Mahesh Babu and Namrata Shirodkar's AN Restaurant Price Menu Card Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu AN Restaurant: మహేశ్‌ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్‌, రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..!

Published Fri, Dec 9 2022 4:52 PM | Last Updated on Fri, Dec 9 2022 5:51 PM

Mahesh Babu Wife Namrata Shirodkar AN Restaurant Menu Card Goes Viral - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం SSMB28 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్త రాణిస్తున్నాడు. ఇప్పటికే తన పేరుతో ఏషియన్‌ మూవీ థియేటర్‌ను రన్‌ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్‌గా రెస్టారెంట్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మినర్వా కాఫీ షాప్‌, ప్యాలెస్‌ హైట్స్‌ రెస్టారెంట్‌తో టై అప్‌ అయిన నమ్రత ఏషియన్‌ గ్రూప్స్‌ ఏఎన్‌(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక మహేశ్‌ రెస్టారెంట్‌ కావడంతో ఆయన ఫ్యాన్స్‌ అంతా అక్కడి వెళ్లి విందును ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు. అయితే రెస్టారెంట్‌ మెను, రేట్స్‌ ఎలా ఉంటాయనేది ఆసక్తిని సంతరించుకుంది.

ఈ క్రమంలో ఏఎన్‌ రెస్టారెంట్‌కు సంబంధించిన ఓ మెను కార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మెను కార్డులో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ నుంచి సాయంత్రం స్నాక్స్‌ వరకు అన్ని అక్కడ అవలెబుల్లో ఉన్నాయి. ఇడ్లీ నుంచి సాయంత్రం పునుగుల, మిర్చిబజ్జీ ఇలా చాలా రకరకాల  స్నాక్‌ ఐటెంస్‌ అందుబాటులో ఉన్నాయి. మరి వాటి రేట్స్‌ ఎలా ఉన్నాయంటే ఒక ప్లేట్‌ ఇడ్లీ రూ. 90 నుంచి ముదలై రూ. 120 వరకు ఉన్నాయి. ఇక పూరీ ప్లేట్‌ రూ. 170 కాగా దోశ రూ. 120 నుంచి స్టార్ట్‌ అయ్యి రూ. 250 వరకు ఉంది. ఇక సాయంత్రం స్నాక్స్‌ వచ్చేసి రూ. 125గా ఉన్నాయి. ఏ స్నాక్స్‌ అయినా అక్కడ రూ. 125గా ఉన్నాయి. అయితే బిర్యానీ మాత్రం రూ. 450 నుంచి ఉన్నట్లు సమాచారం. ఇక స్టాటర్స్‌, సూప్స్‌ కూడా రూ. 300పైనే ఉన్నాయి. ప్రస్తుతం మహేశ్‌ ఏఎన్‌ రెస్టారెంట్‌ మెను నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

చదవండి: 
ఘనంగా సీరియల్‌ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్‌
థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement