కర్నూలు: 'అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి' అన్నట్టుగా తయారైంది గుబాళించే మల్లె పూల పరిస్థితి. మార్కెట్‌లో మల్లెపూల ధర రోజు రోజుకూ పతనం అవుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో సుమారు 400 మంది రైతులు.. 500 ఎకరాల్లో మల్లెతోటలను సాగు చేస్తున్నారు. కిలో పూలు తెంచినందుకు రూ. 40 కూలిగా ఇవ్వాల్సి వస్తుంటే.. మార్కెట్లో కిలో ధర రూ. 20 పలుకుతోంది. దీంతో ఆర్థిక భారాన్ని భరించలేక పూలను తోటల్లోనే తెంచకుండా వదిలేస్తున్నారు. కూలీల ఖర్చులను భరించి కొంత మంది పూలను కోయించి హైదరాబాద్ తరలించినా అక్కడ కూడా ధర వెక్కిరిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.8 ప్రకారం కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
చిన్నబోయిన 'మల్లె'
Published Wed, Jul 1 2015 8:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement