
ఏళ్ల కరువు.. నేడు విరబూసింది
న్యూఢిల్లీ: ఏళ్ల కరువు తర్వాత ఆ భూభాగం విరబూసింది. ఎటు చూసిన ప్రకృతి అద్దిన సొబగుతో కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది దక్షిణ కాలిఫోర్నియా. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. దీంతో అక్కడి వ్యాలీలు వివిధ రకాల అడవి పువ్వులతో నవ్వుతున్నాయి.
వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పూదోటలు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాసా మాజీ ఉద్యోగులు అంతరిక్షం నుంచి తీసిన కొన్ని ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వర్షాలకు ముందు.. వర్షాలకు తర్వాత పరిస్ధితులు ఎలా ఉన్నాయన్నది ఫోటోల్లో క్లియర్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ వ్యాలీలకు సందర్శకులు తాకిడి బాగా పెరిగిపోయింది కూడా.
Behold! the California "super bloom" seen from space, brought to you by @KQEDscience. See more: https://t.co/X5jXvwY12I pic.twitter.com/bD9ZGAbPBZ
— Planet (@planetlabs) April 10, 2017