చిన్నవయసులో డయాబెటిస్‌ వస్తుందా? | The youngest get diabetes? | Sakshi
Sakshi News home page

చిన్నవయసులో డయాబెటిస్‌ వస్తుందా?

Published Tue, Mar 28 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

చిన్నవయసులో డయాబెటిస్‌ వస్తుందా?

చిన్నవయసులో డయాబెటిస్‌ వస్తుందా?

కౌన్సెలింగ్‌

మా పాప వయసు ఏడేళ్లు. చక్కెరవ్యాధి వచ్చింది. ఇంత చిన్నవయసులో కూడా పిల్లలకు డయాబెటిస్‌ వస్తుందా? డయాబెటిస్‌ వస్తే ఎప్పటికీ ఆ వ్యాధితో బాధపడాల్సిందేనా? కంట్రోల్‌లో ఉండాలంటే ఏం చేయాలి? – కె. ఆనంద్, మిర్జాల్‌గూడ
మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్‌ డయాబెటీస్‌ అంటారు. దీన్నే టైప్‌ వన్‌ డయాబెటీస్‌ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటీస్‌ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్‌ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన విచారించాల్సిందేమీ ఉండదు. వీళ్లలో చక్కెర నియంత్రణ చేస్తూ ఉంటే మిగతా పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయాబెటిస్‌ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయనాలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కారణం అవుతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్‌ వాడటం తప్పనిసరి.

దాంతోపాటు రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయడం కూడా అవసరం. డయాబెటీస్‌ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయాబెటిక్స్‌ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువ# పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ–హైడ్రేషన్, చర్మంపై రాషెస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, మూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి.

భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్‌ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్‌హలేషన్‌ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియలు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియలు వురింత సులువవ#తాయి. మీరు పిడియాట్రీషియన్‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

మా పాపకు ఎనిమిదిన్నర నెలల వయసు. పుట్టినప్పుడు రెండుంపాప కిలోల బరువుతో పుట్టింది. పుట్టినప్పుడు చాలాసార్లు ఫిట్స్‌ వచ్చాయి. తర్వాత హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చూపించాం. బ్రెయిన్‌ సీటీ స్కాన్, ఎమ్మరై, ఈఈజీ పరీక్షలు చేయించాం. అన్ని రిపోర్టులు నార్మల్‌గానే వచ్చాయి. కానీ ఈఈజీలో ఓ బ్రెయిన్‌ నరం పలుచగా ఉందని డాక్టర్‌ చెప్పారు. దానివల్లనే ఫిట్స్‌ అని చెప్పారు. పాప లక్షణాలు కొన్ని రాస్తున్నాను. పాప నోటి నుంచి చొల్లు వస్తోంది. పైకి చూస్తోంది. మెడ నిలపడం లేదు. బోర్లాపడటం లేదు (అతి కష్టమ్మీద అప్పుడుప్పుడు పడుతోంది). అయితే పాప చాలా యాక్టివ్‌గా ఉంది. వూ పాప విషయంలో ఏం చేయాలో సూచన ఇవ్వగలరు.
– బి.ఆర్‌.నాయక్, కరీంనగర్‌

మీ పాపకున్న లక్షణాలు, టెస్ట్‌ రిపోర్టులను బట్టి చూస్తే మెదడులోని ఓ భాగమైన కార్పస్‌కలోజమ్‌లో సవుస్య ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతో పాటు యరికొన్ని మెటబాలిక్‌ సమస్యలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొన్ని ఎమినో యాసిడ్స్‌లో మార్పులున్నట్లు రిపోర్ట్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సవుస్యలున్న పిల్లలకు ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో మెదడు వికాసంలో జాప్యం వంటివి కనిపిస్తాయి. మీ పాపకు ఫిట్స్‌ నియంత్రించేందుకు మందులు వాడాలి.

నేర్చుకునే ప్రక్రియను పెంపొందించేందుకు ఎర్లీ బిహేవియరల్‌ ఇంటర్‌వెన్షన్‌ థెరపీ కూడా ఇప్పించాలి. మీరు మరోసారి మెటబాలిక్‌ డిజార్డర్స్‌ నిర్ధారణకు పూర్తిస్థాయి పరీక్షలు చేయించవలసిన అవసరం ఉంది. ఒకవేళ అందులోనూ అబ్‌నార్మల్‌ కండిషన్స్‌ ఉన్నట్లు తెలిస్తే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దాని వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. మీరు పిడియాట్రిక్‌ న్యూరో ఫిజీషియన్‌ ఆధ్వర్యంలో చికిత్స చేయించండి.

డయాబెటీస్‌ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement