ఇన్సులిన్ ఇచ్చి.. ఇద్దరిని చంపేసిన నర్సు!
బ్రిటన్లోని ఓ ఆస్పత్రిలో ఇద్దరు రోగులను ఇన్సులిన్ ఇచ్చి చంపేసిన కేసులో నర్సుపై నేరం రుజువైంది. ఈ ఘటన 2011లో జరిగింది. విక్టోరినో చువా అనే మగ నర్సు కావాలనే ఈ హత్య చేసినట్లు కోర్టులో రుజువైంది. లండన్కు 200 మైళ్ల దూరంలో ఉన్న స్టాక్పోర్ట్ నగరంలోగల స్టెప్పింగ్ హిల్ ఆస్పత్రిలో పనిచేసేటప్పుడు సెలైన్ బ్యాగులలోకి, యాంపిల్స్లోకి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసి ఈ హత్యలకు పాల్పడ్డాడు.
ఇతర నర్సులకు అతడు ఇలా చేసిన విషయం తెలియకపోవడంతో వాళ్లు కూడా ఇన్సులిన్ ఇచ్చేవారు. దాంతో దాని డోస్ ఎక్కువైపోయి.. ఇద్దరు రోగులు మరణించారు. ''నాలో రాక్షసుడున్నాడు. ఓ దేవుడు దెయ్యంగా మారాడు'' అంటూ అతడు రాసుకున్న నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. దాన్ని సాక్ష్యంగా పరిగణించిన కోర్టు.. అతడిపై నేరం రుజువైనట్లు ప్రకటించింది.