Bank stocks
-
ఎఫ్ఐఐలను మెప్పిస్తున్న భారత్ బ్యాంకింగ్ షేర్లు
ఈ ఏడాది ఆరంభం నుంచి భారత ఈక్విటీ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగ షేర్లకు అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్ల పట్ల ఇప్పుడు విదేశీ ఇన్వెసర్ల వైఖరి మారింది. తాజాగా వారు ఈ రంగానికి చెందిన షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా వైరస్ ప్రేరిపిత లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవచ్చనే ఆశావహ అంచనాలతో కొన్ని విదేశీ ఫండ్లు బ్యాంకింగ్ రంగ షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటున్నాయి. ‘‘ఏ వ్యవస్థలోనైనా సైక్లి్ల్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థతో పాటు అక్కడి బ్యాంక్‌లు గణనీయమైన వృద్ధిని సాధించేందుకు గణనీయమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాలం దృష్టా్య భారత బ్యాంకింగ్ రంగ షేర్లను కొనుగోలు చేస్తున్నాము.’’ అని న్యూయార్క్‌ను చెందిన జీడబ్ల్యూఅండ్‌కే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్సంస్థ తెలిపింది. కఠినమైన రుణ ప్రమాణాలు కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు రానున్న 5ఏళ్లలో తమ ప్రత్యర్థి బ్యాంక్ షేర్లలో పోలిస్తే 94శాతం అధిక రాబడి ఇచ్చే అవకాశం ఉందని జీడబ్ల్యూఅండ్‌కే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంచనా వేసింది. ఈ రెండు బ్యాంకుల్లోకి డిపాజిట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంశం బ్యాంకుల లాభదాయకతను మరింత పెంచేందుకు తోడ్పడుతుందని ఫారిన్ ఫండ్ సంస్థ చెప్పుకొచ్చింది. దీర్ఘకాలికం దృష్ట్యా హెచ్డీఎఫ్సీ షేర్లపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నామని మరో అంతర్జాతీయ ఫండ్ మేనేజింగ్ కంపెనీ ఫిడిలిటీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. మార్చి 24న తర్వాత.... భారత్ స్టాక్ మార్కెట్లో వాల్యూయేషన్ పతనమైన, అధిక క్వాలిటీ కలిగిన ఫైనాన్షియల్ కంపెనీల షేర్లను ఈ ఫండింగ్ సంస్థ కొనుగోలు చేసింది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు, భీమా సంస్థల షేర్ల హోల్డింగ్స్‌ను పెంచుకుంది. ‘‘అధిక క్వాలిటీ కలిగిన ఫైనాన్స్ షేర్లను కొనుగోలును మేము ఇష్టపడతాము. ప్రభుత్వ జోక్యం, మొండిబకాయిలు పెరుగుతాయన్న భయాలతో మార్కెట్ తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ రంగం ఎక్కువగా ప్రభావితమైన మాట వాస్తవమే. అయితే మరోవైపు అధిక కొన్ని బ్యాంకింగ్ రంగ షేర్లు వాల్యూయేషన్ల పరంగా చారిత్రాత్మక కనిష్టస్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.’’ అని ఫిడిలిటీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అధికారి సమంత్ తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెసర్ట్ భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రతికూల అవుట్‌లుక్‌ను కేటాయించింది. అయితే దీన్ని గురించి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని సాల్ట్ లేక్ సిటీలోని వాసాచ్ అడ్వైజర్స్‌లో పని చేసే ఫండ్ మేనేజర్ అజయ్ కృష్ణన్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా బ్యాంక్ షేర్లపై తాను సానుకూల వైఖరిని కలిగి ఉన్నట్లు తెలిపారు. అలాగే తన పోర్ట్‌ఫోలియోలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కేటాయింపులు మరింత పెంచినట్లు తెలిపారు. ఈ షేరు ఫిబ్రవరి మధ్యలో జీవితకాల గరిష్టాన్ని తాకింది. నాటి నుంచి సగానికి పైగా విలువను కోల్పోయింది. కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు వ్యూహాత్మకంగా ఉన్నాయని అలాగే కోల్పోయిన నష్టాల కంటే అధికంగానే లాభాలను ఆర్జిస్తుందని ఆయన అంచాన వేస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ నిర్వహణ నాణ్యత ఆధారంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ షేర్ల కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్నట్లు కృష్ణన్ తెలిపారు. జనవరిలో స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిని తాకినప్పుడు, బ్యాంకింగ్ రంగ షేర్లు కొన్నేళ్ల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. మొండి బకాయిలు పెరుగుతాయనే భయాలతో పాటు 40ఏళ్ల తర్వాత ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవచ్చనే ఆందోళనలతో భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు ఇప్పుడు 2016 కనిష్టస్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు కేంద్రం రూ.21లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అలాగే ఆర్బీఐ వడ్డీరేట్లను 20 ఏళ్ల కనిష్టస్థాయికి తగ్గించింది. -
ఈ ర్యాలీ నిలిచేది కాదు!
బ్యాంకు షేర్లలో రెండు రోజులుగా వచ్చిన భారీ ర్యాలీ నిలబడేది కాదని, వాస్తవంగా ఈ రంగం చాలా తలనొప్పులు ఎదుర్కొంటోందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలువురు అనలిస్టులు, బ్రోకరేజ్‌లు ఫైనాన్షియల్ స్టాక్స్‌పై నెగిటివ్ ధృక్పధం వ్యక్తంచేయడంతో ఈ కౌంటర్లలో షార్ట్స్ బాగా పెరిగాయి. దీంతో ఎక్స్పైరీ సమయానికి భారీ షార్ట్‌కవరింగ్ జరిగింది. పైగా అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నట్లుండి అప్‌మూవ్ వేగంగా రావడం కూడా దేశీయ స్టాకుల ర్యాలీకి దోహదం చేసింది. అయితే ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇండియా మార్కెట్ ఇంకా వెనుకబడేఉంది. లాక్డౌన్ పాక్షిక సడలింపు, కొన్ని రంగాల్లో వ్యాపారం పునఃప్రారంభం.. వంటి వార్తలు మార్కెట్లో కొనుగోళ్లకు ప్రేరేపించాయి కానీ ఫైనాన్షియల్స్ మౌలికాంశాల్లో పెద్దగా పాజిటివ్ మార్పులు రాలేదు. కాకపోతే ఈ రంగం హైబీటా రంగం కాబట్టి పుల్బ్యాక్స్లో భారీ అప్మూవ్స్ చూపుతుంది. తాజాగా వచ్చిన అప్‌మూవ్ కూడా అలాంటిదేనని నిపుణుల అంచనా. ఇలాంటి ర్యాలీలు సాధారణంగా స్వల్పకాలం అంటే రెండుమూడురోజులుంటాయి. నిజమైన ర్యాలీ రావాలంటే వచ్చే 3-6 నెలల అనంతరం ఫైనాన్షియల్స్ ఎలా ప్రవర్తిస్తాయనేది చాలా కీలకం. ఈ పరిస్థితుల్లో గుడ్డిగా బ్యాంకు స్టాకులు నమ్మే కన్నా ఫార్మాలో దిగ్గజాలైన సన్ ఫార్మా, అరబిందో వంటి షేర్లను పరిశీలించవచ్చని అనలిస్టులు సూచిస్తున్నారు. -
బ్యాంకింగ్ దన్ను- డోజోన్స్‌కు జోష్
ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్‌కు డిమాండ్ పెరగడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు బుధవారం యూఎస్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్ 553 పాయింట్లు(2.2 శాతం) జంప్‌చేసి 25,548 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ ఇండెక్స్ 44 పాయింట్లు(1.5 శాతం) బలపడి 3,036 వద్ద నిలవగా.. నాస్డాక్ 72 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 9,412 వద్ద స్థిరపడింది. మార్చి 5 తదుపరి ఎస్అండ్పీ 3,000 పాయింట్ల ఎగువన ముగియడం గమనార్హం! పలు రాష్ట్రాలలో లాక్‌డవున్ ఎత్తివేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కనున్న అంచనాలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఇటీవల కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ అభివృద్ధిలో పలు కంపెనీలు ముందడుగు వేయడం కూడా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాలు ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలకు కారణమవుతున్నట్లు వివరించారు. జేపీ మోర్గాన్ ప్లస్ బ్యాంకింగ్ దిగ్గజాలలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గోల్డ్‌మన్ శాక్స్ 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. జేపీ మోర్గాన్ చేజ్ దాదాపు 6 శాతం జంప్‌చేసింది. రెండో క్వార్టర్లో క్రెడిట్ రిజర్వ్‌లను పెంచుకోనున్నట్లు బ్యాంక్ సీఈవో జేమీ డైమన్ పేర్కొనడంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్ జోరందుకుంది. ఈ బాటలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గోల్డ్‌మన్ శాక్స్ సైతం పుంజుకోవడంతో బ్యాంకింగ్ ఇండెక్స్ రెండు రోజుల్లో 10 శాతం ఎగసింది. కాగా.. లాక్‌డవున్ ఎత్తివేయడంతో ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్ థీమ్ పార్క్‌ను జులై 11 నుంచి దశల వారీగా ప్రారంభించనున్నట్లు వాల్ట్ డిస్నీ వెల్లడించింది. ఈ బాటలో లాస్‌వెగాస్‌లోని నాలుగు క్యాసినోలను జూన్ 4 నుంచీ తిరిగి తెరవనున్ననట్లు ఎంజీఎం రిసార్ట్స్ పేర్కొంది. దీంతో ఈ షేరు 2.6 శాతం పుంజుకుంది. ఎస్అండ్పీ ఇండెక్స్‌లో 7 షేర్లు 52 వారాల గరిష్టాలను తాకగా.. నాస్డాక్ కంపెనీలలో 41 కొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మరో 10 కంపెనీలు కొత్త కనిష్టాలకు చేరాయి. ఇతర కౌంటర్లూ లాక్‌డవున్ ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇటీవల అమ్మకాలతో దెబ్బతిన్న కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. క్రూయిజ్ నిర్వాహక కంపెనీ కార్నివాల్ కార్ప్ 6 శాతం జంప్‌చేయగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 4 శాతం పుంజుకుంది. జీఈ లైటింగ్ బిజినెస్ విక్రయ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్ 7 శాతం పెరిగింది. హెచ్‌బీవో మ్యాక్స్ సర్వీసులను ప్రారంభించడంతో ఏటీఅండ్‌టీ 4 శాతం ఎగసింది. ట్రాక్టర్ల కంపెనీ టీఎస్సీవో 8 శాతం జంప్‌చేయగా.. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్విటర్ మాత్రం 3 శాతం పతనమైంది. -
ఇప్పట్లో బ్యాంకు షేర్లు వద్దు!
మారిటోరియం పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణసాయం పెంపు, లాక్డౌన్.. తదితర కారణాలు బ్యాంకులపై ఒత్తిడిపెంచుతాయని, అందువల్ల స్వల్పకాలానికి బ్యాంకు షేర్ల జోలికి పోవద్దని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజాగా ఆర్బీఐ ప్రకటించిన రేట్ కట్‌ను మార్కెట్ ఊహిస్తూనే ఉందన్నారు. రుణాల రిస్ట్రక్చరింగ్తో సహా ఇతర మద్దతు చర్యలు ప్రకటించకపోవడం బ్యాంకులకు ఇబ్బందికరమన్నారు. దీనికితోడు మారిటోరియం పొడగింపు కొత్తగా ఎన్పీఏలను పెంచవచ్చన్న భయాలు పెరిగాయని వివరించారు. ఇదే నిజమైతే క్రమంగా బ్యాంకుల బాలెన్స్ షీట్స్ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఎకానమీని రక్షించేందుకు ఆర్బీఐ ప్రకటించిన చర్యలు బ్యాంకులు లాభదాయకం కాదని అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్స్ రంగంలో ఒడిదుడుకులున్నందున ఇన్వెస్టర్లు కొత్తగా బ్యాంకు షేర్లలో పెట్టుబడులు మానుకోవాలని సామ్కో సెక్యూరిటీస్ సూచించింది. కరోనా సంక్షోభ పరిణామాలు పూర్తిగా బహిర్గతం అయి, బ్యాంకుల పద్దు పుస్తకాలపై భారం లేదని తెలిసిన అనంతరం వీటిని పరిశీలించవచ్చని తెలిపింది. వాల్యూషన్లు బాగా తక్కువగా ఉన్నాయని బ్యాంకు షేర్లను ఎంచుకోవడం సరికాదని సూచించింది. ఇప్పటికే బ్యాంకు షేర్లలో పెట్టుబడులు ఉన్న వాళ్లు హెడ్జింగ్ కోసం ఇతర రంగాల్లో బలమైన షేర్లను ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. నిఫ్టీకి ఈ వారం 8700 పాయింట్ల వద్ద మద్దతు, 9200 పాయింట్ల వద్ద నిరోధం ఉన్నట్లు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం అమ్మకాలకు దిగుతున్న ప్రస్తుత సందర్భంలో రిటైల్ ఇన్వెస్టర్లు నగదు చేతిలో ఉంచుకొని ఓపికగా వేచిచూడడం మంచిదని, రాబోయే వారాల్లో మార్కెట్లో మరింత ఇబ్బందులు ఉండొచ్చని అంచనా వేసింది. -
మాంద్యం కోరల్లో!
ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్‌ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది. మాంద్యం భయాలు... భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్‌లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్‌ను కూడా నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం ‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు 24 శాతం, పవర్‌గ్రిడ్ 12 శాతం, కోటక్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ 11 శాతం చొప్పున, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 శాతం, ఎన్టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది. భారత్ ‘వృద్ధి’కి ఎస్ అండ్ పీ కోత న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ, అమెరికా, యూరోప్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్‌లో ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్ అంచనావేసింది. 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది. క్రూడ్, బంగారం మరింత పతనం కోవిడ్–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. ► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ► ఇక క్రూడ్ విషయానికి వస్తే, స్వీట్ బ్యారల్ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ఆయిల్ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బ్యాంకు స్టాక్స్ ఢమాల్
ముంబై : వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకు స్టాక్స్ ఢమాల్ మన్నాయి. రిజర్వు బ్యాంకు పాలసీ ప్రకటనాంతరం బ్యాంకు స్టాక్స్‌లో విపరీతంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 3.68 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.58 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.19 శాతం, ఎస్బీఐ 1.62 శాతం, కొటక్ మహింద్రా బ్యాంకు 1.55 శాతం నష్టపోయాయి. ఈ నష్టాలతో బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకు ఇండెక్స్ 0.55 శాతం డౌన్ అయి, 23,186.39 వద్ద ట్రేడైంది. పాలసీ ప్రకటనాంతరం బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 180 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్లు ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా రిజర్వు బ్యాంకు ఇప్పటికి రెండు సార్లు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ మార్కెట్లు మాత్రం వడ్డీరేట్లలో 0.25 పాయింట్లు కోత విధిస్తుందని ఆశ పడ్డారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం వెలువరించింది.