ప్రకృతి.. తన వైవిధ్యాలతో మానవమాత్రుల్ని ఎప్పటికప్పుడు అబ్బురపరస్తూనే ఉంటుంది. గమ్మతైన అందాలతో నివ్వెరపరస్తూనే ఉంటుంది. బాతుల్ని పోలిన పువ్వులు.. వినడానికే వింతగా ఉంది కదూ! ఈ చిత్రాలను చూస్తే మీకే అర్థమవుతుంది. కలేనా మేజర్ ఆర్కిడ్ అనే జాతికి చెందిన మొక్క పువ్వులు అచ్చం ఎగురుతున్న బాతుల్లా ఉంటాయి.
చూడటానికి ఇవి రెక్కలు విచ్చుకుని పైకి ఎగురబోతున్నట్లే తారసపడతాయి. తూర్పు, దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ పూల తల భాగంపైన తాకితే చాలు.. వెంటనే టచ్ మి నాట్ మొక్కలాగా ముడుచు కుంటాయి. ఊహించని ప్రమాద సూచికగా భావించి, అమాంతం తలను వాల్చుకుని దాక్కున్నట్టుగా అలా ముడుచుకుంటాయన్నమాట. అద్భుతం కదూ!
Comments
Please login to add a commentAdd a comment