జుట్టు రాలడం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య. ఇది హార్మోన్లు మార్పులు లేదా వివిధ మందుల వాడకం తదితర వైద్య పరిస్థితుల కారణంగా ఈ జుట్టు రాలడం సమస్య సంభవించొచ్చు. దీనివల్ల ఎదురయ్యే శారీరక, మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఇంతవరకు మార్కెట్లో జుట్టు రాలడం మందగించే మందులే ఉన్నాయి గానీ జుట్టు పెరిగేందుకు మందులు లేవు. ఇక ఇదీగాక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ శరీరంపై దుష్ప్రభావాలకు గురిచేసేవే. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనంలో జుట్టురాలు సమస్యకు చెక్‌పెట్టేలా సమర్థవంతమైన చికిత్సను అభిృవృద్ధి చేశారు. బట్టతల సమస్యతో బాధపడే వారి పాలిట ఈ పరిశోధన గొప్ప వరం.!
అదేంటంటే..నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా పరిశోధనల్లో జుట్టు గ్రోత్‌ని పెంచే మైక్రోఆర్‌ఎన్‌ఏ(miRNA)ని గుర్తించారు. ఈ మైక్రోఆర్‌ఎన్‌ఏ (miR-218-5p) హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని. అందువల్ల దీన్ని ప్రోత్సహించేలా భవిష్యత్తులో ఔషధాలను అభివృద్ధి చేసే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని శాస్తవేత్తలు పేర్కొన్నారు. నిజానికి బట్టతల సంభవించే చోట ఈ హెయిర్ ఫోలికల్స్ అదృశ్యం కావని, తగ్గిపోవడం జరుగుతుందని అధ్యయనంలో గుర్తించారు.
ఆ సైట్‌లో డీపీ కణాలను తిరిగి నింపగలిగితే ఫోలికల్స్ కోలుకోవచ్చు. త్రీడీ గోళాకార వాతావరణంలో కల్చర్డ్ డీపీ కణాలను టుడీ, త్రీడీ గోళాకారంలో తీసుకున్నారు. అయితే గోళాకార త్రీడీ కల్చర్డ్ కణాలు ప్రభావవంతంగా పనిచేసి జుట్టుని వేగవంతంగా పెరిగేలా చేస్తుండటాన్ని గుర్తించారు. ఈ చికిత్స విధానాన్ని ఎలుకలపై ప్రయోగించగా త్వరగా వెంట్రుకలు పెరగడం గమనించారు. జస్ట్ 20 రోజుల ట్రయల్స్‌లో ఈ త్రీడీ డీపీ కణాలతో ఎలుకలకు చికిత్స ఇవ్వగా, కేవలం 15 రోజుల్లోనే 15% వెంట్రుకల్ని తిరిగి పొందడం జరిగింది. గోళాకారంలోని త్రీడీ కణాలు జుట్టుగ్రోత్‌ని స్పీడ్‌అప్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు.
అందువల్ల ఈ త్రీడీ కణాల సెల్ థెరపీ బట్టతలకి సమర్థవంతమైన చికిత్సగా పేర్కొన్నవచ్చు అన్నారు. ఈ చికిత్స విధానంలో 90% కోల్పోయిన జుట్టుని తిరిగి పొందొచ్చని అన్నారు. అలాగే జుట్టురాలు సమస్యను తగ్గించేలా హెయిర్ ఫోలికల్ గ్రోత్‌ని పెంచేలా miRNAకి సంబంధించిన క్రీమ్ లేదా లోషన్‌ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. అంతేగాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా ఈ miRNAపై దృష్టి పెడితే చాలని అన్నారు శాస్త్రవేత్తలు. జుట్లు రాలు సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ఈ పరిశోధన కొత్త ఆశను చిగురించేలా చేస్తుందన్నారు. అలాగే ఇక ఈ చికిత్స విధానం ఎంతవరకు సురక్షితం అనే దిశగా కూడా మరిన్నీ పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. ఏదీఏమైన బట్టతలతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స విధానం వరం అని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment