సాక్షి, హైదరాబాద్: బట్టతలను కవర్‌చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని మోసం చేశాడో యువకుడు. వివరాల్లోకెళ్తే.. కార్తీక్ వర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో తానొక ఎన్‌ఆర్‌ఐ అని చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. తనకు వివాహం కాలేదంటూ సోషల్ మీడియాలో కార్తీక్ వర్మ విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. ఆ ఫొటోలను చూసి చాలా మంది అమ్మాయిలు అతని వల్లో పడ్డారు. వీరితో కొద్దికాలం సన్నిహితంగా ఉండేవాడు.
చదవండి: (కాంట్రాక్ట్ ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. భరించలేక చివరికి..)
అనంతరం యువతుల ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బయపెడుతూ వారి వద్ద నుంచి డబ్బులు లాగేవాడు. అలా ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంది అమ్మాయిలనుమోసం చేశాడు. తాజాగా కూకట్‌పల్లిలో కూడా ఓ అమ్మాయితో చనువుగా ఉంటూ ఇలానే డబ్బులు లాగేసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న నార్త్‌జోన్ పోలీసులు కార్తీక్ వర్మను అరెస్ట్ చేశారు. అతడిపై పీడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!)
Comments
Please login to add a commentAdd a comment