menu card
-
State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైట్ హౌస్‌లో పసందైన విందు ఇచ్చారు బైడెన్ దంపతులు. మోదీ శాకాహారీ కావడంతో వైట్ హౌస్ చెఫ్ నీనా కర్టిస్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీంతో మోదీ కోసం తొలిసారిగా వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును ఏర్పాటు చేశారు. విందులో మోదీకి ఇష్టమైన వంటలకాలకు అమెరికన్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. మోదీ వెజెటేరియన్ కావడంతో ఆయనకు వడ్డించే మెనూపై అందరి దృష్టి పడింది. ఫుడ్ మెనూలో ఏమేం ఐటెమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మోదీకి ఇచ్చిన డిన్నర్ మెనూలో ప్రత్యేకమైంది మిల్లెట్స్. తృణధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న మోదీ కోసం ప్రత్యేకంగా మేరినేటెడ్ మిల్లెట్స్‌ను డిన్నర్ మెనూలో చేర్చారు. ఫస్ట్కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్ట్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, టాంగీ అవకాడో సాస్ అందించారు. ఆ తర్వాత మెయిన్ కోర్సులో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డించారు. చివరగా స్ట్రాబెర్రీ కేక్‌తో వైట్ హౌస్‌లో డిన్నర్ విందును ముగించారు. -
మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, రేట్స్ ఎలా ఉన్నాయంటే..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం SSMB28 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్త రాణిస్తున్నాడు. ఇప్పటికే తన పేరుతో ఏషియన్ మూవీ థియేటర్‌ను రన్ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్‌తో టై అప్ అయిన నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక మహేశ్ రెస్టారెంట్ కావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా అక్కడి వెళ్లి విందును ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు. అయితే రెస్టారెంట్ మెను, రేట్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తిని సంతరించుకుంది. ఈ క్రమంలో ఏఎన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఓ మెను కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మెను కార్డులో ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు అన్ని అక్కడ అవలెబుల్లో ఉన్నాయి. ఇడ్లీ నుంచి సాయంత్రం పునుగుల, మిర్చిబజ్జీ ఇలా చాలా రకరకాల స్నాక్ ఐటెంస్ అందుబాటులో ఉన్నాయి. మరి వాటి రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక ప్లేట్ ఇడ్లీ రూ. 90 నుంచి ముదలై రూ. 120 వరకు ఉన్నాయి. ఇక పూరీ ప్లేట్ రూ. 170 కాగా దోశ రూ. 120 నుంచి స్టార్ట్ అయ్యి రూ. 250 వరకు ఉంది. ఇక సాయంత్రం స్నాక్స్ వచ్చేసి రూ. 125గా ఉన్నాయి. ఏ స్నాక్స్ అయినా అక్కడ రూ. 125గా ఉన్నాయి. అయితే బిర్యానీ మాత్రం రూ. 450 నుంచి ఉన్నట్లు సమాచారం. ఇక స్టాటర్స్, సూప్స్ కూడా రూ. 300పైనే ఉన్నాయి. ప్రస్తుతం మహేశ్ ఏఎన్ రెస్టారెంట్ మెను నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. చదవండి: ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్ థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ప్లీనరీ కోసం వంటలు ఎలా చేస్తున్నారో చూడండి
-
YSRCP Plenary 2022: కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. అందరికీ ఒకే మెనూ ► ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. ► ఇందుపల్లి, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వంట వాళ్లను రప్పించారు. గురువారం సాయంత్రం నుంచే వారు పని ప్రారంభించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో వేడి వేడిగా టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించనున్నారు. ► ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్ బజ్జీలను శుక్ర, శనివారం ఉదయం టిఫిన్లుగా అందిస్తారు. 25 రకాల వంటకాలతో భోజనాలు అందించనున్నారు. శాఖాహారం, మాంసాహార భోజనాలను వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు. చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే) -
ఇడ్లీదే గెలుపు, తందూరీ గట్టి ప్రయత్నం.. ఐపీఎల్ స్పెషల్ మెనూ!
ఇదేదో హోటల్, రెస్టారెంట్ మెనూ కాదు. ఐపీఎల్ స్పెషల్ మెనూ. ఎవరూ తయారు చేశారంటే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా. సామాజిక, సమకాలీన అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తుంటారు. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీని రెస్టారెంట్ మెనూతో పోల్చుతూ ఆయన ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, జర్నలిస్టులు ఏదైనా బిగ్ టోర్నీకి ముందు డ్రీమ్ 11, ఆల్‌టైం గ్రేట్ ఇలా రకరకాల పేర్లతో టీమ్‌లను ప్రకటిస్తుంటారు. హర్ష్‌గోయెంకా కొంచెం వెరైటీగా ప్రయత్నించారు. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఆధారంగా టీమ్ పెర్ఫార్మెన్స్లను అంచనా వేస్తూ... ఆయా జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలలో ఫేమస్ వంటకాలతో పోల్చుతూ ఐపీఎల్ మెనూని తయారు చేశారు. ఐపీఎల్ స్పెషల్ మెనూలో రసగుల్లాపై ఇడ్లీ విజయం సాధించిందంటూ ఐపీఎల్ ఫైనల్‌కి పోలికి పెట్టారు. తందూరీ నాన్ గట్టినా ప్రయత్నించినా ఫలితం లేదని బిసబెళబాత్ చూడటానికి బాగుంది కానీ అంటూ ఇలా ఫన్నీ పోలీకలతో ట్వీట్‌ని నడిపించారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మెనూ కార్డులో బిర్యానీకి ఆఖరి స్థానం దక్కిందన్నారు హర్ష్ గోయెంకా. #IPL MENU Idli wins decisively against rasgulla in final! Tandoori nan tried hard… Bisi bele bhaath was looking delicious but… 5 times champion vadapaav was out. Lassi also couldn't make it to last 4. Daal baati was outclassed. Biryani remained at the bottom of the menu card. — Harsh Goenka (@hvgoenka) October 15, 2021 -
థ్యాంక్యూ...
మెట్రో కథలు - 20 మెనూ కార్డ్ ముందుకు తోశాడు. ఫస్ట్‌టైమ్ అలా చేయడం. ఏంటిది?... ఆర్డర్ చెప్పు. నేనా... నేనెప్పుడైనా చెప్పానా... నన్నెప్పుడైనా చెప్పనిచ్చావా?... ఎందుకు మాటలనడం. ఇప్పుడు చెప్పొచ్చుగా. తీసుకొని తిరగేసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పాపను అడిగింది. ఏంవే... ఏం చెప్దాం... దానికేం తెలుసు? తల్లి వైపు చూసి ఫోర్కులతో ఆట కొనసాగించింది. మెనూ కార్డ్ తిరిగి ఇచ్చేస్తూ అంది. నువ్వే చెప్దూ... సాధారణంగా రెండు నాన్, ఒక వెజ్ కర్రీగానీ నాన్ వెజ్ కర్రీగానీ, ఒక బిరియానీ, కర్డ్ రైస్ చెప్తాడు. స్టాండర్డ్. ఎప్పుడు వచ్చినా అంతే. అలా అలవాటు చేశాడు. వెజ్ నూడుల్స్ ఇష్టం. ఎప్పుడూ అడగలేదు తింటావా అని. గోంగూర మటన్ ఇష్టం. అదీ అడగలేదు ఎప్పుడైనా కావాలా అని. పాపకు వెనిల్లా ఇష్టం. కాని ఎప్పుడూ టూ బై త్రీ బటర్ స్కాచ్ చెప్తాడు. ఇవాళ ఛాయిస్ తనకు ఇస్తున్నాడు. పెళ్లికి తీసుకెళ్దామని మస్కా వేస్తున్నాడేమో. కల్లో కూడా జరగని పని. నవ్వుతూనే అంది- పెళ్లికి ప్లాన్ చేస్తున్నావా... చచ్చినా రాను... అబ్బెబ్బే... అని ఊరుకున్నాడు. సొంత బాబాయి కొడుకు పెళ్లి. బాబాయి కొడుకే అయినా బాగా చనువు ఎక్కువ. సొంత తమ్ముడి కంటే ప్రేమగా ఉంటాడు. వెళ్లకపోతే ఎలా? ముందు రోజే చర్చ జరిగింది. రచ్చ అనాలేమో. నేను రానుగాక రాను. మా పిన్నికూతురి పెళ్లికి వెళ్దామంటే నువ్వొచ్చావా? ఆఫీస్‌లో వీలుగాదని ఎగ్గొట్టావ్. కనిపించిన ప్రతి మహాతల్లి మీ ఆయనెక్కడే మీ ఆయనెక్కడే అని అడుగుతుంటే తల ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా? ఆ నొప్పి నీకు తెలియాలి. రాను. పెటేల్మని ఒక్కటి పీకాడు. కొట్టు. చంపు. రాను గాక రాను. మళ్లీ ఒక్కటి. మీ వాళ్లంతా నీ పెళ్లాం ఎక్కడ్రా నీ పెళ్లాం ఎక్కడ్రా అని అడుగుతుంటే అప్పుడు చెప్పు సమాధానం. మీ అక్క నా మీద ఏదో ఎక్కిస్తే పెళ్లికి ఎగ్గొడ్తావేం... రాత్రి ఇద్దరూ సరిగ్గా నిద్ర పోలేదు. తెల్లారి బ్రేక్‌ఫాస్ట్ మీద అలిగి వచ్చేశాడు. తినూ తినూ తినేసి పో అని తనూ యాక్టింగ్ చేయలేదు. పనేదో చేస్తున్నాడు. సడన్‌గా తేడాగా అనిపించింది. ఒళ్లు తేలిగ్గా అవుతున్నట్టు... స్పృహ తప్పుతున్నట్టు.... తెలియని ఆందోళనగా... దడగా... గుటక పడుతూ... గుండెపోటుకు సూచనలా... కలీగ్కి చెప్తే కంగారు పడిపోయి ఆఫీస్ వెహికల్లో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. డాక్టర్ ఎవరో మంచోడే. పల్స్ అదీ చెక్ చేసి- ఏం కాలేదు... సరదా ఉంటే చెప్పండి టెస్ట్‌లు రాస్తాను... రెండు మూడు వేలవుతాయి అన్నాడు. ఈసీజీ కూడా వద్దన్నాడు. ఒకటి రెండు గ్లాసులు మంచినీళ్లు తాగమని, తాగనిచ్చి అడిగాడు- దేనికైనా టెన్షన్ పడుతున్నారా? మొహమాటంగా చెప్పాడు. మామూలే. ఇంట్లో చిన్న చిన్న గొడవలు. అందుకే యాంగ్జయిటీ. ప్రిస్కిప్షన్ మీద ఏదో టాబ్లెట్ రాశాడు. చింపుతూ అన్నాడు- దీని కంటే మీకో చిన్న సూఫీ కథ బాగా పని చేస్తుంది. ఒక సూఫీ తన శిష్యులతో రెండేళ్లుగా దేశాటన చేస్తున్నాడట. ఏ ఊరికెళ్లినా ఆదరించేవాళ్లకి కొదవే లేదట. పెట్టే కంచం కడిగే కంచం. ఒక ఊరికెళితే ఆ ఊరి వాళ్లు బాగా తిక్క మీద ఉన్నారట. అసలే వానల్లేక తిండి గింజలకు నానా అవస్థలు పడుతుంటే పడి మేయడానికి వచ్చారట్రా అని కర్రలు తీసుకుని వెంటపడ్డారట. సూఫీ తన శిష్యులతో పరిగెత్తుకుంటూ ఊరు దాటి ఒక్కసారిగా మోకాళ్ల మీద కూలబడి దేవుడికి పదే పదే కృతజ్ఞతలు మొదలుపెట్టాడట. శిష్యులు ఆశ్చర్యపోయి వ్యంగ్యాలు పోతూ- ఎందుకు స్వామీ దేవునికి కృతజ్ఞతలు... ఈ ఊరి వాళ్లు అన్నం పెట్టనందుకా అని అడిగారట. కాదురా... ఇన్నాళ్లూ అన్ని ఊళ్ల వాళ్లు అన్నం పెట్టినందుకు... పెట్టినన్నాళ్లు దేవుని దయ తెలియలేదు... ఇప్పుడే కదా తెలిసింది అని మళ్లీ కృతజ్ఞతలకు మళ్లుకున్నాడట. అర్థ మైందా... చూస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద సిటీ. రోడ్లు బాగుండవు. ట్రాఫిక్‌కు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వేసి ఉంటారు. మేన్హోళ్లు. ఇక ఈ మెట్రో రైలు పనులతో అదో తలనొప్పి. చాలక చైన్ స్నాచర్లు. చీటర్లు. ఫ్రాడ్ మాస్టర్లు. నోట ఏది పెట్టినా కల్తీ ప్లస్ పొల్యూషన్. తోడు పనిచోట రాజకీయాలు ప్రాంతాలను బట్టి స్పర్థలు. ఇవి ఇచ్చే స్ట్రెస్ చాలదా... మళ్లీ ఇంట్లో కూడా స్ట్రెస్ జనరేట్ చేస్తున్నారా? గ్యాప్ ఇచ్చి అన్నాడు. థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. మీకో పెళ్లాం ఉన్నందుకు థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. మీ పెళ్లానికి మీరున్నందుకు ఆమెను థ్యాంక్‌ఫుల్‌గా ఉండమనండి. మీ ఇద్దరూ ఇవాళ డిన్నర్‌కు వెళ్తే గనక అంతటి మహద్భాగ్యం కలిగించిన దేవునికి థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. అసలు ప్రాణాలతో ఉన్నందుకు మొదట థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి సార్... ఈ గొడవలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి... సాయంత్రం కిక్కురుమనకుండా నేరుగా ఇంటికి చేరుకుని డిన్నర్ ప్లాన్ చేశాడు. కాని పెళ్లికి ఐస్ చేస్తున్నాడేమోనని అనుమానపడుతోంది. చెప్పేశాడు- పెళ్లికి వద్దులే. అదేం పెద్ద విషయం కాదు. తర్వాత చూద్దాం. ఆశ్చర్యంగా చూసింది. అదేంటి? అవును. అలగడానికీ సాధించడానికీ బోలెడన్ని చాన్సులు వస్తాయి. కాని పెళ్లి మాటిమాటికీ చేసుకోరుగా. మీ పిన్నికూతురి పెళ్లికి నేను రావాల్సింది. తప్పు చేశాను. సారీ. దానికి ఇది విరుగుడు. ఇక ఇంతటితో వదిలేద్దాం. నవ్వింది. ఇంటికి ఎటు నుంచి వచ్చావ్? ఏదైనా తొక్కి వచ్చావా ఏంటి? ఇక ఈ దెప్పిపొడుపు మాటలు వదిలేద్దాం. ప్లీజ్. విసుగ్గా ఉంది. బయట ఉన్న తలనొప్పులు దేశాన ఉన్న తలనొప్పులు చాలవా పడ్డానికి. నువ్వూ నేనూ కూడా ఎందుకు బాధించుకోవడం. హ్యాపీగా ఉందాం సరేనా. గోంగూర మటన్ చెప్పనా? సీరియస్‌గా చూసింది. నిజం చెప్తున్నావా? నిజం. ఫోర్క్‌తో ఖాళీ ప్లేట్‌ను రెండు సార్లు మోగించింది. ఏం అక్కర్లేదు. వెళ్దాంలే. పర్లేదు. వెళ్దాం అంటున్నాగా. వెజ్ నూడుల్స్, వైట్ రైస్, గోంగూర మటన్ చెప్పాడు. చివర్లో వెనిల్లా తెమ్మని కూడా. మళ్లీ అన్నాడు. మీ అమ్మ మీ అన్నయ్య దగ్గర ఉండటానికి ఇబ్బంది పడుతున్నదని తెలుసు. కావాలంటే కొన్నాళ్లు మన దగ్గర పెట్టుకుందాం. డ్రామా కాదు. నిజంగానే చెప్తున్నా. ఇంకా నీకేదైనా మనసులో ఉంటే అది చెప్పకుండా సాధించే పనిలో మాత్రం దిగకు. వినడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాదో రిక్వెస్ట్. అమ్మను చూడ్డానికి ఊరికెళ్లి చాలా రోజులైంది. నువ్వు ప్లాన్ చేస్తే రెండ్రోజులు ఉండి వచ్చేద్దాం. తల కిందకు వంచి ఫోర్క్‌ను టేబుల్ మీద గుచ్చుతూ అలాగే ఉండి తలెత్తి చూసింది. మొగుడూ పెళ్లాల కళ్లు. ఏం మాట్లాడుకుంటాయో ఎవరికి తెలుసు. మెల్లగా నవ్వి తేలిక పడింది. సరే. పాపకు