Rajamouli Thanks To YS Jagan And KCR On Movie Tickets Prices Revised - Sakshi
Sakshi News home page

Rajamouli Thanks To YS Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు జక్కన్న కృతజ్ఞతలు..

Published Wed, Mar 9 2022 12:43 PM | Last Updated on Wed, Mar 9 2022 1:38 PM

Rajamouli Thanks To YS Jagan And KCR On Movie Tickets Prices Revised - Sakshi

Rajamouli Thanks To YS Jagan And KCR: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దర్శక ధీరుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఈ విషయంపై మెగాస్టార్‌ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం (మార్చి 8) తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. తాజాగా జక్కన్న కూడా ఈ విషయంపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ వ్యక్తపరిచారు. 
 


ఈ పోస్ట్‌లో 'కొత్త జీవోతో టికెట్ల ధరలు సవరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయం చేసినందుకు ఏపీ సీం జగన్‌ గారికి, మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాను.' అంటూ రాసుకొచ్చారు జక్కన్న. అలాగే తెలంగాణ ముఖమంత్రి చంద్రశేఖర్ రావుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. 'పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు నిరంతరం మద్దతు ఇచ్చిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్ గారికి ధన్యవాదాలు.' అంటూ జక్కన్న ట్వీట్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement