త్వరలో జీఎస్టీ: తక్కువకే ఇన్సులిన్
త్వరలో జీఎస్టీ: తక్కువకే ఇన్సులిన్
Published Tue, Jun 13 2017 2:42 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM
న్యూఢిల్లీ : షుగర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు జీఎస్టీ కనికరం చూపింది. ఇన్సులిన్ వంటి కొన్ని మెడిసిన్లపై జీఎస్టీ రేట్లను సవరించింది. దీనిలో భాగంగా ముందస్తు ప్రతిపాదించిన 12 శాతం శ్లాబులు 5 శాతానికి దిగిరావడంతో ఈ మందులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో నిత్యావసరంగా వాడే మందుల ధరల పన్ను శ్లాబులను మాత్రం జీఎస్టీ కౌన్సిల్ అధికంగానే ఉంచింది. దీంతో మెజార్టీ మందుల ధరలు వచ్చే నెల నుంచి 2.29 శాతం పెరుగనున్నాయి. ప్రస్తుతం 9 శాతంగా ఉన్న అవసరమైన మందుల శ్లాబులు జీఎస్టీ కింద 12 శాతంగా కేంద్ర నిర్ణయించింది.
అవసరమైన మందుల్లో హెపారిన్, వార్ఫరిన్, డిల్టియాజెం, డియాజెపం, ఐబూప్రోఫెన్, ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్ వంటివి కేంద్రజాబితాలో ఉన్నాయి. అయితే జీఎస్టీ అమలు డ్రగ్స్ పై అతిపెద్ద మొత్తంలో ప్రభావం చూపదని ఎన్పీపీఏ చైర్మన్ బుపేంద్ర సింగ్ అంటున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఫార్మా ఇండస్ట్రి కొత్త జీఎస్టీని అమలు చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్సులిన్ వంటి వాటిపై జీఎస్టీ రేట్లను సవరించడంతో, గరిష్ట రిటైల్ ధర కూడా కంపెనీలు తగ్గించాలని ఎన్పీపీఏ చెబుతోంది. జీఎస్టీ నిబంధనల ప్రకారం తక్కువ పన్ను రేట్లను వినియోగదారులకు అందించాలని చెప్పింది.
Advertisement
Advertisement