marcket
-
సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్-3 ఆగస్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సినిమా షూటింగ్‌లకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు కేంద్రం అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు జరుపుకోవాలని అనుమతులు జారీ చేసింది. (పంజాబ్ ప్రభుత్వం: బ్రేక్ పడిన సినిమా షూటింగులకు అనుమతి!) షూటింగ్ దగ్గర ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఇక చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. చిత్రీకరణలో పాల్గొనే నటీనటులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని సూచించింది. సినిమా షూటింగ్ సమయంలో విజిటర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కేంద్రం ఆదేశించింది. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలని పేర్కొంది. కాస్ట్యూమ్స్, లోకల్ మైక్‌లను ఎవరికి వారే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. -
216 మార్కెట్ కమిటీలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల మార్కెట్ కమిటీల పునర్వ్యస్థీకరణను పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక మార్కెట్ కమిటీ ఉండాలనే సూచనల మేరకు.. మార్కెట్ కమిటీలు లేని 25 నియోజకవర్గాలకు మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. వీటిన్నింటికీ ఈ నెలాఖరులోపు కమిటీలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్, సహకారశాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో గుంటూరులోని మార్కెటింగ్‌శాఖ స్పెషల్ కమిషనర్‌కు తెలియ చేయాలని కోరారు. 216 కమిటీల్లో 50 శాతం మహిళలకు, మిగిలిన 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వచ్చే విధంగా రిజర్వేషన్లు పాటించాలని సూచించారు. ఈ మేరకు మొత్తం 216 కమిటీల్లో 108 కమిటీలకు మహిళలు చైర్పర్సన్లుగా నియమితులు కానున్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులను మహిళలకు రిజర్వు చేస్తానన్న ముఖ్యమంత్రి హామీ ఈ ఉత్తర్వుల ద్వారా ఆచరణలోకి రానుంది. ఒక్కో మార్కెట్ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అధ్యకుడిగానూ, నలుగురు అధికారులు, ముగ్గురు వ్యాపారులు, 12 మంది రైతులు సభ్యులుగానూ ఉంటారు. వీరిలో రైతులు, వ్యాపారులకు ఓటు హక్కు ఉంటుంది. వీరే కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరులోపు పూర్తవుతుందని మార్కెటింగ్, మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. -
టేక్మాల్ మార్కెట్లో దొంగల హల్చల్
సాక్షి, టేక్మాల్(మెదక్): టేక్మాల్ మార్కెట్లో దొంగల బెడద అధికమైంది. కాస్త ఆదమరిస్తే చాలా వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంతకు ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. దీంతో ప్రతీవారం సంత కిక్కిరిసిపోతుంది. ఇదే అదును చేసుకుంటున్న తొంగలు రెచ్చిపోతున్నారు. అందికాడికి ఎదిదొరికితే అది ఎత్తుకుపోతున్నారు. పోలీసులకు సవాలుగా మారినా దొంగలు దొరకడంలేదు. అధికంగా సెల్ఫోన్ల చోరీ.. మార్కెట్లో కూరగాయాలకు వెళ్లే సామాన్య ప్రజల నగదను అపహరించుకుపోతున్నారు. కాస్త ఆదమరిచి వస్తువులు పెట్టినా మట్టుకున్నా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ వచ్చే వారి సెల్ఫోన్లో అపహరణ అధికమైంది. ఇటీవట టేక్మాల్‌కు చెందినా గర్శ శ్రీనివాస్, జంగంనాగరాజు, విశ్వనాథం, వీరన్న, శంకర్, రాజు, మాదవచారిలతో పాటూ పల్వంచ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాంకిష్టయ్య, బోయిని నారాయణ, సాయిరెడ్డి, నర్సిరెడ్డి ఫోన్లు అపహరణకు గురయ్యాయి. అవుసలి రమేశ్ నగదు పోయాయని వాపోతున్నారు. ఇలా వారానికి రెండు నుంచి సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నాయి. మార్కెట్‌కు కాస్త అజాగ్రత్త వహించినా వస్తువులు అపహరణకు గురువుతున్నాయని వాపోతున్నారు. కొందరు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. స్టేషన్లో ఫిర్యాదులు.. వారంతపు సంతలో నగదు పోయిందని, సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు పెరుగుతున్నా.. దొంగలు మాత్రం వారి ఆగడాలను ఆపడంలేదు. పోలీసులు సైతం వారంతపు సంతలో నజర్‌పెట్టి అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోతుంది. దొంగల ఆచూకి పోలీసులకు అంతుచిక్కకపోవడం లేదు. నిఘాను పెంచుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్లోని దొంగలతో పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశా.. గత వారం మార్కెట్లోకి కూరగాయాలు తీసుకోవడానికి వెళ్లాను. పదిహేను వేల రూపాయలగల విలువైన పోన్ అపహరణ గురయింది. ఎంత వెతికినా దొరకలేదు. దొంగల బెడద అధికమయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. మార్కెట్లోని దొంగలను పట్టుకోవాలి. – గర్శ శ్రీనివాస్, టేక్మాల్ పట్టుకుంటాం.. పిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్ రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతాం. మార్కెట్‌కు వెళ్లెవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానితులు కంటపడితే సమచారం ఇవ్వండి. దొంగలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – షాబొద్దీన్, ఎస్ఐ, టేక్మాల్ -
నేటి నుంచి పండ్లు, కూరగాయల రైతులకు ఫీజులు రద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో ఫీజును రద్దు చేసింది. ఈనెల 2వ తేదీన ప్రభుత్వం జీవో నం.58 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 22 మార్కెట్లలో బుధవారం నుంచి అధికారికంగా ఫీజు రద్దు అమలు చేయనున్నారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించకుండా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుల్లో ఉన్న కమీషన్ ఏజెంట్ల వ్యవస్థకు మంగళం పలికారు. ఇప్పటి వరకూ కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డుల్లో 4 నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ రద్దుతో రైతులకు ఊరట లభించనుంది. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలంటే ట్రేడర్స్‌గా మారాల్సి ఉంటుంది. వీరు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీంతో ఔత్సాహికులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రధానంగా మదనపల్లి, ఏలూరు, తెనాలి, బంగారుపాలెం, పుంగనూరు, రావులపాలెం వంటి మార్కెట్లలో అమలు కానుంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా.. రైతులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కిలో @1000
హొసూరు: వినాయకచవితిని పురస్కరించుకుని పూల ధరలకు రెక్కలొచ్చాయి. తమిళనాడులోని హొసూరు పూలమార్కెట్లో మంగళవారం నుంచే పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో కనకాంబరాలు రూ. వెయ్యికి అమ్ముడు పోతున్నాయి. చేమంతులు రూ. 150, మల్లెలు రూ. 250 నుంచి రూ. 300, రోజాలు రూ. 160 నుంచి రూ. 180, బంతిపూలు రూ. 30 చొప్పున విక్రయాలు సాగించారు. బుధ, గురువారాల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశముంది. పూల ధర అనూహ్యంగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.