bold head
-
హెయిర్.. కేర్..! బట్టతలను దాటి విస్తరించిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్!
సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల మాత్రమే కాదు.. ఇప్పుడు శరీరంలో పలు అవసరమైన చోట్ల కేశాలను కోల్పోవడం/లేకపోవడం కూడా సమస్యలుగానే భావిస్తున్నారు. ఆధునికుల్లో సౌందర్య పోషణ పట్ల పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో అవసరమైన చోట కేశాల లేమి సమస్యలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అనేకమంది పరిష్కారంగా ఎంచుకుంటున్నారు.ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను పొందుతున్న వినియోగదారుల్లో 25–45 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మార్కెట్ 25–30శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. బట్టతలకు మాత్రమే కాకుండా కను»ొమలు, మీసాలు, గెడ్డం కోసం కూడా మగవారు అలాగే నుదుటి భాగంలో జుట్టు పలచబడటం (ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్) వంటి కారణాలతో మహిళలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో ఈ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది.యూనిట్ వారీగా వ్యయం..ఒకచోట నుంచి హెయిర్ స్ట్రిప్ కట్ చేసి చేసే ఎఫ్యుటి, స్ట్రిప్‌తో సంబంధం లేకుండా చేసేది ఎఫ్యుఇ పేరిట రెండు రకాల ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతులున్నాయి. కేశాలనేవి ఒకటిగా కాకుండా 3, 4 చొప్పున మొలుస్తాయి కాబట్టి వాటిని ఫాలిక్యులర్ యూనిట్‌గా పిలుస్తారు. ఒక్కో యూనిట్‌ను పర్మనెంట్ హెయిర్ ఉన్న చోట నుంచి తీసి అవసరమైన చోట అమర్చడానికి యూనిట్‌కు రూ.50 నుంచి రూ70 వరకూ వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బట్టతల సమస్య పరిష్కారానికి కనీసం రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుపెట్టాలి. కను»ొమలు తదితర చిన్నచిన్న ట్రాన్స్‌ప్లాంటేషన్ తక్కువ వ్యయంతో రూ.10, రూ.15వేల వ్యయంతో గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే తలభాగం మీద పూర్తిస్థాయిలో చేయాలంటే ఒక పూట నుంచి ఒక రోజు మొత్తం క్లినిక్‌లో ఉండాల్సి రావొచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంతరం కొంత కాలం అధిక టెంపరేచర్‌కు గురికాకుండా జాగ్రత్తపడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేమితో అనర్థాలు...తక్కువ రెమ్యునరేషన్‌తో సరిపుచ్చడానికి.. పలు క్లినిక్‌లు అర్హత లేని వ్యక్తుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దీంతో శరీరంపై మచ్చలు పడటం, బేసి వెంట్రుకలు, జుట్టు అపసవ్యంగా పెరగడం దగ్గర నుంచీ తీవ్రమైన ఇన్ఫెక్షన్, జుట్టురాలడం వరకు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి రావొచ్చు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెర్మటాలజిస్ట్లకు సైతం అత్యవసరంగా శిక్షణ ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం సరైన నిపుణుల పర్యవేక్షణలో జరిగే చికిత్సలు ఖచి్చతంగా సురక్షితమే.అరకొర శిక్షణతో.. నో..హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన సౌందర్య ప్రక్రియలను నిర్వహించడానికి యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ ఫారమ్‌లలో శిక్షణ వీడియోలను చూస్తే సరిపోదని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తేల్చి చెప్పింది. సర్జికల్ అసిస్టెంట్/టెక్నీíÙయన్లు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) పర్యవేక్షణలో ఇవి చేయాలని సూచించింది. సౌందర్య ప్రక్రియలేవీ అత్యవసర శస్త్రచికిత్స కిందకురావు. శిక్షణ లేని వ్యక్తి చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.వైద్యంతో పరిష్కారం కాకపోతేనే..వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో ఎలా ఉన్నా మిగిలిన చోట్ల ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లే ముందు తప్పకుండా వైద్య పరమైన పరిష్కారం అన్వేíÙంచాలి. ఉదాహరణకు కను»ొమ్మలు కోల్పోతే.. అల్ట్రా వయెలెంట్ లైట్ వినియోగించి మాగి్నఫైయింగ్ లెన్స్‌లను వినియోగించి దానికి కారణాన్ని గుర్తించాలి. చికిత్సకు అవకాశం ఉంటే చేయాలి. లేని పక్షంలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంచుకోవాలి. అవకాశం ఉంటే కొన్ని మందులు అప్లై చేసి చూస్తాం. స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా వినియోగిస్తాం.. ఎల్ఎల్ ఎల్టి, లో లెవల్ లోజర్ థెరపీతో కూడా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. సమస్యను సరైన విధంగా నిర్ధారించి అవసరం మేరకు చికిత్స చేసే అర్హత కలిగిన వైద్యుడి దగ్గరే చేయించుకోవాలి. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.– డా.జాన్ వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
బట్టతల పురుషులను ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. రకరకాల నూనెలు వాడుతుంటారు. అప్పటికీ ఫలితం లేకపోతే, చాలా ఖరీదైన, బాధాకరమైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలకు కూడా సిద్ధపడుతుంటారు. బట్టతలకు విరుగుడుగా అమెరికన్ కంపెనీ ‘హయ్యర్డోస్’ తాజాగా ఈ టోపీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ టోపీని క్రమం తప్పకుండా ఆరునెలలు పెట్టుకుంటే, బట్టతల మటుమాయమవుతుందని తయారీదారులు చెబుతున్నారు. బయటి నుంచి చూడటానికి ఈ టోపీ మామూలుగానే ఉన్నా, దీని లోపలి భాగంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరించే చిన్న చిన్న బల్బులు ఉంటాయి. రీచార్జ్ బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోని కణజాలంలో ఉండే మైటోకాండ్రియాను బలోపేతం చేస్తాయి.ఫలితంగా బట్టతలపై క్రమక్రమంగా వెంట్రుకలు మొలకలెత్తడం మొదలవుతుంది. దీని ఖరీదు 449 డాలర్లు (రూ.37,493). హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ టోపీ ధర తక్కువే!ఇవి చదవండి: నయనతార 'చిన్నారి కవల'లను చూశారా! -
బట్టతలపై జుట్టు పెరిగేలా చెయ్యొచ్చు!
జుట్టు రాలడం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య. ఇది హార్మోన్లు మార్పులు లేదా వివిధ మందుల వాడకం తదితర వైద్య పరిస్థితుల కారణంగా ఈ జుట్టు రాలడం సమస్య సంభవించొచ్చు. దీనివల్ల ఎదురయ్యే శారీరక, మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఇంతవరకు మార్కెట్లో జుట్టు రాలడం మందగించే మందులే ఉన్నాయి గానీ జుట్టు పెరిగేందుకు మందులు లేవు. ఇక ఇదీగాక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ శరీరంపై దుష్ప్రభావాలకు గురిచేసేవే. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనంలో జుట్టురాలు సమస్యకు చెక్‌పెట్టేలా సమర్థవంతమైన చికిత్సను అభిృవృద్ధి చేశారు. బట్టతల సమస్యతో బాధపడే వారి పాలిట ఈ పరిశోధన గొప్ప వరం.! అదేంటంటే..నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా పరిశోధనల్లో జుట్టు గ్రోత్‌ని పెంచే మైక్రోఆర్ఎన్ఏ(miRNA)ని గుర్తించారు. ఈ మైక్రోఆర్ఎన్ఏ (miR-218-5p) హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని. అందువల్ల దీన్ని ప్రోత్సహించేలా భవిష్యత్తులో ఔషధాలను అభివృద్ధి చేసే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని శాస్తవేత్తలు పేర్కొన్నారు. నిజానికి బట్టతల సంభవించే చోట ఈ హెయిర్ ఫోలికల్స్ అదృశ్యం కావని, తగ్గిపోవడం జరుగుతుందని అధ్యయనంలో గుర్తించారు. ఆ సైట్లో డీపీ కణాలను తిరిగి నింపగలిగితే ఫోలికల్స్ కోలుకోవచ్చు. త్రీడీ గోళాకార వాతావరణంలో కల్చర్డ్ డీపీ కణాలను టుడీ, త్రీడీ గోళాకారంలో తీసుకున్నారు. అయితే గోళాకార త్రీడీ కల్చర్డ్ కణాలు ప్రభావవంతంగా పనిచేసి జుట్టుని వేగవంతంగా పెరిగేలా చేస్తుండటాన్ని గుర్తించారు. ఈ చికిత్స విధానాన్ని ఎలుకలపై ప్రయోగించగా త్వరగా వెంట్రుకలు పెరగడం గమనించారు. జస్ట్ 20 రోజుల ట్రయల్స్‌లో ఈ త్రీడీ డీపీ కణాలతో ఎలుకలకు చికిత్స ఇవ్వగా, కేవలం 15 రోజుల్లోనే 15% వెంట్రుకల్ని తిరిగి పొందడం జరిగింది. గోళాకారంలోని త్రీడీ కణాలు జుట్టుగ్రోత్ని స్పీడ్‌అప్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అందువల్ల ఈ త్రీడీ కణాల సెల్ థెరపీ బట్టతలకి సమర్థవంతమైన చికిత్సగా పేర్కొన్నవచ్చు అన్నారు. ఈ చికిత్స విధానంలో 90% కోల్పోయిన జుట్టుని తిరిగి పొందొచ్చని అన్నారు. అలాగే జుట్టురాలు సమస్యను తగ్గించేలా హెయిర్ ఫోలికల్ గ్రోత్‌ని పెంచేలా miRNAకి సంబంధించిన క్రీమ్ లేదా లోషన్‌ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. అంతేగాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా ఈ miRNAపై దృష్టి పెడితే చాలని అన్నారు శాస్త్రవేత్తలు. జుట్లు రాలు సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ఈ పరిశోధన కొత్త ఆశను చిగురించేలా చేస్తుందన్నారు. అలాగే ఇక ఈ చికిత్స విధానం ఎంతవరకు సురక్షితం అనే దిశగా కూడా మరిన్నీ పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. ఏదీఏమైన బట్టతలతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స విధానం వరం అని చెప్పొచ్చు. (చదవండి: ఊపిరితిత్తుల్లో బొద్దింక..కంగుతిన్న వైద్యులు) -
'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..
సాక్షి, హైదరాబాద్: బట్టతలను కవర్‌చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని మోసం చేశాడో యువకుడు. వివరాల్లోకెళ్తే.. కార్తీక్ వర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. తనకు వివాహం కాలేదంటూ సోషల్ మీడియాలో కార్తీక్ వర్మ విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. ఆ ఫొటోలను చూసి చాలా మంది అమ్మాయిలు అతని వల్లో పడ్డారు. వీరితో కొద్దికాలం సన్నిహితంగా ఉండేవాడు. చదవండి: (కాంట్రాక్ట్ ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. భరించలేక చివరికి..) అనంతరం యువతుల ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బయపెడుతూ వారి వద్ద నుంచి డబ్బులు లాగేవాడు. అలా ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంది అమ్మాయిలనుమోసం చేశాడు. తాజాగా కూకట్‌పల్లిలో కూడా ఓ అమ్మాయితో చనువుగా ఉంటూ ఇలానే డబ్బులు లాగేసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న నార్త్‌జోన్ పోలీసులు కార్తీక్ వర్మను అరెస్ట్ చేశారు. అతడిపై పీడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) -
Hair loss causes: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర..
కేవలం ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తుల ద్వారా మాత్రమే అందమైన జుట్టు సొంతమౌతుందని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే ఆహార అలవాట్ల వల్ల జుట్టు రాలడం, బట్టతల.. వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని మీకు తెలుసా! శిరోజాలకు హానితలపెట్టే ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. చక్కెర మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్ బట్టతలకు కూడా కారణమవుతుందట. అవును.. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. చక్కెరలో, పిండిపదార్థాల్లో, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లలలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా హానికలిగిస్తాయి. జీఐ (గ్లైసీమిక్ ఇండెక్స్) అధికంగా ఉండే ఆహారం జీఐ అధికంగా ఉండే ఆహారం కూడా ఇన్సులిన్ పెంచే గుణం కలిగి ఉంటుంది. శుద్ధిచేసిన (రిఫైండ్) పిండి, బ్రెడ్, చక్కెరలలో జీఐ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతౌల్యానికి దారితీసేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడానికి కారణమయ్యే ఆండ్రొజెన్స్, ఇన్సులిన్ పెంపుకు కారణమౌతాయి. ఆల్కహాల్ కెరటీన్ అనే హార్మోన్ నుంచి గోళ్లు, వెంట్రుకలు తయారవుతాయి. ఐతే ఆల్కహాల్ కెరటీన్పై దుష్ప్రభావాన్ని చూపి వెంట్రుకలు బలహీనపడేలా చేస్తుంది. ఆల్కహాల్ అధికమోతాదులో తీసుకుంటే పోషకాల అసమతుల్యతకు కారణమౌతుంది. ఒక్కోసారి కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయి శాశ్వతంగా జుట్టు రాకుండా నిరోధిస్తుంది. డైట్ సోడా డైట్ సోడాలో ఎస్పర్టెమ్ అనే ఆర్టిఫీషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని పరిశోధకులు గుర్తించారు. మీరు ఇప్పటికే జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే డైట్ సోడాను పూర్తిగా మానెయ్యడం మంచిది. జంక్ ఫుడ్ మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు జంక్ ఫుడ్‌లో అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు, ఉబకాయానికి, జుట్టు రాలడానికి కారణమౌతాయి. నూనె పదార్ధాలు తీసుకుంటే వెంట్రుకల కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. గుడ్లులోని తెల్లసొన జుట్టు ఆరోగ్యానికి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. ఐతే గుడ్లులోని తెల్లసొనను పచ్చిగా తింటే బయోటిన్ డెఫీషియన్సీకి గురయ్యేలా చేస్తుంది. కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ ఇది. ఇది లోపిస్తే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చేప మన శరీరంలో పాదరసం స్థాయిలు పెరిగితే హఠాత్తుగా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. వాతావరణ మార్పులు, అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారనంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. ఈ ఆహారల అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీ జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా? ఈ ఫ్రూట్ తిన్నారంటే.. -
ఇక్కడ తలరాత మారుస్తారు!
హెయిర్ బ్యాంకు.. ఈ బ్యాంకు పేరెప్పుడూ వినలేదు కదూ.. మామూలు బ్యాంకులేం చేస్తాయి.. మా దగ్గర మీ డబ్బులు దాచుకోండి.. భవిష్యత్తులో అవి ఎన్నో రెట్లు పెరిగి మీకు ఉపయోగపడతాయి అంటాయి.. అంతేగా.. ఈ హెయిర్ బ్యాంకు కూడా డిటోనే. కాకపోతే.. మూమూలు బ్యాంకుల్లో డబ్బులు దాస్తాం.. ఇక్కడ మన జుట్టు దాస్తాం.. అంతే.. తేడా.. మిగతాదంతా సేమ్‌టుసేమ్.. ఇంతకీ ఎందుకు? ఎందుకేంటి.. ఈ ప్రపంచంలో ధనిక పేదా తేడా లేకుండా దిగులుతో తల్లడిల్లిపోయే సమస్య ఒకే ఒక్కటి.. అదే.. బట్టతల.. నిజానికి వెంట్రుకలు ఏర్పడేందుకు హెయిర్ ఫాలికిల్స్ కింది భాగంలో ఉండే డెర్మల్ పాపిల్లా అనే కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది చర్మంలోని భాగం. వయసు పెరుగుతున్న కొద్దీ హెయిర్ ఫాలికిల్స్.. ఈ డెర్మల్ పాపిల్లా కణాల నుంచి వేరుపడుతాయి. దీంతో ఫాలికిల్ చిన్నగా అయిపోవడంతో వెంట్రుకలు చిన్నగా అయిపోవడం.. ఎదుగుదల లేకపోవడం జరుగుతుంటుంది. అంటే వెంట్రుకల ఎదుగుదలలో ఈ డెర్మల్ పాపిల్లా కణాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయన్న విషయం అర్థమైంది కదా.. సరిగ్గా ఇక్కడే పరిశోధకులు దృష్టి సారించి పరిశోధనలు సాగించారు. హెయిర్ బ్యాంకుగా పేర్కొంటున్న ఈ ప్రక్రియకు బ్రిటన్ అధికారులు తాజాగా అనుమతులిచ్చారు. ఇక్కడేం చేస్తారు.. ముందుగా ఎవరైనా వ్యక్తికి చెందిన డెర్మల్ పాపిల్లా కణాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. దాదాపు 100 కణాలను తీసుకుని బ్యాంకులో భద్రపరుస్తారు. ఈ కణాలు పాడవకుండా ఉండేందుకు ‘క్రయోప్రిజర్వ్’పద్ధతి ద్వారా దాదాపు మైనస్ 180 సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంత కాలం అంటే అంతకాలం దాచి ఉంచుతారు. కణాలను వేరు చేసే ప్రక్రియకే దాదాపు రూ.1.8 లక్షలు వసూలు చేయనున్నారు. ఆ తర్వాత భద్రపరిచినందుకు ఏటా దాదాపు రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా దాచి ఉంచినందుకు దాదాపు రూ.1.8 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఎప్పుడైనా భవిష్యత్తులో వెంట్రుకలు ఊడిపోతున్నా.. బట్టతల వచ్చినా ఆ బ్యాంకుకు వెళ్తే చాలు సమస్య పరిష్కారం అయినట్లే. ఎందుకంటే ఒక్క డీపీ కణం నుంచి చాలా చాలా డీపీ కణాలను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అభివృద్ధిపరచవచ్చు. ఇలా క్లోనింగ్ ద్వారా ఏర్పడిన కణాలను తలమీది చర్మంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. అప్పుడు ఆ కణాల నుంచి హెయిర్ ఫాలికిల్స్ ఏర్పడి.. వాటి నుంచి ఒత్తయిన జట్టు పెరుగుతుంది. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఈ కణాలను దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది. యుక్త వయసు రాగానే ఈ కణాలను బ్యాంకులో దాచిపెట్టుకుంటే మరీ మంచిదని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ ఫర్జో వివరించారు. ఈ వెంట్రుకల బ్యాంకు కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు బ్రిటన్ హ్యూమన్ టిష్యూ అథారిటీ.. హెయిర్ క్లోన్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి తాజాగా అనుమతులిచ్చింది. పాతవాటికి కొత్తదానికి తేడా? బట్ట తల వచ్చినప్పుడు.. ప్యాచ్ సిస్టమ్ లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (పీఆర్పీ)చేయించుకుంటారు. మొదటి విధానంలో వెంట్రుకలను తలపై భాగంలో అతికిస్తారు. రెండో విధానంలో మాత్రం మన రక్తాన్ని తీసుకుని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను వేరుచేస్తారు. దీన్ని వెంట్రుకలు ఎదగాల్సిన చోట ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. కానీ హెయిర్ బ్యాంకు ప్రక్రియ ద్వారా నేరుగా ఆరోగ్యవంతమైన మన డెర్మల్ పాపిల్లా కణాలను ఉపయోగించి, సహజసిద్ధంగా వెంట్రుకలు పెరిగేలా చేయొచ్చు. ఈ విధానంలోని వెంట్రుకలు ఉన్న చోట కొంత చర్మాన్ని ముందుగా తీసుకుంటారు తర్వాత అందులోని హెయిర్ ఫాలికిల్స్ను తీసుకుని, అందులో ఉన్న డెర్మల్ పాపిల్లాను వేరు చేస్తారు. ఆ పాపిల్లా కణాలను చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. అయితే ఈ విధానం వల్ల సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉండటమే కాకుండా.. వెంట్రుకలు పెరుగుతాయనేందుకు గ్యారంటీ కూడా ఉంటుందట. -
నటి పూర్ణ అంత పనిచేసిందా?
నటి పూర్ణ అంత పని చేసిందా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదే. ఇంతకీ పూర్ణ ఏం చేసిందీ? బహుభాషా నటిగా పేరొందిన ఈ అమ్మడికి తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఆమె మంచి నటి. అంతకంటే మంచి డ్యాన్సర్. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు. దర్శకుడు మిష్కిన్ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటూ అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. కాగా, తాజాగా కొడివీరన్ అనే చిత్రంలో నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంభియార్ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రెణుగుంట చిత్రం ఫేమ్ సనూజ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది.ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్ధం కాలే? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్‌తో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది నటి గుండు గీయించుకోవడం టాక్‌గా మారింది. దీని గురించి పూర్ణను అడిగితే పాత్ర డిమాండ్ చేసినపుడు గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని పేర్కొంది. -
బట్టతలపై జుట్టు వస్తుందని చెబితే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన తలకట్టు ఉండాలని ఎవరూ అనుకోరు.. పిన్నవయస్సు నుంచి వృద్ధ వయస్సు దాకా అందరూ ఒతైన జుట్టు కావాలని ఆరాటపడుతుంటారు. దువ్వెన తలనే పదేపదే దువ్వుతూ మురిసిపోతుంటారు. వృద్ధ వయస్సులో రావాల్సిన బట్టతల ముందుగానే వస్తే.. అంతే..! తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. తలపై జుట్టు పెరిగే ఉపాయాల జాబితా తిరిగేస్తారు.. ఎవరైనా పలనా తింటే.. జుట్టు పెరుగుతుందనీ, ఔషధం రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబితే ఆ వ్యక్తి ఊహాలకు రెక్కలు తొడుగుతాయి. బట్టతల నుంచి విముక్తి పొందలన్నా అత్యాశతో ఎంత ఖర్చుకైనా వెనకాడరు. అచ్చంగా అలాగే చేసాడో వైద్యవిద్యార్థి. తన అందమైన క్రాఫ్‌పై మోజుపడిన విద్యార్థి ఏకంగా తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ దయనీయమైన ఘటన చెన్నైలో మంగళవారం వెలుగుచూసింది. మద్రాసు మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో తెగ ఇబ్బంది పడేవాడు. ‘బట్టతల మీ వివాహానికి అడ్డంకిగా మారిందా. దిగులుపడొద్దు. మా వద్దకు రండి. అందమైన క్రాఫ్‌ను అమరుస్తాం’ అనే ప్రకటనకు ఆకర్షితుడైన అతడు నుంగంబాక్కంలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. అక్కడి అనస్తీషియా డాక్టర్ చైనాలోని ఒక వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మరో విద్యార్థి సాయంతో సంతోష్‌కుమార్‌కు మత్తుమందు ఇచ్చి చికిత్స ప్రారంభించారు. ఉదయం ప్రారంభించిన చికిత్స సాయంత్రం వరకు కొనసాగగా సృహలోకి వచ్చిన సంతోష్‌కుమార్ తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వేలూరు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అనుభవం లేకుండా బట్టతలకు జుట్టు అమర్చేందుకు చేసిన ప్రయత్నం వికటించిన కారణంగానే సంతోష్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడని అనుమానిస్తూ కుటుంబసభ్యులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.