
బీఎస్‌ఎన్‌ఎల్ లోకల్ కాల్ రేట్ల పెంపు
చంఢీఘర్: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ, బీఎస్‌ఎన్‌ఎల్, ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే లోకల్ కాల్ పల్స్‌ను తగ్గించింది. అంతేకాకుండా లోకల్ కాల్స్ చార్జీను 20 శాతం పెంచింది. ఒక బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి మరో బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్‌కు చేసే లోకల్ కాల్ పల్స్‌ను మూడు నిమిషాల నుంచి రెండు నిమిషాలకు తగ్గించామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. లోకల్ కాల్ చార్జీని రూ. 1 నుంచి రూ.1.20కు పెంచామని పేర్కొన్నారు.ఈ మార్పులు ఈ ఏడాది జనవరి బిల్లులో కనిపిస్తాయని వివరించారు.