బ్యాంకు స్టాక్స్ ఢమాల్
బ్యాంకు స్టాక్స్ ఢమాల్
Published Wed, Feb 8 2017 3:39 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
ముంబై : వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకు స్టాక్స్ ఢమాల్ మన్నాయి. రిజర్వు బ్యాంకు పాలసీ ప్రకటనాంతరం బ్యాంకు స్టాక్స్లో విపరీతంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 3.68 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.58 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.19 శాతం, ఎస్బీఐ 1.62 శాతం, కొటక్ మహింద్రా బ్యాంకు 1.55 శాతం నష్టపోయాయి. ఈ నష్టాలతో బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకు ఇండెక్స్ 0.55 శాతం డౌన్ అయి, 23,186.39 వద్ద ట్రేడైంది.
పాలసీ ప్రకటనాంతరం బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 180 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్లు ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా రిజర్వు బ్యాంకు ఇప్పటికి రెండు సార్లు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ మార్కెట్లు మాత్రం వడ్డీరేట్లలో 0.25 పాయింట్లు కోత విధిస్తుందని ఆశ పడ్డారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం వెలువరించింది.
Advertisement
Advertisement