నెక్ట్స్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయ్. అవి అయ్యాక వెళ్దాం. ఈలోపు బీపీ మెషీన్ ఒకటి పంపు. ఎన్నాళ్ల నుంచో అడుగుతోందిగా. పాపం సంతోషపడుతుంది. థ్యాంక్యూ... ఓయబ్బా... థ్యాంక్యూ... టూ వీలర్ మీద మధ్యలో కూచోబెట్టుకుంటే పాప దారిలోనే నిద్రపోయింది. ఫ్లాట్‌కు వచ్చాక జాగ్రత్తగా ఎత్తుకొని నిద్రపుచ్చి చీర మార్చుకుని నైటీ తొడుక్కుంది. ఇందాక కావాలని పెట్టుకోలేదు. ఇప్పుడు ఫ్రిజ్ తెరిచి పాలిథిన్ కవర్లో దాచిన ఆ కాసిని విరజాజులని తలలో తురుముకుంది. హాల్లోకొచ్చి అంది- ఇంకా టీవీ ఎంత సేపు చూస్తావ్... రారాదూ? ఊ..ఊ.. అంటూ టీవీ ఆఫ్ చేసి లేచి వచ్చాడు. నడుం మీద చేయి వేసింది. పొట్ట పెరిగింది. తగ్గించరాదూ? తగ్గిస్తా. కొంచెం ట్రై చేసి ఇలాగే హ్యాపీగా ఉందాం. సరేనా? సరే. థ్యాంక్యూ... ఈసారి కాలు వేసింది. మొగుడూ పెళ్లాల చేష్టలు. ఆ తర్వాతి చేష్ట ఏమిటో మనకు మాత్రం ఏం తెలుసు? - మహమ్మద్ ఖదీర్‌బాబు గమనిక: 20 కథల ఈ మెట్రో సిరీస్ ఇంతటితో ముగిసింది. ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు. - రచయిత, 9701332807 -
అంధుల కోసం స్పెషల్ మెనూ!
‘బ్రెయిలీ లిపి’ అంధులకు లూయీ బ్రెయిలీ అందించిన అద్భుత సదుపాయం. దీన్ని ఆధారం చేసుకుని అనేక విషయాల్లో అంధులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ‘ఓమ్’ అనే రెస్టారెంట్ అంధుల కోసం ప్రత్యేకంగా మెనూ కార్డ్‌ను తయారుచేసింది. రుచిగా, శుచిగా ఆహారాన్ని అందిస్తుందనే పేరున్న ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ మెనూకార్డ్ను బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసి అందుబాటులో ఉంచింది. దీర్ఘ దృష్టి సమస్య ఉన్న వారి కోసం కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండే ఈ మెనూ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వారు అంధులకు ఈ సౌకర్యం తీసుకురావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఓమ్ రెస్టారెంట్‌కు పక్కగా ఒక ఎన్జీవో ఆఫీస్ ఉంటుంది. విజువల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ కోసం పనిచేసే ఆ సంస్థ కార్యాలయానికి చాలామంది అంధులు వస్తుంటారు. పని మీద ఆ ఎన్జీవో ఆఫీస్‌కు వచ్చి, తినడానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్ ఓనర్లు ఈ అవకాశాన్ని కల్పించారు. తమకు కావలసిన ఆహారం గురించి చదువుకొని.. ఆర్డర్ చేసేంత కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది రెస్టారెంట్. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ మెనూ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తాము చేసిన పనికి ప్రచారం వస్తోందని, అనేక మంది రెస్టారెంట్ ఓనర్లు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఓమ్ రెస్టారెంట్ ఓనర్లు తెలిపారు.