
నెలారంభంలో నీల కురింజి మొక్కలు పుష్పించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు.
బనశంకరి(కర్ణాటక): 12 ఏళ్లకు ఒకసారి వికసించే నీల కురింజి పూల సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో చిక్కమగళూరులో పర్యాటకుల సందడి నెలకొంది. గత నెలారంభంలో నీల కురింజి మొక్కలు పుష్పించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. పొరుగునున్న కేరళలోని మున్నార్ తో పాటు చిక్కమగళూరులోని పలు చోట్ల అడవులు, లోయల్లో నీల కురింజి అందాలు అలరిస్తున్నాయి. దీపావళి సెలువులు రావడంతో చంద్రదోణి అడవుల్లో నీల కురింజి వనాలు సందడిగా మారాయి.
చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం