కేవలం ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తుల ద్వారా మాత్రమే అందమైన జుట్టు సొంతమౌతుందని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే ఆహార అలవాట్ల వల్ల జుట్టు రాలడం, బట్టతల.. వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని మీకు తెలుసా! శిరోజాలకు హానితలపెట్టే ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..
చక్కెర
మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్ బట్టతలకు కూడా కారణమవుతుందట. అవును.. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. చక్కెరలో, పిండిపదార్థాల్లో, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లలలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా హానికలిగిస్తాయి.
జీఐ (గ్లైసీమిక్ ఇండెక్స్) అధికంగా ఉండే ఆహారం
జీఐ అధికంగా ఉండే ఆహారం కూడా ఇన్సులిన్ పెంచే గుణం కలిగి ఉంటుంది. శుద్ధిచేసిన (రిఫైండ్) పిండి, బ్రెడ్, చక్కెరలలో జీఐ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతౌల్యానికి దారితీసేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడానికి కారణమయ్యే ఆండ్రొజెన్స్, ఇన్సులిన్ పెంపుకు కారణమౌతాయి.
ఆల్కహాల్
కెరటీన్ అనే హార్మోన్ నుంచి గోళ్లు, వెంట్రుకలు తయారవుతాయి. ఐతే ఆల్కహాల్ కెరటీన్‌పై దుష్ప్రభావాన్ని చూపి వెంట్రుకలు బలహీనపడేలా చేస్తుంది. ఆల్కహాల్ అధికమోతాదులో తీసుకుంటే పోషకాల అసమతుల్యతకు కారణమౌతుంది. ఒక్కోసారి కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయి శాశ్వతంగా జుట్టు రాకుండా నిరోధిస్తుంది.
డైట్ సోడా
డైట్ సోడాలో ఎస్పర్టెమ్ అనే ఆర్టిఫీషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని పరిశోధకులు గుర్తించారు. మీరు ఇప్పటికే జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే డైట్ సోడాను పూర్తిగా మానెయ్యడం మంచిది.
జంక్ ఫుడ్
మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు జంక్ ఫుడ్‌లో అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు, ఉబకాయానికి, జుట్టు రాలడానికి కారణమౌతాయి. నూనె పదార్ధాలు తీసుకుంటే వెంట్రుకల కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి.
గుడ్లులోని తెల్లసొన
జుట్టు ఆరోగ్యానికి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. ఐతే గుడ్లులోని తెల్లసొనను పచ్చిగా తింటే బయోటిన్ డెఫీషియన్సీకి గురయ్యేలా చేస్తుంది. కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ ఇది. ఇది లోపిస్తే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
చేప
మన శరీరంలో పాదరసం స్థాయిలు పెరిగితే హఠాత్తుగా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. వాతావరణ మార్పులు, అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారనంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది.
ఈ ఆహారల అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీ జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment