baldness
-
బట్టతలపై జుట్టు పెరిగేలా చెయ్యొచ్చు!
జుట్టు రాలడం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య. ఇది హార్మోన్లు మార్పులు లేదా వివిధ మందుల వాడకం తదితర వైద్య పరిస్థితుల కారణంగా ఈ జుట్టు రాలడం సమస్య సంభవించొచ్చు. దీనివల్ల ఎదురయ్యే శారీరక, మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఇంతవరకు మార్కెట్లో జుట్టు రాలడం మందగించే మందులే ఉన్నాయి గానీ జుట్టు పెరిగేందుకు మందులు లేవు. ఇక ఇదీగాక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ శరీరంపై దుష్ప్రభావాలకు గురిచేసేవే. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనంలో జుట్టురాలు సమస్యకు చెక్‌పెట్టేలా సమర్థవంతమైన చికిత్సను అభిృవృద్ధి చేశారు. బట్టతల సమస్యతో బాధపడే వారి పాలిట ఈ పరిశోధన గొప్ప వరం.! అదేంటంటే..నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా పరిశోధనల్లో జుట్టు గ్రోత్‌ని పెంచే మైక్రోఆర్ఎన్ఏ(miRNA)ని గుర్తించారు. ఈ మైక్రోఆర్ఎన్ఏ (miR-218-5p) హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని. అందువల్ల దీన్ని ప్రోత్సహించేలా భవిష్యత్తులో ఔషధాలను అభివృద్ధి చేసే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని శాస్తవేత్తలు పేర్కొన్నారు. నిజానికి బట్టతల సంభవించే చోట ఈ హెయిర్ ఫోలికల్స్ అదృశ్యం కావని, తగ్గిపోవడం జరుగుతుందని అధ్యయనంలో గుర్తించారు. ఆ సైట్లో డీపీ కణాలను తిరిగి నింపగలిగితే ఫోలికల్స్ కోలుకోవచ్చు. త్రీడీ గోళాకార వాతావరణంలో కల్చర్డ్ డీపీ కణాలను టుడీ, త్రీడీ గోళాకారంలో తీసుకున్నారు. అయితే గోళాకార త్రీడీ కల్చర్డ్ కణాలు ప్రభావవంతంగా పనిచేసి జుట్టుని వేగవంతంగా పెరిగేలా చేస్తుండటాన్ని గుర్తించారు. ఈ చికిత్స విధానాన్ని ఎలుకలపై ప్రయోగించగా త్వరగా వెంట్రుకలు పెరగడం గమనించారు. జస్ట్ 20 రోజుల ట్రయల్స్‌లో ఈ త్రీడీ డీపీ కణాలతో ఎలుకలకు చికిత్స ఇవ్వగా, కేవలం 15 రోజుల్లోనే 15% వెంట్రుకల్ని తిరిగి పొందడం జరిగింది. గోళాకారంలోని త్రీడీ కణాలు జుట్టుగ్రోత్ని స్పీడ్‌అప్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అందువల్ల ఈ త్రీడీ కణాల సెల్ థెరపీ బట్టతలకి సమర్థవంతమైన చికిత్సగా పేర్కొన్నవచ్చు అన్నారు. ఈ చికిత్స విధానంలో 90% కోల్పోయిన జుట్టుని తిరిగి పొందొచ్చని అన్నారు. అలాగే జుట్టురాలు సమస్యను తగ్గించేలా హెయిర్ ఫోలికల్ గ్రోత్‌ని పెంచేలా miRNAకి సంబంధించిన క్రీమ్ లేదా లోషన్‌ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. అంతేగాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా ఈ miRNAపై దృష్టి పెడితే చాలని అన్నారు శాస్త్రవేత్తలు. జుట్లు రాలు సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ఈ పరిశోధన కొత్త ఆశను చిగురించేలా చేస్తుందన్నారు. అలాగే ఇక ఈ చికిత్స విధానం ఎంతవరకు సురక్షితం అనే దిశగా కూడా మరిన్నీ పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. ఏదీఏమైన బట్టతలతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స విధానం వరం అని చెప్పొచ్చు. (చదవండి: ఊపిరితిత్తుల్లో బొద్దింక..కంగుతిన్న వైద్యులు) -
గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
Permanent Solution To The Problem Of Baldness: అద్దం ముంచు నిలబడి నున్నని బట్టతలను నిమురుకుంటూ.. ఫ్చ్.. దీనికి విరుగుడే లేదా (విగ్గుకాకుండా)? అని ఒక్కసారైనా అనుకోనివారుండరేమో..!అలాంటివారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్! మన శరీరంలో ఒక ప్రొటీన్ స్థాయిలను పెంచడం ద్వారా బట్టతల సమస్యకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిది సాధ్యమే అని చెబుతోంది కూడా. బట్టతలతో ఎన్నో సమస్యలు తలపై నిండుగా కనిపించే ఒత్తైన జుట్టు మగవాళ్లందరూ కోరుకుంటారు. కానీ నియంత్రణలేకుండా ఊడే జుట్టువారిలో ఇది తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. అందులోనూ వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే జాబ్ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల విషయాల్లో వీరికి ఇబ్బందులు మరీ ఎక్కువ. జుట్టురాలే సమస్యతోపాటు అనేక ఒత్తిడ్లవల్ల శరీరంలో కార్టిజాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుదలకు కారణమౌతుంది. ఫలితంగా తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది. మగవాళ్లలో మాత్రమేకాకుండా, స్త్రీలలో కూడా ఒత్తిడి హార్మోన్ బట్టతలకు కారణమౌతుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు చెబుతున్నదే. ఈ ప్రొటీన్‌తో బట్టతలకు శాశ్వత పరిష్కారం ఐతే హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ మ్యాగజైన్లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. ఆ హార్మోన్ వల్లనే జుట్టు రాలుతుంది.. ఎలుకల్లో అడ్రినల్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా మూడు రెట్లు ఎక్కువగా వెంట్రుకలు పెరిగినట్లు వీరి పరిశోధనల్లో తేలింది. మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌కు సమానమైన కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ఎలుకల్లో పెరుగుదలను అణిచివేశాయని, ఈ హర్మోన్‌ను నియంత్రిస్తే హెయిర్ ఫోలిసిల్ స్టెమ్ సెల్ (హెచ్ఎఫ్సీ) యాక్టివేట్ అయ్యి కొత్త జుట్టు పెరగడానికి కారణమౌతుందని నివేదికలో తెల్పింది. దీంతో మొదటిసారిగా జుట్టు రాలడానికి గల కారణాలను శాస్త్రీయ ఆధారాలతో గుర్తించి, దానిని ఎలా తిప్పికొట్టాలో కూడా ఈ అధ్యయనాలు తెల్పాయి. మళ్లీ ఈ విధంగా జుట్టు పెరుగుతుంది బట్టతల వ్యక్తుల్లో స్థబ్దంగా విశ్రాంతి స్థితిలో ఉండే హెయిర్ ఫోలికల్ మూలకణాలను ప్రోత్సహించడానికి GAS6 ప్రొటీన్ ఉపయోగపడుతుంది. ఎలుకల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మనుషుల్లో దీని పనితీరుపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిఉందని పరిశోధన బృంధం తెల్పింది. వీరి ప్రయోగాలు ఫలిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బట్టతల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
బట్టతలకు పరిష్కారం దొరికింది..
న్యూఢిల్లీ : సమకాలీన ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న వాటిలో బట్టతల కూడా ఒకటి. పలురకాల సంస్థలు బట్టతల సమస్యను పూర్తిగా తగ్గిస్తామని పేర్కొంటున్నాయి. దీంతో చాలామంది పురుషులు వాటివైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే, తాజా అధ్యాయనంలో బట్టతలకు పరిష్కారం దొరికింది. ఎముకలు పెళుసుబారడాన్ని నివారించే మందుకు బట్టతలను కూడా నివారించే శక్తి ఉందని పరిశోధకుల అధ్యాయనాల్లో తేలింది. బట్టతల సమస్యతో బాధపడుతూ ఈ మందును వినియోగించిన పురుషులకు కేవలం ఆరు రోజుల్లో రెండు మిల్లీమీటర్ల పాటు జుట్టు పెరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయాల్సివుందని చెప్పారు. డబ్ల్యూఏవై-316606 అనే మందును ఉపయోగించినప్పుడు ఈ ఫలితం వచ్చిందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం బట్టతల నివారణకు రెండు రకాల డ్రగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి వల్ల దుష్ఫలితాలు కూడా ఉంటుండటంతో ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నారు. -
బోడిగుండుపై వెంట్రుకలు మొలుస్తాయి!
బట్టతలతో చిక్కేమీ ఉండదుగానీ... చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అన్న బెంగే ఎక్కువ. అందుకే బట్టతలకు చికిత్స అంటే చాలు.. చాలామంది వేలకువేలు పోసి నూనెలు కొంటూంటారు. కష్టమైనా.. నొప్పి ఎక్కువ ఉన్నా... హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కూ సిద్ధమవుతూంటారు. ఇకపై ఈ బాదరబందీలేవీ వద్దంటున్నారు ఇండియానా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. శరీరంలో... ఏ కణంగానైనా మారగల సామర్థ్యమున్న మూలకణాలతో తాము పరిశోధనశాలలో వెంట్రుకలతో కూడిన ఎలుక చర్మాన్ని సృష్టించగలిగామని వారు ప్రకటించారు. మూలకణాలతో ఇది సాధ్యమేనని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ వాస్తవంగా చేసి చూపింది మాత్రం వీరే. ప్రొఫెసర్ కార్ల్ కోహ్లెర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల లక్ష్యం బధిరత్వానికి చికిత్స కనుక్కోవడం అయినప్పటికీ ఈ క్రమంలో మూలకణాలు చర్మం తాలూకూ కణాలను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించడంతో బట్టతల సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రత్యేకమైన మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క చర్మపు మొగ్గ (ఇంగ్లీషులో బడ్ అంటారు) అటు చర్మపు పైపొరతో పాటు లోపలి పొర అయిన డెర్మిస్‌ను కూడా సృష్టించగలదని, ఫలితంగా ఎలుకల శరీరంపై జరిగినట్లే వెంట్రుకలు మొలుస్తున్నట్లు వీరు గుర్తించారు. వేర్వేరు రకాల చర్మ కణ కుదుళ్లు (ఫోలికల్స్) తయారవుతూండటం ఇంకో విశేషం. మొత్తం మీద ఈ పద్ధతి బట్టతలకు మాత్రమే కాకుండా.. సూక్ష్మరూపంలో ఉండే అవయవాలను తయారు చేసేందుకూ ఉపయోగించవచ్చునని కోహ్లెర్ వివరించారు. -
చిన్న వయసులో బట్టతల.. ముప్పే
కోల్‌కతా: చిన్న వయస్సులోనే బట్టతల వచ్చినా, తల వెంట్రుకలు నెరిసినా అది గుండె జబ్బుల ప్రమాదానికి సంకేతమని ఓ అధ్యయనంలో తేలింది. మగవారిలో 40 ఏళ్ల కంటే ముందుగానే బట్టతల వచ్చినా, తల వెంట్రుకలు నెరిసినా గుండె జబ్బులు వచ్చే అవకాశం.. ఊబకాయం ఉన్న వారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని రుజువైంది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కుటుంబంలోని వ్యక్తికి పిన్న వయస్సులోనే గుండెజబ్బులు వచ్చినా, ఒబెసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా, పొగతాగే అలవాటున్న వారికి గుండెరక్తనాళాల్లో సమస్య తలెత్తే అవకాశాలున్నాయని.. కానీ, బట్టతల, జుట్టు నెరవటం, ఒబెసిటీ లక్షణాలను బట్టి గుండె రక్తనాళాల్లో సమస్యలను తేలిగ్గా గుర్తించే వీలుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగానే తల వెంట్రుకలు నెరిసిన వారిలో మిగతా వారితో పోలిస్తే 50 శాతం అధికంగా రక్తనాళాల్లో సమస్యలు ఎక్కువగా రావచ్చని, అదే బట్టతల వచ్చిన వారిలో మిగతా వారితో పోలిస్తే 49 శాతం ఎక్కువగా ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు గుజరాత్‌లోని యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చి సెంటర్‌కు చెందిన సచిన్ పాటిల్. చిన్న వయసు లోనే తలవెంట్రుకలు నెరిసినా బట్టతల వచ్చినా ఆమేరకు రక్తనాళాల వయస్సులో కూడా మార్పులు సంభవిస్తాయని ఆయన తెలిపారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో ఈ అధ్యయన ఫలితాలను ప్రకటించారు. అధ్యయనంలో భాగంగా 40 ఏళ్ల లోపు 790 మంది పురుషుల్లో గుండెరక్తనాళాల్లో సమస్యలను అధ్యయనం చేశారు. ఈ ఫలితాలను అదే వయస్సు కేటగిరీకి చెందిన 1,270 ఆరోగ్య వంతులైన పురుషులతో పోల్చి చూశారు. మిగతా వారితో పోలిస్తే ఒబెసిటీ ఉన్న వారిలో 4.1 రెట్లు ఎక్కువగా రక్తనాళాల్లో సమస్యలు వస్తుండగా ముందుగానే జట్టు నెరవటం, బట్టతల కారణంగా ఆ ముప్పు 5.6 రెట్లు ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలోనే చిన్న వయస్సులోనే జట్టు తెల్లబడుతున్న లేదా బట్టతల వస్తున్న వారికి ఎలాంటి ముందు జాగ్రత్తలు, చికిత్స అవసరమో నిర్ణయించటం మరింత సులువు కానుందని కార్డియాలజిస్ట్ ధమ్దీప్ హుమానే అన్నారు. -
బట్టతలపై జుట్టు మొలిపించే మందు!
బట్టతలతో బాధపడేవారికి శుభవార్త! అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు బట్టతలపై జుట్టు మొలిపించగల మందును కనుగొన్నట్లు ప్రకటించారు. వయసు మళ్లడం, జన్యు లక్షణాలు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, తీవ్రంగా జబ్బుపడటం, కొన్ని రకాల ఔషధాల దుష్ప్రభావాల ఫలితంగా చాలామంది బట్టతల బారిన పడుతుంటారు. అయితే, బట్టతలకు దారితీసే నిర్దిష్టమైన కారణాలను ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారని, తమ పరిశోధనల్లో ఆ కారణాలను గుర్తించామని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన మాలిక్యులర్, సెల్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రొఫెసర్ విలియమ్ లౌరీ వెల్లడించారు. జుట్టు కుదుళ్లలోని మూలకణాల్లో జరిగే జీవక్రియలు, చర్మ కణాల్లో జీవక్రియలు భిన్నంగా ఉంటాయని, జుట్టు కుదుళ్లలో జట్టు పెరుగుదలకు, తరుగుదలకు దారితీసే జీవరసాయనిక ప్రక్రియలను తమ ప్రయోగాల్లో నిర్దిష్టంగా గుర్తించామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగాల ఆధారంగా బట్టతలపై తిరిగి జుట్టుమొలిపించగల ‘ఆర్సీజీడీ423’, ‘యూకే5099’ అనే ప్రయోగాత్మక ఔషధ సమ్మేళనాన్ని రూపొందించామని వివరించారు. -
బట్టతలకు సరికొత్త మందు!
బట్టతలపై జుట్టు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేశారా.. పసరు వైద్యం నుంచి ఆధునిక ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు అన్ని రకాల వైద్యం కోసం ప్రయత్నించి విసిగిపోయారా.. అయితే మీలాంటి వారికోసమే ఈ శుభవార్త. కొలంబియా యూనివర్సిటీ వైద్యులు బట్టతల పోయేందుకు ఓ సరికొత్త పరిష్కారం కనుగొన్నారు. అంతేకాదు కేవలం పది రోజుల్లోనే ఒత్తయిన జుట్టు వచ్చేలా చేయొచ్చని చెబుతున్నారు. కొన్ని రకాల ఎంజైమ్‌ల ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని కనిపెట్టారు. ఈ ప్రయోగాల ముఖ్య లక్ష్యం.. అలోపీసియా అరేటా (అకస్మాత్తుగా శరీరంపై కొన్ని ప్రాంతాల్లో జుట్టు ఊడిపోవడం) వ్యాధికి చికిత్స. అయితే బట్టతలలో తలపై జుట్టు ఊడిపోతుంది. అలోపీసియా వల్ల మాత్రం కొంత ప్రాంతంలోనే జుట్టు ఊడిపోతుంది. వెంట్రుకల కుదుళ్లలో జానస్ కైనేజ్ వర్గపు ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించే మందులు.. ఎలుకల్లో కొత్తగా వెంట్రుకలు వచ్చేలా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మందులను చర్మంపై పూయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధన బృందం సభ్యుడు క్రిస్టియానో తెలిపారు. తమ ప్రయోగాల్లో ఉపయోగించిన రెండు మందులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించిందన్నారు.