15 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు: కేసీఆర్
సంగారెడ్డి: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందులోభాగంగా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా ముప్పిరెడ్డిలో శాంతాబయోటెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇన్సులిన్ పరిశ్రమకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడారు. రూ.850 కి దొరికే ఇన్సులిన్ను కేవలం రూ. 150కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేస్తున్న శాంతాబయోటెక్ చైర్మన్ వరప్రసాద్రెడ్డిని కేసీఆర్ ఈ సందర్బంగా అభినందించారు. వీలైనంత త్వరగా ప్రజలకు ఇన్సులిన్ అందుబాటులోకి రావాలని ఈ సందర్బంగా ఆయన ఆకాంక్షించారు. కలా వ్యాక్సిన్ తయారు చేసి... ఆ వ్యాధిని తరిమికొట్టిన ఘనత వరప్రసాద్దే అని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.