
అంబర్‌పేట: ‘పూలొద్దు.. పుస్తకాలివ్వండి. పేద విద్యార్థులకు చేయూతనివ్వండి’ అంటూ ఎంపీ కిషన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే వారందరూ పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావడంపై ఎంపీ ఇలా స్పందించారు. వీటికి బదులు నోట్ పుస్తకాలు అందజేస్తే అవి తాను పేద విద్యార్థులకు అందజేస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు.
కిషన్‌రెడ్డి సూచనల మేరకు పలువురు అభిమానులు నోట్ పుస్తకాలను అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కిషన్‌రెడ్డికి నోట్ పుస్తకాలిచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రేమ్‌నగర్‌కు చెందిన హైమావతి పాఠశాల కరస్పాండెంట్ నిరంజన్, స్వామి దయానంద పాఠశాల కరస్పాండెంట్ రవికుమార్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, అజయ్‌కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment