల్స్ సరఫరాకు కారణమయ్యారన్న విమర్శలున్నాయి. గతంలో పలుమార్లు బీపీ, షుగర్, ఇతర మందులు నాణ్యతలేవని ల్యాబొరేటరీలు నివేదికలు వచ్చాయి. ప్రస్తుతం వాటి సరసన ఇన్సులిన్ కూడా చేరింది. 35వేల వాయిల్స్ వృథా కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు 2018 ఏప్రిల్‌లో 9వేలు (బ్యాచ్ నెం.ఎస్ఏ1840016), ఈ ఏడాది జూన్‌లో 26వేల (బ్యాచ్ నెంబర్లు ఎస్ఏ1940035, ఎస్ఏ1940057) ఇన్సులిన్ ఇంజెక్షన్లను శ్రేయా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సరఫరా చేసింది. సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వచ్చిన వీటిని యధాలాపంగా నాణ్యత పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికలో ఇన్సులిన్‌లో నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేయకుండా స్టోర్‌లోనే ఉంచేశారు. షుగర్ రోగులకు ఇబ్బందులు ఒకేసారి 35వేల వాయిల్స్ ఇన్సులిన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో తీవ్ర కొరత ఏర్పడింది. దీనివల్ల షుగర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి షుగర్ రోగి ప్రతి నెలా వేసుకునే డోసును బట్టి 4 నుంచి 6 ఇన్సులిన్ వాయిల్స్ వాడాల్సి ఉంటుంది. వీటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తే రూ.600 నుంచి రూ.900 దాకా ఖర్చవుతుంది. చాలా మంది రోగులకు ఇన్సులిన్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మాత్రలకు లొంగకపోవడంతో అప్పు చేసి మరీ ఇన్సులిన్ కొనుగోలు చేసి వేసుకుంటున్నారు. -
పరి పరిశోధన
చలికాలంలోనే గుండెపోట్లు ఎక్కువ! వాతావరణం చల్లబడితే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు తైవాన్ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నప్పుడు ఎక్కువమంది మరణించినట్లు గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పో జూయి వూ తెలిపారు. 2008 – 2011 మధ్యకాలంలో గుండెపోటుకు గురైన 40 వేల మంది వివరాలు.. రెండు ఇతర అధ్యయనాల ద్వారా సేకరించిన పది లక్షల మంది వివరాలను కలిపిపరిశీలించినప్డుపు ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పారు. చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురై.. ఆ మరుసటి రోజు చాలామంది గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. చలికాలంలో ఎవరైనా గుండెపోటు తాలూకూ లక్షణాలతో ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. గుండెపోట్లకు.. చలికాలానికి కార్యకారణ సంబంధం ఉందా? లేదా? అన్నది మాత్రం ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. ఆసియా పసఫిక్ కార్డియాలజీ సొసైటీ సమావేశంలో ఈ అధ్యయన వివరాలను ప్రకటించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ఇన్సులిన్ మాత్రలతో సత్ఫలితాలు... మధుమేహులు తరచూ సూదిమందు తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించే ఇన్సులిన్ మాత్రల ప్రభావం బాగానే ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఓరామెడ్ అనే సంస్థ అభివద్ధి చేసిన ఈ మాత్రలపై ఇంకో దశ ప్రయోగాలు పూర్తి అయితే అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా. మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందివ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని దశాబ్దాలుగా తెలిసినప్పటికీ ఇలాంటి మాత్రలను తయారు చేయడం ఇప్పటివరకూ వీలుపడలేదు. కడుపులో ఉండే ఆమ్లాలు ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఓరామెడ్ సంస్థ ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించింది. దీంతో ఈ కంపెనీ మాత్రలు చిన్నపేవులను చేరేవరకూ ఇన్సులిన్‌ను విడుదల చేయవు. తొలి రెండు దశల ప్రయోగాల్లో ఈ మాత్రల ప్రభావ శీలతను, భద్రతలను రుజువు చేయగా.. ఇది అందరిలో దాదాపు ఒకేలా పనిచేస్తుందని తెలుసుకునేందుకు ఇంకో దశ ప్రయోగాలు జరిపారు. గతంలో మందు 28 రోజుల పాటు మందు ప్రభావం ఏమిటన్నది గుర్తిస్తే... తాజా ప్రయోగాల్లో 90 రోజులపాటు పరిశీలనలు జరిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ మాత్రలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఓరామెడ్తోపాటు కొన్ని ఇతర కంపనీలు కూడా ఇన్సులిన్ మాత్రలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. పొగాకు పూలలో సరికొత్త యాంటీబయాటిక్ వ్యాధి కారక బ్యాక్టీరియా మందులకు నిరోధకత పెంచుకుంటున్న ప్రస్తుత తరుణంలో లా ట్రోబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పొగాకు పూలలో ఉండే ఓ రసాయన మూలకం మెరుగైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుందని గుర్తించారు. యాంటీబయాటిక్ నిరోధకత ఎక్కువైతే.. ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త యాంటీబయాటిక్ మూలకాల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల జంతువులు, సేంద్రీయ ఉత్పత్తుల నుంచి కొత్త యాంటీబయాటిక్‌లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుతున్నాయి. లా ట్రోబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అలాంటిదాన్ని పొగాకు పూలలో గుర్తించారు. నికోటినా అలాటా అని పిలిచే పొగాకు మొక్క శిలీంధ్రాల దాడిని తట్టుకునేందుకు కొన్ని రసాయలను ఉత్పత్తి చేసుకుంటుందని.. వీటిల్లో ఒకటైన ఎన్ఏడీ1 మనుషుల్లో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై కూడా ప్రభావం చూపగలదని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని హ్యులెట్ అనే శాస్త్రవేత్త తెలిపారు. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ముర్రే రివర్ ఎన్‌సెఫిలైటిస్ వంటి అనేక వ్యాధులకు ఈ కొత్త యాంటీబయాటిక్ ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని అంచనా. -
తీయని బాధ.. మందులకు వ్యథ!
జనగామ జిల్లా మల్కాపూర్‌కు చెందిన బాలికకు ఏడేళ్ల వయసులోనే మధుమేహం వచ్చింది. బాలిక తల్లి కూలీ డబ్బులతోనే వైద్యం చేయించేది. పదేళ్లుగా మధుమేహానికి మందులు వాడుతోంది. ఇటీవల తల్లి మరణించడంతో ఆ బాలిక పరిస్థితి దయనీయంగా మారింది. కూలీకి సైతం వెళ్లలేని పరిస్థితి. పని చేస్తూ చిన్న గాయమైనా మధుమేహంతో మానదు. అలాగని పని చేయకుంటే ఇళ్లు గడవదు. పలుమార్లు విన్నవించుకున్న తర్వాత వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం) అధికారులు ప్రత్యేక పరిస్థితుల కింద ఈమెకు ఇన్సులిన్ మందులు ఉచితంగా ఇస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం మంది పేద మధుమేహ రోగులు మందులు అందక అవస్థలు పడుతున్నారు. భరించలేని ఖర్చులతో ప్రమాదకర అనారోగ్య పరిస్థితులను ఎదుక్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: మధుమేహం (డయాబెటిస్).. గతంలో కొందరికే పరిమితయ్యే ఈ వ్యాధి ఇప్పుడు అందరికీ వస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధులనూ బాధిస్తోంది. పేద రైతులు, కూలీ పనులు చేసుకునే మధుమేహ బాధితులకు చికిత్స భారమవు తోంది. టైప్–2 మధుమేహ బాధితులకు కొంత వరకు ఇబ్బంది లేకున్నా.. టైప్–1 రోగులు మందులు కొనుగోలు చేయలేని స్థితి ఉంటోంది. రక్తంలోని చక్కర స్థాయిని బట్టి నెలకు రూ.500 నుంచి రూ.3 వేల వర కు మందులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పేదవారు మందుల కోసం ఇంత మొత్తం వెచ్చించలేకపోతున్నారు. ఫలితంగా రోగుల రక్తంలో చక్కర స్థాయిలో తేడాలు వచ్చి పరిస్థితి మరణాలకు దారితీస్తోంది. ఇన్సులిన్ భారం మధుమేహం రెండు రకాలు. టైప్–1 మధుమేహ బాధితులకు ఇన్సులిన్ ఇంజక్షన్ అవసరం ఉంటుంది. టైప్–2 మధుమేహ రోగులకు సాధారణ మాత్రలతో రక్తంలోని చక్కర స్థాయి నియంత్రణలోకి వస్తుంది. మాత్రల వినియోగంతో వ్యాధి తగ్గని వారు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాలి. మధుమేహ రోగుల్లో ఎక్కువ మంది సాధారణ స్థితిలోనే ఉంటారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం ఇన్‌పేషెంట్లకు మాత్రమే ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి వైద్యం చేసుకుని ఇంటికి వెళ్లే వారికి ఇచ్చే డిశ్చార్జీ రిపోర్టుతోపాటు ఇన్సులిన్ ఇంజక్షన్లను వైద్యులు రాసి ఇస్తున్నారు. హుమన్ సేలబుల్ ఇన్సులిన్, హుమన్ మిక్స్టాడ్, హుమలాగ్ లాంగ్ యాక్టింగ్, ఇన్సులిన్ డెగ్యూడెక్, హుమలాగ్, భాసిక్ ఇన్సులిన్ అస్పార్ట్ (అనలాగ్) ఇంజక్షన్ల తో రోగులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఇచ్చే ఈ ఇంజక్షన్ల ధర ప్రైవేటు దుకాణాల్లో సగటున రూ.500 నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. ఇది పేదలకు భరించలేని భారంగా మారుతోంది. ఉద్యోగులకూ నిలిపివేత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవలు విషయంలో గతంలో ఓపీ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్సులిన్ ఇంజక్షన్లు ఉచితంగా ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్ఎస్/జీహెచ్ఎస్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్లను ఓపీ రోగులకు ఇవ్వడా న్ని నిలిపివేసింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇన్సులిన్ ఇంజక్షన్లు సాధారణంగా ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితి ఉండదని, మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకుని ఇంజక్షన్లు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా వైద్య శాఖ ఓపీ రోగులకు ఇంజక్షన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అవసరాలను పరిశీలిస్తాం మధుమేహ రోగులకు ఓపీలో ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కాకుండా ఇన్సులిన్ ఇంజక్షన్ ఇస్తే సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటివి జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఓపీ రోగులకు ఇంజక్షన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. – కె.రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకుడు -
డయాబెటిక్ కౌన్సెలింగ్
ఇన్సులిన్‌ను ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వలేమా? మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా ట్యాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి. – అరవింద, నెల్లూరు డయాబెటిస్ (టైప్–2) తొలిదశల్లో అంటే ప్రీ–డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతోపాటు అందులో కొవ్వులు, ప్రొటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహార నియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడ కూడా ఇన్సులిన్ ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి. షుగర్ తగ్గడం వల్ల కూడాసమస్య వస్తుందా? మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. చాలా రోజులుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ పెరిగితే కదా ప్రమాదం... ఇలా షుగర్ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? – సందీప్, విశాఖపట్నం ఒక్కోసారి పెద్ద వయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. కానీ తాము వాడాల్సిన చక్కెరను నియంత్రించే మాత్రలు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ల రక్తంలో ఉండాల్సిన చక్కెర ఉండాల్సిన మోతాదు కంటే తక్కువకు పడిపోవచ్చు. అలా చక్కెరపాళ్లు చాలా ఎక్కువగా పడిపోవడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల వృద్ధులైన రోగుల్లో (వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలుకు బదులుగా) నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, బలహీనత, భ్రాంతులు, అయోమయం వంటివి. ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా? నా వయసు 31 ఏళ్లు. నేను నెలలో ఒకటీ మూడు వారాలు డే–డ్యూటీలు, రెండూ, నాలుగు వారాలు నైట్ డ్యూటీలు... ఇలా మార్చిమార్చి డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కాస్త యంగ్ పర్సన్స్ కావడంతో ఎవరైనా పెద్ద వయసు వాళ్లు డ్యూటీలకు రాకపోతే ఆ నైట్ డ్యూటీలు కూడా మాకే వేస్తారు. పరీక్షలు చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళనగా ఉంది. డయాబెటిస్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పండి. – మనీష్‌కుమార్, హైదరాబాద్ వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. కానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ రాదు. అయితే డయాబెటిస్ రావడం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అన్న అంశం మీద ఆధారపడి, జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక రక్తపరీక్షలో బార్డర్‌లైన్ డయాబెటిస్ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండేముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్ ,సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
సాలెగూడు స్ఫూర్తితో..
టైప్–1 మధుమేహానికి చికిత్సను ఆవిష్కరించారు చైనా శాస్త్రవేత్తలు. సాలెగూడు స్ఫూర్తిగా తయారుచేసిన ఓ పోగులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐస్లెట్ కణాలు వేలకువేలు ఉంచి.. శరీరంలో అమర్చడం ఈ పద్ధతిలో కీలకమైన అంశం. ఈ రకమైన మధుమేహంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుందన్నది తెలిసిన విషయమే. ఫలితంగా టైప్–1 మధుమేహం బారిన పడినవారు తరచు ఇన్సులిన్‌ను ఎక్కించుకోవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఐస్లెట్ కణాలను శరీరంలోకి చొప్పించడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటిరవకూ బోలెడు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. శరీరం ఈ కొత్త కణాలను నిరోధించే సమస్యను ఎదుర్కొనేందుకు మరిన్ని మందులు వాడవలసి రావడం దీనికి ఒక కారణం. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు నానో స్థాయిలో అతి సూక్ష్మమైన రంధ్రాలున్న ఓ పోగును తయారుచేసి అందులో ఈ ఐస్లెట్ కణాలను ఉంచారు. సాలెగూడు పోగంత పలుచగా ఉండటమే కాకుండా... కణాలను తనలో దాచుకోగలగడం వీటి ప్రత్యేకత. అవసరమైనప్పుడు దీన్ని సులువుగా తీసేసే అవకాశమూ ఉంటుంది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒక అంగుళం పొడవైన పోగును రెండు రోజుల పాటు ఇన్సులిన్ అవసరం లేకుండా చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
త్వరలో జీఎస్టీ: తక్కువకే ఇన్సులిన్
న్యూఢిల్లీ : షుగర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు జీఎస్టీ కనికరం చూపింది. ఇన్సులిన్ వంటి కొన్ని మెడిసిన్లపై జీఎస్టీ రేట్లను సవరించింది. దీనిలో భాగంగా ముందస్తు ప్రతిపాదించిన 12 శాతం శ్లాబులు 5 శాతానికి దిగిరావడంతో ఈ మందులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో నిత్యావసరంగా వాడే మందుల ధరల పన్ను శ్లాబులను మాత్రం జీఎస్టీ కౌన్సిల్ అధికంగానే ఉంచింది. దీంతో మెజార్టీ మందుల ధరలు వచ్చే నెల నుంచి 2.29 శాతం పెరుగనున్నాయి. ప్రస్తుతం 9 శాతంగా ఉన్న అవసరమైన మందుల శ్లాబులు జీఎస్టీ కింద 12 శాతంగా కేంద్ర నిర్ణయించింది. అవసరమైన మందుల్లో హెపారిన్, వార్ఫరిన్, డిల్టియాజెం, డియాజెపం, ఐబూప్రోఫెన్, ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్ వంటివి కేంద్రజాబితాలో ఉన్నాయి. అయితే జీఎస్టీ అమలు డ్రగ్స్ పై అతిపెద్ద మొత్తంలో ప్రభావం చూపదని ఎన్పీపీఏ చైర్మన్ బుపేంద్ర సింగ్ అంటున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఫార్మా ఇండస్ట్రి కొత్త జీఎస్టీని అమలు చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్సులిన్ వంటి వాటిపై జీఎస్టీ రేట్లను సవరించడంతో, గరిష్ట రిటైల్ ధర కూడా కంపెనీలు తగ్గించాలని ఎన్పీపీఏ చెబుతోంది. జీఎస్టీ నిబంధనల ప్రకారం తక్కువ పన్ను రేట్లను వినియోగదారులకు అందించాలని చెప్పింది. -
చిన్నవయసులో డయాబెటిస్ వస్తుందా?
కౌన్సెలింగ్ మా పాప వయసు ఏడేళ్లు. చక్కెరవ్యాధి వచ్చింది. ఇంత చిన్నవయసులో కూడా పిల్లలకు డయాబెటిస్ వస్తుందా? డయాబెటిస్ వస్తే ఎప్పటికీ ఆ వ్యాధితో బాధపడాల్సిందేనా? కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? – కె. ఆనంద్, మిర్జాల్‌గూడ మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటీస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన విచారించాల్సిందేమీ ఉండదు. వీళ్లలో చక్కెర నియంత్రణ చేస్తూ ఉంటే మిగతా పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయాబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయనాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవుతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయడం కూడా అవసరం. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయాబెటిక్స్ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువ# పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ–హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, మూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్హలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియలు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియలు వురింత సులువవ#తాయి. మీరు పిడియాట్రీషియన్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. మా పాపకు ఎనిమిదిన్నర నెలల వయసు. పుట్టినప్పుడు రెండుంపాప కిలోల బరువుతో పుట్టింది. పుట్టినప్పుడు చాలాసార్లు ఫిట్స్ వచ్చాయి. తర్వాత హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చూపించాం. బ్రెయిన్ సీటీ స్కాన్, ఎమ్మరై, ఈఈజీ పరీక్షలు చేయించాం. అన్ని రిపోర్టులు నార్మల్‌గానే వచ్చాయి. కానీ ఈఈజీలో ఓ బ్రెయిన్ నరం పలుచగా ఉందని డాక్టర్ చెప్పారు. దానివల్లనే ఫిట్స్ అని చెప్పారు. పాప లక్షణాలు కొన్ని రాస్తున్నాను. పాప నోటి నుంచి చొల్లు వస్తోంది. పైకి చూస్తోంది. మెడ నిలపడం లేదు. బోర్లాపడటం లేదు (అతి కష్టమ్మీద అప్పుడుప్పుడు పడుతోంది). అయితే పాప చాలా యాక్టివ్‌గా ఉంది. వూ పాప విషయంలో ఏం చేయాలో సూచన ఇవ్వగలరు. – బి.ఆర్.నాయక్, కరీంనగర్ మీ పాపకున్న లక్షణాలు, టెస్ట్ రిపోర్టులను బట్టి చూస్తే మెదడులోని ఓ భాగమైన కార్పస్కలోజమ్లో సవుస్య ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతో పాటు యరికొన్ని మెటబాలిక్ సమస్యలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొన్ని ఎమినో యాసిడ్స్‌లో మార్పులున్నట్లు రిపోర్ట్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సవుస్యలున్న పిల్లలకు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో మెదడు వికాసంలో జాప్యం వంటివి కనిపిస్తాయి. మీ పాపకు ఫిట్స్ నియంత్రించేందుకు మందులు వాడాలి. నేర్చుకునే ప్రక్రియను పెంపొందించేందుకు ఎర్లీ బిహేవియరల్ ఇంటర్వెన్షన్ థెరపీ కూడా ఇప్పించాలి. మీరు మరోసారి మెటబాలిక్ డిజార్డర్స్ నిర్ధారణకు పూర్తిస్థాయి పరీక్షలు చేయించవలసిన అవసరం ఉంది. ఒకవేళ అందులోనూ అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నట్లు తెలిస్తే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దాని వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. మీరు పిడియాట్రిక్ న్యూరో ఫిజీషియన్ ఆధ్వర్యంలో చికిత్స చేయించండి. ►డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. -
పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ!
థీమ్.. త న న ఇవి తినండి, అవి తినకండి అని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అవన్నీ గుర్తుంచుకుని పాటించడం కాస్త కష్టమే. అయినా అన్నీ బుర్రతోనే గుర్తుపెట్టుకోవాలనేముందీ? ఈ పది పదార్థాలనీ కళ్లతో స్కాన్ చేసేయండి. పరగడుపునే తినడం మానేయండి. తింటే ఏమవుతుందో కూడా తెలుసుకోండి. ఇవీ డాక్టర్లు చెప్పినవే. సందేహించకుండా ఫాలో అవండి. స్వీట్లు ఉదయాన్నే చిన్న చాక్లెట్ నోట్లో వేసుకుంటే బుర్ర ఫ్రెష్‌గా ఉంటుందని వైద్యంలో ఓ థియరీ! దాన్నొదిలేయండి. ఉదయాన్నే కడుపులోకి తీపి పదార్థాలు వెళ్తే ఒంట్లో ఇన్సులిన్ లెవల్స్ ఎక్కువౌతాయి. దీనర్థం ఏమిటంటే.. షుగర్‌ను కంట్రోల్ చేసే హార్మోన్ అయిన ఇన్సులిన్... పరగడుపునే వచ్చి పడిన స్వీట్‌ని కంట్రోల్ చెయ్యడానికి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే పాంక్రియాస్ గ్రంథి మీద లోడ్ ఎక్కువౌతుంది. ఇలా లోడ్ పెరుగుతూ పోతుంటే డయాబెటిస్ వచ్చేస్తుంది! పేస్త్రీలు, పఫ్ పేస్త్రీలు ఉదయాన్నే ఇవి ఎవరు తింటారండీ బాబూ అని మీరు అనుకోవచ్చు. రాత్రి తిన్నవి తినగా మిగిలిపోతే.. ఎవరో ఎందుకు మీరే తింటారు తెలుసా! సరే, తిన్నాక ఏం జరుగుతుంది? కడుపులోపలి మృదువైన పొర ల్లో మంట రేగుతుంది. గ్యాస్ ఫామ్ అవుతుంది. కడుపుబ్బరం వచ్చేస్తుంది. త్రేన్పులు వస్తాయి. ఉదయాన్నే వీటిని అలవాటుగా తినేవారికి అనతికాలంలోనే కడుపులో ఐపీఎల్ (మ్యాచ్ అన్నమాట) స్టార్ట్ అవుతుంది. పెరుగు, పులియబెట్టిన పాల పదార్థాలు పరగడుపునే పెరుగు తినేస్తే కడుపులో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ల మోతాదులు ఎక్కువౌతాయి. ఈ ఆసిడ్లు ఏం చేస్తాయంటే.. మనకు మేలు చేసే లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియాను చంపేస్తాయి. ఆ కారణంగా తిన్నదేదీ ఒంటికి పట్టదు. అంటే.. పోషకాలను లోనికి లాక్కునే శక్తిని మన బాడీ కోల్పోతుంది. పెరుగు ఒక్కటే కాదు. పాలతో చేసినవి ఏవి తిన్నా ఇంతే. దోసకాయలు, పచ్చని కాయగూరలు దోసకాయలు, ఇతర కాయగూరలు పచ్చివి తింటే ఆరోగ్యం అని మీరు వినే ఉంటారు. కానీ... ఖాళీ కడుపుతో తింటే.. ఈ మంచివి కూడా చెడ్డవి అయిపోతాయి! కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కడుపు నొప్పి, ఛాతీనొప్పి కూడా వస్తాయి. పియర్స్ (బేరీ పండ్లు) ఇప్పుడివి మార్కెట్లో బాగా కనిపిస్తున్నాయి. సేమ్ ఇవే కాకున్నా, ఈ జాతి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. చూడగానే ఆకర్షించడం ఈ పండ్ల ప్రత్యేకత. ఉదయాన్నే మాత్రం మీరు వీటి ఆకర్షణకు లోను కాకండి. బేరీ çపండ్లలోని ముతగ్గా (రఫ్‌గా) ఉండే పీచుపదార్థం మీ ఖాళీ కడుపులోని మృదువైన ‘మ్యూకస్ మెంబ్రేన్’ (సున్నితమైన కణజాలం)ని గిన్నెల్ని తోమినట్టు తోమేస్తుంది. ఫలితం.. కడుపులో ట్వంటీ ట్వంటీ. (ఇదీ మ్యాచే). పుల్లని పండ్లు నారింజ, ఇతర పుల్లని పండ్లలో టన్నులకొద్దీ ఆసిడ్లు ఉంటాయి. వాటిని సాధారణ పరిభాషలో ఫ్రూట్ ఆసిడ్స్ అంటారు. పరగడుపునే వీటిని తినడం అస్సలు మంచిది కాదు. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్లు, హార్ట్ బర్న్.. ఇదిగో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. శీతలపానీయాలు అంటే.. కూల్ డ్రింక్స్. వీటిల్లో టేస్ట్ కోసం కొద్దిగానైనా కార్బన్‌డైఆక్సైడ్‌ని చొప్పిస్తారు. అందుకే వీటిని కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు. అందరికీ తెలిసిన పేరు ‘సాఫ్ట్ డ్రింక్స్’. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాఫ్ట్ డ్రింక్ తాగితే కడుపు హార్డ్ అయిపోతుంది. బిగుసుకుపోతుందని కాదు. కడుపు మన మాట వినదని. మరి వీటిల్లోని కెఫీన్ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆక్చువల్లీ కెఫిన్ ఇంకో పని కూడా చేస్తుంది. పేగుల లోపలి కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతో కడుపు కండరాలకు రక్తం సరఫరా మందగించి జీర్ణక్రియల శక్తి సన్నగిల్లుతుంది. ఏదైనా జీర్ణం కాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! త్రేప్పులు, గుండె మంట వగైరా. టమాటాలు టమాటా జ్యూస్ ఆకలిని రేకెత్తిస్తుందని అంటారు. నిజమే. స్టార్టర్‌గా కొన్నిచోట్ల భోజనానికి ముందు టమాటా సూప్ ఇస్తారు. అయితే చేదునిజం ఏమిటంటే.. ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్‌ను తీసుకుంటే టమాటాల్లోని ట్యానిక్ ఆసిడ్లు అసిడిటీని పెంచి, పేగులు పుండ్లు పడేలా చేస్తాయి. అరటిపండ్లు ఒంట్లో మెగ్నీషియం ఎక్కువైతే గుండెకు హాని కలుగుతుంది. అరటిపండ్లలోని ఒక చెడ్డ గుణం ఏమిటంటే... అవి ఒంట్లోని మెగ్నీషియం మోతాదులను సర్రున పెంచేస్తాయి. వట్టప్పుడు తింటే ఏం కాదు కానీ, పరగడుపున అరటిపండ్లను తింటే మాత్రం మన లోపలి మెగ్నీషియంకు ఇక అడ్డూఆపూ లేకుండా పోతుంది. మసాలాలు అసలు విలన్ దగ్గరికి వచ్చేశాం. మసాలాలు అంటే.. స్పైసీ ఫుడ్. ఉదయాన్నే బ్రెష్ చేసుకున్న వెంటనే ఆకలిగా ఉందని చెప్పి.. ‘అమ్మడు.. కుమ్ముడు’ టైప్‌లో స్పైసీ ఫుడ్డుని లాగిస్తే గొంతు నుంచి కడుపు వరకు ‘పిచ్’ రెడీ అయిపోతుంది. నానా రకాల గ్యాస్‌లు జట్లుగా విడిపోయి ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేసేస్తుంటాయి. -
నత్తల ఇన్సులిన్...సూపర్ ఫాస్ట్!
డయాబెటిస్ నియంత్రణకు ఇన్సులిన్ వాడటం తెలిసిందే.. అయితే వాడిన 15 నిమిషాలకు కానీ దాని ప్రభావం కనిపించదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ అర్లింగ్టన్ (యుటా) శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం త్వరలోనే వేగంగా పనిచేసే ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఓ రకమైన నత్తలు తమ శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇన్సులిన్ వంటి రసాయనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని వారు గుర్తించారు. ఇది సాధారణ ఇన్సులిన్‌కు మూడు రెట్లు ఎక్కువ వేగంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు కాలేయం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ తక్కువైనపుడు కృతిమ ఇన్సులిన్‌ను తీసుకుంటాం. అయితే ఇది శరీరంలోకి చేరాక అందులోని ఆరు రసాయన అణువులు విడిపోయేందుకు కొంత సమయం పడుతుంది. అంటే అప్పటి వరకు దాని ప్రభావం కనిపించదన్నమాట. మానవుల్లో అయితే ఇది జరిగేందుకు 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. నత్తలు ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఉండదని, దీంతో 5 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని పరిశోధకులు వివరించారు. నత్తల ఇన్సులిన్ వంటి దాన్ని కృత్రిమంగా తయారు చేస్తే మానవులకు ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. -
గ్లూకోజ్‌ను నియంత్రించే కృత్రిమ క్లోమం....
లండన్ : రక్తంలో గ్లూకోజ్‌కు తగ్గట్లు ఇన్సులిన్‌ను సరఫరాచేసే కృత్రిమ క్లోమాలు 2018 కల్లా అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ క్లోమాలతో వాటంతట అవే గ్లూకోజ్‌ను పరీక్షించి, కావల్సిన మోతాదులో ఇన్సులిన్‌ను సర్దుబాటు చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ కృత్రిమ క్లోమాలను అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షిస్తోంది. 2018 చివరికల్లా యూరప్‌లో అందుబాటులోకి రానున్నాయన్నారు. అయితే ఈ కృత్రిమ క్లోమాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ... వీటికి శస్త్రచికిత్సలు, మందులు అవసరం ఉంటుంది. -
షుగర్...నో ఫికర్
పాంక్రియాస్‌ను చైతన్యవంతం చేసే ఆసనం ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆర్డర్లో పెట్టే ఆసనాలూ ఉన్నాయి. షుగర్ రావడం అంటే శరీరంలో ఏదో సవ్యత లోపించడమే. యోగా శరీరాన్ని క్రమస్థితిలో ఉంచుతుంది. అంటే షుగర్‌ని కూడా కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. 1. వక్రాసన సుఖాసనంలో కూర్చుని రెండు కాళ్లు ముందుకు సాచాలి. స్ట్రెచ్ చేయాలి. కుడి మోకాలును పైకి లేపి పాదాన్ని పూర్తిగా జననేంద్రియాలకు దగ్గరగా ఉంచాలి. శరీరాన్ని, నడుముని కుడివైపుకు తిప్పి నిలబెట్టినట్టుగా ఉండాలి. కుడిమోకాలు ఎడమ చంకభాగంలోకి వచ్చేటట్లుగా కుడి చెయ్యి సీటుకి వెనుక వైపుగా తీసుకెళ్లి, అరచేతిని భూమి మీద నొక్కుతూ ఆ సపోర్ట్‌తో వీలైనంతవరకూ నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ కుడి భుజం నుండి వెనుకకు చూసే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలోకి వెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి వెనుకకు అంటే యధాస్థితికి రావాలి. కాళ్లు రెండూ ఫ్రీ చేసుకున్న తరువాత రెండవ వైపు కూడా ఇలాగే సాధన చేయాలి. ఈ వక్రాసనం మరీచాసనం తరువాత చేయబోయే అర్థమశ్చీంద్రాసనానికి సిద్ధం చేస్తుంది. ఉపయోగాలు: నడుమును ట్విస్ట్ చేయుడం, పొట్ట దగ్గర కండరాలను లోపలకు లాగడం వలన జీర్ణావయవాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. 2. అర్ధమశ్ఛీంద్రాసన పై వక్రాసనంలో నిలబెట్టి ఉంచిన కుడికాలును ఎడమకాలు మీద నుండి క్రాస్ చేసి, ఎడమ పాదాన్ని కుడి తొడ బయట వైపుకు తీసుకురావాలి. సీటుకు వీలైనంత దగ్గరగా ఉంచి ఎడమకాలును మడిచి ఎడమ పాదాన్ని, ఎడమ మడమ కుడి సీటు భాగానికి దగ్గరగా ఉంచి, ఎడమ చంక భాగంలోకి నిలబెట్టి (ఫొటోలో చూపిన విధంగా) కుడి చేతిని మడచి వీపు వెనుక భూమికి సమాంతరంగా ఉంచాలి. కుడి మోకాలు మీద నుంచి ఎడమ చేతిని ట్విస్ట్ చేస్తూ వీపు వెనుక రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ తల కుడి భుజం మీదుగా తిప్పి వెనుకకు కుడివైపుకు చూసే ప్రయత్నం. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. తరువాత కాలు మార్చుకుని రెండవ వైపుకు కూడా ఇలాగే చేయాలి. ఉపయోగాలు: ఈ ఆసనం ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా చేయాలి. పాంక్రియాస్ మీద ఒత్తిడి ఉండటం వలన, పాంక్రియాస్ బాగా యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. రెండవవైపు చేసినప్పుడు లివర్ మీద ప్రభావం ఉంటుంది. దీంతో ఫాటీ లివర్ సిండ్రోమ్, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులకు కూడా పరిష్కారం లభిస్తుంది. గమనిక: ఆసనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కాలు నిలబెట్టి ఉంచినప్పుడు క్రాస్ చేసినప్పుడు శరీరానికి దగ్గరగా అదుముతూ నడుమును పక్కలకు ట్విస్ట్ చేయగల్గినట్లయితే ఆశించిన పలితం తప్పకుండా చేకూరుతుంది. 3. యోగముద్రాసన పద్మాసనంలో కూర్చొని చేతులు రెండు వెనుకకు తీసుకెళ్లాలి. వ్యతిరేక దిశలో కుడిచేతితో ఎడమపాదాన్ని కాలివేళ్లను, ఎడమచేత్తో కుడి పాదాన్ని, కాలివేళ్లను పట్టుకుని (ఆ ఆసనం బద్ధ పద్మాసనమని పిలుస్తారు) శరీరాన్ని నిటారుగా ఉంచి, పూర్తిగా శ్వాసతీసుకుని శ్వాసను వదులుతూ ఉండాలి. నడుము నుండి పై శరీర భాగాన్ని బాగా సాగదీస్తూ ముందుకు వంగి నుదురును భూమి మీద ఆనించాలి. లేదా భూమికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఒక వేళ వెనుక నుండి కాలి వేళ్లను ఫొటోలో చూపిన విధంగా పట్టుకోలేకపోతే ఎడమచేతి మణికట్టును కుడి చేత్తో పట్టుకుని చేతుల్ని వెనుక కిందకు లాగుతూ శరీరాన్ని ముందుకు వంచవచ్చు. తల భూమికి శక్తి కొద్దీ దగ్గరకు తీసుకువస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుని పైకి రావాలి. ఉపయోగాలు: జీర్ణవ్యవస్థకు, పునరుత్పత్తి వ్యవస్థకు ఈ ఆసనం చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కగా పనికి వచ్చే ఆసనం. -
ఎంత తిన్నా లావెక్కని జబ్బు!
మెడిక్షనరీ కాస్త ఎక్కువగా తిన్నా ఎక్కడ లావెక్కిపోతామోనని కంగారు పడిపోతారు చాలామంది. అయితే, కొందరు ఎంత తిన్నా ఏం తిన్నా లావెక్కరు. బాగా కొవ్వును పెంచే ఆహారాన్ని భారీగా భోంచేసినా, ఏమాత్రం లావెక్కనివ్వని వింత జబ్బు ఒకటి ఉంది. వైద్య పరిభాషలో దానినే ‘లైపోడిస్ట్రోఫీ’ అంటారు. ఈ జబ్బు ఉన్నవాళ్ల శరీరంలోని కొవ్వు శరవేగంగా కరిగిపోతుంది. అందువల్ల వాళ్లు ఏం తిన్నా, ఎంత తినేసినా ఏమాత్రం లావెక్కరు. ఎప్పుడు చూసినా బక్కచిక్కే కనిపిస్తారు. ఈ జబ్బు ఉన్నవాళ్ల శరీరంలో ఇన్సులిన్ సాధారణ స్థాయి కంటే ఆరురెట్లు ఎక్కువగా ఉత్పత్తవుతుంది. అందువల్ల వీళ్లకు చక్కెరజబ్బు వచ్చే అవకాశాలూ ఉండవు. బక్కచిక్కినట్లు కనిపించడం తప్ప ఈ జబ్బుతో వేరే సమస్యలేవీ ఉండవని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. -
నియమాలు పెడితే నిరోధక శక్తి తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి. - నాగార్జున, నల్గొండ పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్-1 డయాబెటిస్ (మధుమేహం) అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, కొంతకాలానికి ఇంజెక్షన్‌కు మారుస్తుంటారు. సి-పెప్టైడ్ అనే ప్రోటీన్ మోతాదు 0.3 నానోగ్రాము ఉంటే క్లోమగ్రంథి సక్రమంగా పనిచేస్తున్నట్టు లెక్క. అంతకన్నా తక్కువ ఉంటే క్లోమగ్రంథి పనిచేయక, టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ చేయవచ్చు. కొందరిలో ఈ కొలత సాధారణంగా ఉంటూ కూడా మధుమేహం వస్తుంది. అంటే ఇన్సులిన్ బాగానే ఉంది కానీ మధుమేహం వచ్చింది కాబట్టి ఇది టైప్-2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. కాబట్టి పిల్లల్లో మధుమేహం ఉంటే నేరుగా ఇన్సులిన్ ఇవ్వకుండా సి-పెప్టైడ్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని వైద్యం చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో మధుమేహం ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు: పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు తగవు. 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5 - 15 ఏళ్ల పిల్లల ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు? టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100 - 500 పెరగవచ్చు అతిమూత్రం, ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుడడం జరుగుతుంది. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు ఎదుగుదల తగ్గుతుంది. హోమియో వైద్యవిధానంలో చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. డాక్టర్ టి. కిరణ్ కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా పిల్లల వైద్యులు ఇచ్చిన చికిత్సతో తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. ఇక పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచికనా? - శ్రీకాంత్, అనంతపురం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్లా తప్పనిసరిగా నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం.ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. ఆమె మోకాలి చిప్పలు అరిగిపోవడం వల్ల ఇటీవల మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేశారు. బాగా ఫిజియోథెరపీ చేస్తే తొందరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. ఇంటి దగ్గరే ఉండి ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలో తెలియజేయగలరు. - ఎం.వి.ఎస్. ఫణికుమార్, హైదరాబాద్ ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయ్యేముందు వైద్యులు కొన్ని వ్యాయామాల గురించి చెబుతారు. స్టాటిక్ క్వాడ్రిసెస్ట్: వెల్లకిలా పడుకుని కాళ్లు చాపుకుని కూర్చుని మోకాలిని గట్టిగా కిందికి వంచి ఐదు లేదా పది సెకన్లపాటు ఉంచాలి. తిన్నగా కాళ్లు పైకి లేపటం: వెల్లకిలా పడుకుని తొడ కండరాలను బిగించి మోకాళ్లను తిన్నగా పైకి ఎత్తి 5 నుంచి పది సెకన్లపాటు ఉంచి నెమ్మదిగా కిందికి దించాలి. చీలమండల వ్యాయామం: పాదాన్ని పైకి, కిందికి పిక్క కండరాలను బిగిస్తూ ఆడించాలి. ఈ వ్యాయామాన్ని చీలమండలం, పాదం, కాళ్ల వాపు తగ్గేవరకు చేయాలి. మోకాలు తిన్నగా చేసే వ్యాయామం: మోకాలి కింద చిన్న తువ్వాలును మడిచిపెట్టి తొడ కండరాన్ని బిగించి కాలిని తిన్నగా పైకిలేపాలి. మోకాలిని మంచం మీద జార్చటం: మోకాలిని వంచి మడమతో మంచం మీద జార్చాలి, ఎంత వరకు ముడవగలరో అంత మడిచి, ఆ పొజిషన్లో 5 నుంచి పది నిమిషాలు ఉంచి మరల కాలిని కిందికి జార్చాలి. కూర్చొని ఆసరాతో మోకాలు వంచటం: మంచం కింద గాని కుర్చీలోగాని కూర్చొని ఆపరేషన్ అయిన కాలి మడమ కింద రెండవకాలు మడమను పెట్టి నెమ్మదిగా కాలిని పైకి ఎత్తాలి. ఇలా కాలిని తిన్నగా ఎత్తిన తర్వాత 5 నుంచి 10 సెకన్లు ఉంచాలి. కూర్చొని మోకాలిని వంచటం: ఆపరేషన్ అయిన తర్వాత గదిలో నడవడం, చిన్న చిన్న రోజువారీ పనులు మొదలు పెట్టాలి. దీనివల్ల కాళ్ల కీళ్లకు రక్తప్రసరణ జరిగి కదలికలు మెరుగుపడతాయి. నడవడం: మోకాలు త్వరగా నయం అవడంలో దోహదపడే అంశం సరైన పద్ధతిలో నడవడం. మొదట మీరు మీ డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో వాకార్ లేదా క్రచ్చెస్ సాయంతో ఏ కాలుపై ఎంత బరువు పెట్టాలో, ఎలా నిలబడాలో తెలుసుకోవాలి. డాక్టర్ ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్.